ప్రజా సమస్యలపై పోరాటం | Fighting public issues | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాటం

Published Tue, Jul 8 2014 1:51 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ప్రజా సమస్యలపై పోరాటం - Sakshi

ప్రజా సమస్యలపై పోరాటం

 నరసన్నపేట: ప్రజా సమస్యలపై శాసన సభలో, జిల్లాలో పోరాటం చేస్తామని రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, వి.కళావతి అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ జన్మదినోత్సవ వేడుకలు నరసన్నపేటలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ చేపట్టే ప్రతి ప్రజావ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాటాలు చేస్తామన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కల్లెదుటే కోట్లాది రూపాయల ఇసుక అక్రమ దందా నడుస్తుంటే పట్టించుకోని అధికార పార్టీ నేతలు ఇతర పార్టీ నాయకులపై అవినీతి గురించి మాట్లాడుతుంటే ఏ మనుకోవాలో తెలియడం లేదన్నారు.
 
 ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు అడ్డదారిలో వ్యవహరిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. బాధ్యతాయుతంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు ఏ మాత్రం ఇబ్బందులు ఎదురైనా తామంతా వారి వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసిన రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేద్దామన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కృష్ణదాస్ ఆయన సతీమణి పద్మప్రియ కట్ చేశారు.
 
 కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యు లు పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మె ల్యే ముత్యాలపాప, స్థానిక నాయకులు ధర్మాన రామలింగంన్నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, సాసుపల్లి కృష్ణబాబు, ఆరంగి మురళీధర్, చిన్నాల రామసత్యనారాయ ణ, కొయ్యాన సూర్యనారాయణ, కరిమి రాజేశ్వరరావు, సురంగి నర్సింగరావు, పోలాకి నర్సిం హమూర్తి, కోరాడ చంద్రభూషణగుప్త, పి.సాయిప్రసాద్, రాజాపు అప్పన్న, పతివాడ గిరీశ్వరరావు, ఇ ట్రా జు సూరిబాబు, కణితి కృష్ణారావు, వూన్న రాజశ్రీ, కరి మి ఉమ, పి.కృష్ణప్రసాద్, దుంపల భాస్కరరావు, మా మిడి శ్రీకాంత్, పేడాడ తిలక్, తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement