kambala jogulu
-
లక్షలాది మంది జనాలతో మేమంతా సిద్ధం..పాయకరావు పేటలో ప్రచార జోరు
-
ధర్మవరం, గుంటూరు తూర్పు, ఎస్.కోటలో యాత్ర
-
‘అలా మాట్లాడింది చంద్రబాబే’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై చర్చ జరుగుతుంటే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మడకశిర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఆశించిన రీతిలో దళితుల అభివృద్ధి జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దళితులకు కేబినెట్లో పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటేడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్ష ణీయన్నారు. అందుకే గట్టిగా బుద్ధి చెప్పారు.. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీలను ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. అందుకే ఎన్నికల్లో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ పాలనలో దళితులను నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నారని, ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికి తెలుసునన్నారు. ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది.. ఎస్సీ,ఎస్టీలను ఉద్ధరించామని టీడీపీ వాళ్లు చెబుతున్నారని.. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడింది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఎస్టీ లేని కేబినెట్ ఏదైనా ఉందంటే..చంద్రబాబు హయాంలోనేనన్నారు. దళితులు పడుతున్న బాధలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చట్టాలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. దాడులు జరిగితే ఆయన మాట్లాడలేదు.. దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు మాట్లాడలేదని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. టీడీపీ పాలనలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం.. ఎస్సీ,ఎస్టీ, కమిషన్ విభజన ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూ అన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ విభజన వల్ల న్యాయం వేగంగా జరుగుతుందన్నారు. టీడీపీ పాలనలో ఎస్సీ,ఎస్టీలు ఎన్నో అవమానాలకు గురయ్యారన్నారు. వైఎస్సార్ హయాంలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దళితుల కోసం సీఎం జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను హీనంగా చూశారన్నారు. -
టీడీపీ నేతల్లారా.. ఖబడ్దార్ : ఎమ్మెల్యే కంబాల
రాజకీయం రంగులు మార్చుకుంటోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమం గురించి పాటు పడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు పోయి, కక్షలు పెంచుకుని దాడులు చేస్తూ రాజకీయ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. దీనికి తోడు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో వినూత్న పాలన అందిస్తున్న వైఎస్సార్ సీపీ తీరును జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అమాయకులైన వలంటీర్లనే టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తున్నారు. వీరి తీరును రాజకీయ వేత్తలు ఖండిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలా పరువు పోయేలా వ్యవహరించడం సరికాదని హితవు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సంతకవిటీ మండలం శ్రీ హరినాయుడు పేట గ్రామంలో అక్టోబర్ 13వ తేదీన వలంటీరు వావిలపల్లి నారాయణరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోరంబోకు భూ ములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నా రని అధికారులకు సమాచారన్న అక్కసుతో వలంటీర్‌పై దాడి చేశారు. ► సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామం లో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారని అక్కసుతో ముద్దాడ బాలకృష్ణ, ముద్దాడ వీరన్న, దాసరి సింహాచలం, ముద్దాడ దుక్కన్నలపై టీడీపీ నేతలు దాడి చేశారు. అలాగే, ముద్దాడ జోగులు, ముద్దాడ రాములు, కిక్కర సూర్యరావుల ఇళ్లపై కూడా దాడి చేశారు. ► రేగిడి మండలం కాగితాపల్లిలో సెప్టెంబర్ 9వ తేదీన వలంటీర్ కిమిడి గౌరీశంకర్‌పై టీడీపీ నాయకులు ధర్మారావు అనుచరులు దాడి చేశారు. ► అక్టోబర్ 1వ తేదీన టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో కుమారస్వామి, అప్ప న్న అనే ఇద్దరు వలంటీర్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ► సంతబొమ్మాళికి చెందిన కళింగ ఆశ అనే వలంటీర్‌పై దాడి చేశారు. ► పలాస మండలం కిష్టిపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జి.మోహనరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే ఆయన తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► తాజాగా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపర్చారు. తాగునీటి పైపులైన్ బాగు చేస్తున్న సందర్భంలో అడ్డుకుని టీడీపీ నాయకులు దాడులకు దిగారు. 15మంది టీడీపీ కార్యకర్తల సామూహిక దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు చేసిన దాడుల ఘటనలివి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైతే లెక్కే లేదు. అధికార మదంతో ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా ఎదురు కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అయితే టీడీపీ నేతల ప్రస్తుత తీరు చూస్తుంటే మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కింది అన్నట్టుగా ఉంది. వారే దాడులు చేసి ఇష్టారీతిన గాయపరిచి, తిరిగి తమపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొన్న జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గ సమీక్షల్లో చంద్రబాబు దగ్గరి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ఇదేరకమైన తీరు కనబరిచారు. ఏదో అయిపోతోంది, శాంతి భద్రతలు లోపిం చాయన్నట్టుగా తమ పచ్చ మీడియా ద్వారా ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్లేందుకు చంద్రబాబు పర్యటన వేదికగా సాగిందని జనమే చర్చించుకుంటున్నారు. వలంటీర్లను వదల్లేదు ఇన్నాళ్లూ గ్రామంలో చక్రం తిప్పి, అజమాయిషీ చెలాయించిన టీడీపీ నేతలకు వలంటీర్ల వ్యవస్థ మింగుడు పడటం లేదు. తమ పెత్తనం చెల్లుబాటు కాదనే అక్కసుతో గ్రామాల్లో కొత్తగా నియమించిన వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. వారి అక్రమాలను ఎత్తి చూపిస్తున్నందుకు దౌర్జన్యాలకు పా ల్పడుతున్నారు. ఇప్పటికే దాడుల ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. దాడులు చేసి తిరిగి ఎదురు దాడులకు దిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. అగ్ర నేతల నుంచి గ్రామ స్థాయి నేతల వరకు అదే పరిస్థితి టీడీపీ అగ్రనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ దగ్గరి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అదే ధోరణి సాగిస్తున్నారు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్ము ఎవరూ ఆప లేరు. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తా.’ అంటూ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేస్తే కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి చివరికీ బెయిల్ తెచ్చుకున్నారు. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్లెస్ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికీ కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఒకే రకంగా వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో జిల్లాలో చాలా మంది అధికారులపై, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరించడం సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొందరు అధికారులైతే బలి పశువులయ్యారు. ఇక విప్‌గా కూన రవికుమార్ ఉన్నప్పుడు ఇసుక దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై పెట్టిన కేసులు అన్నీ ఇన్నీ కావు. గ్రామాల్లో తిరగనిచ్చే పరిస్థితి లేకుండా బెదిరింపులకు దిగారు. జన్మభూమి కమిటీ సభ్యులైతే చెలరేగిపోయారు. మొత్తానికి అధికారం పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు, ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. సంతకవిటి: టీడీపీ నేతలు అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస దాడులతో ప్రజలను భయపెట్టి, తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో ఆ పార్టీ అభిమానులు చేరుతుండటంతో తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో వరుసగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులే ఇందుకు నిదర్శనం. ఇటీవల కొత్తూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారణాయుధాలతో దాడి చేసిన విషయం మరువక ముందే, తాజాగా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట పంచాయతీలో టీడీపీ మాజీ వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు అతని అనుచరులు మూకుమ్మడిగా దాడులు చేశారు. పోలీసులు చూస్తుండగానే వీరంతా రెచ్చిపోయి పది మంది వరకు గాయపర్చారు. దాడి ఎలా చేశారంటే... గ్రామంలో మరమ్మతులకు గురైన తాగునీటి పైపులైన్‌ను సోమవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలు గండ్రేటి భుజంగరావు, వావిలపల్లి దాలినాయుడు, వావిలపల్లి బాలయ్య, వావిలపల్లి అనంతరావు, వాసులతోపాటు గ్రామ వలంటీర్ వావిలపల్లి నారాయణరావు, మరికొంత మంది యువకులు కలసి బాగు చేçసేందుకు సిద్ధపడ్డారు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ మాజీ వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు మరికొంత మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని పనులు అడ్డగించారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, మండల పరిషత్ అధికారులు బాగు చేయమన్నారని భుజంగరావు చెప్పగా, తాము గతంలో అక్కడ మరమ్మతులు చేశామని, బిల్లులు కాలేదని, ఇప్పుడు బాగుచేసేందుకు వీలు లేదని అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వివాదం చెలరేగగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికారులకు ఫోన్ చేశారు. బాధితుల వద్ద వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే కంబాల జోగులు పోలీసుల సమక్షంలోనే దాడులు... వెంటనే సంతకవిటి ఎస్ఐ రామారావుతోపాటు సిబ్బంది అక్కడకు చేరుకుని పనులు చేయించేందుకు ప్రయత్నించారు. ఇదేక్రమంలో గండ్రేటి కేసరితోపాటు అతని కుమారుడు సురేష్, టీడీపీ కార్యకర్తలు జీ లక్షున్నాయుడు, వావిలపల్లి లక్షున్నాయుడు, డోల ప్రసాదు, వీ దాలినాయుడు, జీ చక్రి, జీ చిన్నా, జీ రాము, వీ రామినాయుడు, వీ కేసరి, మీసాల సూరయ్య, జీ దామోదరరావు, జీ సూర్యారావు, జీ ఆదినారాయణ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త భుజంగరావు కాలికి, వావిలపల్లి బాలయ్య నోట్లో, వావిలపల్లి అనంతరావు తలకు, వావిలపల్లి నారాయణరావు, దాలినాయుడుల భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది వైఎస్సార్సీపీ అభిమానులు, యువకులు ఈ ఘటనలో గాయపడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు అదనపు పోలీసు సిబ్బందిని రప్పించడంతోపాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మూడో దఫా కూడా బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆ పంచాయతీకి చెందిన టీడీపీ మాజీ వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు అతని అనుచరులు వరుసగా దాడులు చేస్తున్నారు. జూలై 1న కృష్ణంవలస గ్రామంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేరడంతో దాడికి పాల్పడ్డారు. ఈ కేసు ఇంకా కొలిక్కి రాక ముందే అక్టోబర్ 12న గ్రామ వలంటీరుపై దాడి చేయగా, ఇంతలో మరో దాడి చేయడం చూస్తుంటే పథకం ప్రకారమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహన్రావు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన బాధితులను పరామర్శించారు. పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్‌కు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీతోపాటు రాజాం సీఐలు పీ శ్రీనివాసరావు, జీ సోమశేఖర్, అదనపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన గండ్రేటి కేసరితోపాటు అతడి అనుచరులను సంతకవిటి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయాలపాలైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు 15 మందిపై ఫిర్యాదు.. టీడీపీ మాజీ వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు 14 మందిపై బాధితుడు వావిలపల్లి దాలినాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మండల పార్టీ శ్రేణులు సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. టీడీపీ నేతల్లారా.. ఖబడ్దార్ : ఎమ్మెల్యే టీడీపీ నేతలు గత పాలనలో స్కీంలు పేరుతో స్కాంలు చేశారని, ఇప్పుడు గూండాగిరితో దాడులు చేస్తుంటే, ఊరుకునేది లేదని ఖబడ్డార్ అంటూ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ వక్రబుద్ధిని మార్చుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పాలకొండ డీఎస్పీ, సీఐలతో మాట్లాడారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శలో పార్టీ సీనియర్ నేతలు ఉరిటి అప్పారావుపట్నాయక్నాయుడు, రాగోలు రమేష్‌నాయుడు, కనకల సన్యాసినాయుడు, కెంబూరు సూర్యారావు, వావిలపల్లి వెంకటేశ్వర్లు, బత్తుల జ్యోతీశ్వర్లు, మొయ్యి మోహనరావు, పప్పల గణపతి, పైల వెంకటనాయుడు, రెడ్డి స్వామినాయుడు, యెన్ని శ్రీనివాసరావు, వావిలపల్లి రమణారావు, దవళ నర్సింహమూర్తి, వావిలపల్లి సమీర్నాయుడు, కొప్పల ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో గాయపడిన బాధిత కుంటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి కారణంగా కార్యకర్తల ఇళ్లలో విరిగిపోయిన తలుపులు, కిటికీలు, టీవీలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు గూండాలు మాదిరిగా అమాయక ప్రజల ఇళ్లపై దాడులకు తెగబడడం దారుణమన్నారు. గత ఐదేళ్లుగా చేసిన దాడులకు ప్రతిఫలంగా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోయారా అంటూ దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీలో చేరినందుకు కక్షగట్టి దాడులకు పాల్పడితే క్షమించేదిలేదని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులని కఠినంగా శిక్షించాలని రాజాం రూరల్ సీఐ పి.శ్రీనివాసరావుకు ఆదేశించారు. గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బాధితుల కన్నీరుమున్నీరు ఎమ్మెల్యే కంబాల జోగులు ఎదుట కృష్ణంవలస గ్రామానికి చెందిన కె.సూర్యారావు, దాసరి సింహాచలం, బాలకృష్ణ తదితర బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు, చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు. తమను చంపేస్తామని, ఊర్లో ఉండనీయకుండా చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని వాపోయారు. జగన్మోహన్రెడ్డికి ఓటు వేసినందుకు గ్రామంలో తమకు ప్రాణహాని ఉందని తెలియజేశారు. తమకు ఎటువంటి హాని జరగకుండా చూడాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే జోగులు సీఐతో మాట్లాడి భయపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ మండల కన్వీనర్ గురుగుబెల్లి స్వామినాయుడు, పార్టీ నాయకులు కనకల సన్యాసినాయుడు, రాగోలు రమేష్‌నాయుడు, చెలికాన మహేశ్‌బాబు, వావిలపల్లి వెంకటేశ్వర్లు, రూపిటి శ్రీరామమూర్తి, పప్పల గణపతి, పొన్నాడ ప్రసాదరావు, వావిలపల్లి రమణారావు, దవళ నర్శింహమూర్తి, పైల వెంకటనాయుడు, యడ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నవ పాలనకు నాంది
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే కంబాల జోగులును గంజాయివనంలో తులసిమొక్కగా ఊరకనే అభివర్ణించలేదు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా అమ్ముడుపోలేదు. బెదిరింపులకు దౌర్జన్యాలకు సైతం దిగినా వెన్నుచూపలేదు. అందుకే ఆయన నిష్కళంకుడిగా, నిస్వార్థపరుడిగా, అవినీతి రహితుడిగా గుర్తింపు పొందారు. ప్రజలకు సైతం నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంటూ అధికార పార్టీ అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నందున ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న ఈయన్ను మరోమారు గెలిపిస్తే రాజాం నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కంబాల జోగులు సాక్షితో కాసేపు ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు.? జవాబు: వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్నాను. మాటమీద నిలబడే నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని పార్టీ కోల్పోయింది. రాజాం నియోజకవర్గ ప్రజలు మాత్రం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అనంతరం ఈ ఐదేళ్లు ప్రజల్లో ఉండేలా జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను రూపొందించారు. ప్రజల తరపున పోరాడుతూ రచ్చబండ, పల్లెనిద్ర, గడపగడపకు వైఎస్సార్, నిన్ను నమ్మం బాబు వంటి కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోయాం. గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆప్యాయతగా పలకరిస్తున్నారు. కలివిడిగా వెన్నంటి నడుస్తున్నారు. నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలేమిటి ? జవాబు: రాజాం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన రాజాం రోడ్డు విస్తరణను, హైటెక్ సిటీ నిర్మాణాన్ని, పార్కుల ఏర్పాటును పక్కన పెట్టేశారు. 777 రోజులుగా సంతకవిటి మండలం వాల్తేరు వద్ద వంతెన కోసం దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదు. వంగర మండలం కిమ్మి, రుషింగి వంతెనను అర్ధాంతరంగా వదిలేశారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాల్లోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేవు. మడ్డువలస, తోటపల్లి సాగునీరు పొలాలకు అందడం లేదు. రూ. 49 కోట్లతో నిర్మించిన పథకం నీరుగారి ప్రజలకు తాగునీటి కష్టాలు తెచ్చి పెడుతోంది. రేగిడిలో జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాజాంలో మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాల లేక చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. పత్తి, మొక్క జొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు లేవు. ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్నాం. సమస్యలు పరిష్కారానికి ఎలా కృషిచేస్తారు? జవాబు: ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాజాంలో జ్యూట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మా పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్రెడ్డి సహకారంతో పరిశ్రమల యాజమాన్యానికి ఆర్థికసాయం అందించే ఆలోచనలో ఉన్నాం. తద్వారా ఫ్యాక్టరీలను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. రాజాం రోడ్డు విస్తరణతోపాటు హైటెక్ సిటీ నిర్మాణం, పార్కుల ఏర్పాటు వేగవంతం చేస్తాం. అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు నిర్మాణంతోపాటు ఆర్టీసీ షటిల్ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రేగిడిలో జూనియర్ కళాశాల ఏర్పాటుతోపాటు రాజాంలో రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభిస్తాం. మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడంతోపాటు కార్పొరేట్ ఫీజులకు కళ్లెం వేస్తాం. కిమ్మి, రుషింగి వంతెన నిర్మాణంతోపాటు బలసలరేవు వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం. టీడీపీ పాలనలో నష్టపోయిన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: టీడీపీ పాలనలో అరాచకాలు అధికమయ్యాయి. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలంలో ఇండీట్రేడ్ పేరుతో టీడీపీ నేతలు రూ. 200 కోట్లు దోచేశారు. బాధితుల తరపున పోరాడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం. కేసును వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటాం. జన్మభూమి కమిటీలతోపాటు టీడీపీ కార్యకర్తల కారణంగా సంక్షేమ పథకాలకు నోచుకోని బాధితులందరికీ పార్టీలకతీతంగా అందిస్తాం. అడిగిన వారికి ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, కొత్త గ్యాస్ కనెక్షన్లు, ప్రతీ ఇంటికి తాగునీటి సదుపాయం, ప్రతీ రైతుకు ఉచిత విద్యుత్, ప్రతీ నిరుద్యోగికి ఉపాధి అవకాశం, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం, ఉపాధి వేతనదారులకు 150 పని దినాలను కల్పిస్తాం. ఇందులో ఎటువంటి కమిటీలు రాజకీయ ప్రలోభాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ పంచాయతీలో పది మంది యువకులకు ఉద్యోగ కల్పన ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమిస్తాం. -
సీబీఐ అంటే భయమెందుకు..?
రాజాం : రాష్ట్రానికి సీబీఐ రాకుండా జీఓ జారీచేయడం వెనుక ఆంతర్యమేంటని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడును వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రశ్నించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సీబీఐ వస్తుందంటే టీడీపీ నేతలు అంతా భయపడుతున్నారని ఆరోపించారు. అక్రమాలు, హత్యలు చేసే ముందు ఈ భయం ఉంటే బాగుండేదని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర నిధులు దుర్వినియోగం చేస్తూ అడ్డంగా ఆస్తులు సంపాదించిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఆ అక్రమ ఆస్తులు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నారని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మడం లేదని, అందుకే జగన్‌పై కూడా హత్యాయత్నం చేయించారని తెలిపారు. జగన్ మళ్లీ ప్రజా బాట పట్టారని, జిల్లాకు త్వరలోనే రానున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం మండల కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు, వంగర మండలం కన్వీనర్ కరణం సుదర్శనరావు, రాజాం టౌన్ యూత్‌కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, పార్టీ నాయకులు యాలాల వెంకటేష్, కార్యదర్శి శాసపు వేణుగోపాలనాయుడు, గొర్లె నారాయణరావు, దాలినాయుడు, పాలవలస రాజగోపాలనాయుడు, రాగోలు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యులను కఠినంగా శిక్షించాలి
వంగర : మగ్గూరు గ్రామంలో గిరిజన మహిళపై దాడి చేసి కులం పేరుతో దుర్భాషలాడిన సర్పంచ్ గంటా ఖగేంద్రనాయుడుతోపాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పాలవలస విక్రాంత్‌లు డిమాండ్ చేశారు. ఆదివారం మగ్గూరులో పర్యటించి బాధితురాలు తూడి అప్పలనరసమ్మను పరామర్శించారు. ఘటనకు దారి తీసిన అంశాలపై ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజన మహిళపై దాడి అమానుషమన్నారు. దాడికి కారణమైన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారే తప్ప ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిందితులంతా టీడీపీ వర్గానికి చెందిన వారు కావడంతో కేసులో పురోగతి ఉండడం లేదని ఆరోపించారు. తక్షణమే పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి బాధ్యులుపై చర్యలు చేపట్టి బాధితురాలికు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, ఉదయాన మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కర్రి గోవిందరావు, ఉగిరి ముత్యాలు, గొట్టాపు సత్యన్నారాయణ, పోలిరెడ్డి రామకృష్ణ, కొచ్చెర్ల తవిటయ్య, వేగిరెడ్డి మురళీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
రాజాం: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. శుక్రవారం రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఏంచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్ ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని స్పష్టం చేశారు. అప్పట్లో విస్తరణ మినహా టీడీపీ హయాంలో ఏమీ జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ స్వలాభం చూసుకుంటోందన్నారు. అప్పట్లో వైఎస్సార్ పోలవరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జీవనధారగా గుర్తించి అభివృద్ధి చేస్తే ఆ విషయాన్ని కేంద్రం గుర్తించి జాతీయ ప్రాజెక్ట్‌గా తమ పరిధిలోకి తీసుకుందన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వలాభం, స్వప్రయోజనాల కోసం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర పరిధిలోకి తీసుకుని అంచనాల్లో తేడాలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కారీ ప్రాజెక్ట్‌ను పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేస్తే టీడీపీ నేతలు సమాధానాలు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తామని చెప్పారు. రుణమాఫీలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు సర్కారు ఇప్పుడు సాగునీటిని కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు పెడతామని హామీ ఇచ్చి నాలుగేళ్లుగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదరాబాదరాగా ఏర్పాటు చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాజాం మండల కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు, వంగర మండలం కన్వీనర్ కరణం సుదర్శనరావు, రాజాంటౌన్ యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, పార్టీ సీనియర్ నాయకులు వాకముల్ల చిన్నంనాయుడు, పార్టీ అధికార ప్రతినిధి పారంకోటి సుధ, ఎస్.తవుడు, సమతం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారు
రాజాం : ఆంధ్రప్రదేశ్‌ని నిరుద్యోగ ఆంధ్రాగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఆదివారం రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చిరుద్యోగులంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో సుమారు తొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఈ పాపం టీడీపీ నేతలకు తగలకతప్పదన్నారు. జిల్లాలో 900 మంది ఆదర్శ రైతులు, 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. పార్టీ వివక్ష చూపించి 238 మంది రేషన్ డిపో డీలర్లను తొలగించారని, వెలుగుశాఖలో చిరుద్యోగులుగా ఉన్న 390 మంది సీఎఫ్‌లను తొలగించారని పేర్కొన్నారు. 650 మంది సాక్షరాభారత్ కోఆర్డినేటర్లపై వేటు వేశారని తెలిపారు. కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో వలంటీర్లు, స్వీపర్లు, నైట్ వాచ్మెన్లుగా పనిచేస్తున్న 280 మందిని తొలగించారని దుయ్యబట్టారు. ఇదే కోవలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, గృహనిర్మాణశాఖలో ఔట్సోర్సింగ్ ద్వారా పనిచేసిన 230 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 600 మంది కంప్యూటర్ బోధకులు, పంచాయతీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న 1700 మంది ఉద్యోగులను తొలగించి అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వైపు కేంద్రాన్ని తిడుతూ మరో వైపు ప్రధానమంత్రితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. -
అధికార పంతం.. ప్రతిపక్ష పోరాటం
సంతకవిటి శ్రీకాకుళం : సంతకవిటి మండల కేంద్రంలో అధి కార పార్టీ తీరుకు నిరసనగా జనం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలవడంతో పాటు న్యా యం చేశారు. అర్హులకు అందకుండా ఉండిపోయి న పింఛన్లను వారికి అందించారు. మండలానికి కొత్తగా మంజూరు చేసిన 653 పింఛన్ల పంపిణీని అధికార పార్టీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నిం చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహనరా వు, మండల కన్వీనర్ గురుగుబెల్లి స్వామి నాయు డు, ఎంపీటీసీ సభ్యులు కనకల సన్యాశినాయుడు, రాగోలు రమేష్‌నాయుడు తదితరులు దీనిపై పో రాడారు. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు ఎలా గైనా నిర్ణీత గడువులోగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నెల 9వ తేదీలోగా వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, అధికారులను అడ్డంపెట్టి జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలు కలుగుజేసుకుని పంపిణీకి పట్టుబట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రజావేదిక నిర్వహించి ఈ పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కొత్తగా మంజూరైన పింఛన్లను కొందరి ఒత్తిళ్ల మేరకు అధికారులు ముందు ఇవ్వలేదు. ఎమ్మెల్యే గట్టిగా పట్టుబట్టడంతో పింఛన్ల పంపిణీకి ఒప్పుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం అధికార పార్టీకి చెందిన ఎంపీపీ పూడు అక్కమ్మ, వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరిలు హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు వీరి చేతులమీదుగా కూడా ఫించన్ల పంపిణీని సంతకవిటి ఎంపీడీఓ బి.వెంకటరమణ నిర్వహించారు. పంపిణీ కార్యక్రమం అంతా అయ్యే వరకు జనమంతా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు. న్యాయ పోరాటం తప్పదు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మా ట్లాడుతూ రాష్ట్రం అంతా టీడీపీ పార్టీ అధికార దు ర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. సంతకవిటి మండలంలో నీచ రాజకీయాలు, ఆర్థిక నేరాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. ఎలాం టి పదవులు లేని వారు కూడా పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తమకు నచ్చని వ్యక్తులు ఉంటే వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కొంతమంది అర్హులు ఉండిపోయారని, వీరంతా జన్మభూమి కమిటీల కారణంగా నష్టపోయారని అన్నా రు. వీరికి కూడా న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. సుదీర్ఘ అనుభవం అని చెప్పుకుంటున్న సీఎంకు ఎంత మంది దొంగలతో సంబంధాలు ఉన్నాయో జనానికి తెలుస్తుందన్నారు. టీడీపీ వారు రాష్ట్రా న్ని పూర్తిగా ధ్వంసం చేయకమునుపే జనం మేలు కోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సర్పంచ్‌లు కెంబూరు సూర్యారావు, మొ య్యి మోహనరావు, ఎన్ని శ్రీనివాసరావు, దవళ సీతమ్మ, వావిలపల్లి రమణారావు, మాజీ ఎంపీటీసీ డోల తిరుపతిరావు, వావిలపల్లి సమీర్నా యు డు, రూపిటి శ్రీరామమూర్తి, పప్పల గణపతి, రూపిటి చిన్నప్పలనాయుడు, రెడ్డి స్వామి నాయు డు, కంచరాపు వెంకటరమణారావు, గురువు సింహాచల, నర్శింహమూర్తి, ఉపసర్పంచ్ వి.శ్రీనివాసరావు, కొప్పల ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ యడ్ల రామకృష్ణ, బగాది వెంకటరమణ, భుజంగరావు, పీఏసీఎస్ డైరెక్టర్ గురుగుబెల్లి గవరయ్య, నాయకులు, చిన్నప్పలనాయుడు, బగాది వెంకటరమణ, వావిలపల్లి శ్రీనివాసరావు, పప్పల గణపతి, యడ్ల రామకృష్ణ, గురువు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
‘బాబు మోసగాడు’
రాజాం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయదారి మోసగాడని, గారడీలు చేస్తూ ప్రజ లను మోసగిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగభృతి విషయంలో కూడా నిబంధనలు పెట్టి నిరుద్యోగులకు మోసగిస్తాడని అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, వడ్డీ రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా సంఘాలను, ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కొత్త పన్నాగాలు పన్నుతాడని వైఎస్సార్ సీపీ క్యాడరంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు చేపట్టిన ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, సెక్స్ రాకెట్ వంటివి ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో న్యాయం చేయడంలో విఫలమైన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. టీడీపీది నయవంచన దీక్ష పాలకొండ రూరల్: నాలుగున్నరేళ్లలో టీడీపీ నయవంచన కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో శనివారం నెల్లూరులో నిర్వహించిన వంచనపై గర్జనలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీడీపీ తీరును ఎండగట్టారు. సీఎం చంద్రబాబు పాలకొండ నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా తోటపల్లి కాలువల ఆధునికీకరణ, జంపరకోట జలాశయం పూర్తిపై చేసిన మోసాలను ప్రస్తావించారు. -
పసుపు చొక్కాలకే పథకాలా?
వంగర: టీడీపీ ప్రభుత్వం పసుపు చొక్కాల వారికే పథకాలు అమలు చేస్తోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. శనివారం మండల పరిధి మగ్గూరు,ఎం.సీతారాంపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హత ఉన్నా పెన్షన్లు, గృహాలు మంజూరు చేయడం లేదని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతోందని ఆవేదన చెందారు. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలున్నాయని, అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వంగర మండలంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా రబీకి నీటిని అందించడం లేదని, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దీనంతటికీ తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సా ర్ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, ఉత్తరావెల్లి గణేష్‌బెనర్జీ, ఉగిరి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల తీరు హేయం
రాజాం: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అధికారులు తీరు హేయంగా ఉందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజాం నగర పంచాయతీ కమిషనర్ తీరు మరీ దారుణంగా ఉందన్నారు. ప్రతి పనినీ రాజకీయంగా చూడడం దారుణమన్నారు. పూర్తిగా అవినీతి అధికారిగా ముద్రపడిపోయారని ఆరోపించారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అలాగే పోలీస్, రెవెన్యూ శాఖల పనితీరు పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అసలు ఆ రెండు శాఖలు ఉన్నట్టే లేదని, ఒక వేళ ఉన్నా కేవలం అధికార పార్టీ నాయకులకు భజన చేయడానికేనన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజల పక్షాన పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, జిల్లా కార్యదర్శి ఉత్తరావిల్లి సురేష్‌ముఖర్జీ,రాజాం టౌన్ కన్వినర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం, రేగిడి, వంగర మండలాల కన్వినర్లు లావేటి రాజగోపాలనాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, కరణం సుదర్శనరావు, శాసపు కేశవరావునాయుడు, రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విఐపి రిపోర్టర్ -రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు
-
సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
శ్రీకాకుళం: జిల్లాలోని సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీలు విస్మరించిన చంద్రబాబు నాయుడు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ధర్నాలలో భాగంగా సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం స్పందించలేదు. ధర్నా కొనసాగుతూనే ఉంది. ధర్నా వద్దకు టీడీపి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ** -
ప్రజా సమస్యలపై పోరాటం
నరసన్నపేట: ప్రజా సమస్యలపై శాసన సభలో, జిల్లాలో పోరాటం చేస్తామని రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, వి.కళావతి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ జన్మదినోత్సవ వేడుకలు నరసన్నపేటలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ చేపట్టే ప్రతి ప్రజావ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాటాలు చేస్తామన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కల్లెదుటే కోట్లాది రూపాయల ఇసుక అక్రమ దందా నడుస్తుంటే పట్టించుకోని అధికార పార్టీ నేతలు ఇతర పార్టీ నాయకులపై అవినీతి గురించి మాట్లాడుతుంటే ఏ మనుకోవాలో తెలియడం లేదన్నారు. ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు అడ్డదారిలో వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. బాధ్యతాయుతంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు ఏ మాత్రం ఇబ్బందులు ఎదురైనా తామంతా వారి వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసిన రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేద్దామన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కృష్ణదాస్ ఆయన సతీమణి పద్మప్రియ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యు లు పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మె ల్యే ముత్యాలపాప, స్థానిక నాయకులు ధర్మాన రామలింగంన్నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, సాసుపల్లి కృష్ణబాబు, ఆరంగి మురళీధర్, చిన్నాల రామసత్యనారాయ ణ, కొయ్యాన సూర్యనారాయణ, కరిమి రాజేశ్వరరావు, సురంగి నర్సింగరావు, పోలాకి నర్సిం హమూర్తి, కోరాడ చంద్రభూషణగుప్త, పి.సాయిప్రసాద్, రాజాపు అప్పన్న, పతివాడ గిరీశ్వరరావు, ఇ ట్రా జు సూరిబాబు, కణితి కృష్ణారావు, వూన్న రాజశ్రీ, కరి మి ఉమ, పి.కృష్ణప్రసాద్, దుంపల భాస్కరరావు, మా మిడి శ్రీకాంత్, పేడాడ తిలక్, తదితరులు పాల్గొన్నారు. -
నాటి పరాభవానికి..నేడు ప్రతీకారం!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేత కంబాల జోగులు గతంలో తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గతంలో జోగులుపై ఎవరు దాడి చేశారు?.. ఆ దాడికి ఇప్పటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటని అనుకుంటున్నారా??.. అయితే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సిందే.. 2004 ఎన్నికల్లో కంబాల జోగులు పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో తాజా మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ ఎచ్చెర్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 ప్రాంతంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఒక సమావేశంలో జోగులుపై కోండ్రు దాడికి పాల్పడ్డారు. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆ శాఖ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణాలకు సంబంధించి జోగులు పలు ప్రశ్నలు సంధించారు. దాంతో రెచ్చిపోయిన కోండ్రు.. మంత్రినే ప్రశ్నించేంత వాడివయ్యావా? అంటూ జోగులుపైకి దూసుకెళ్లి ఆయన మెడలోని కండువా పట్టుకొని దాడి చేశారు. ఈ సంఘటనలో జోగులు చొక్కా కూడా చిరిగిపోయింది. సౌమ్యునిగా పేరున్న జోగులుపై దాడి చేయడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తోటి దళిత శాసనసభ్యుడిని కోండ్రు దాడి చేసి, అవమానించడం పట్ల ఆ వర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. తనపై జరిగిన దాడితో మనస్తాపానికి గురైన జోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినా.. తర్వాత ఎందుకులే.. అనుకొని వదిలేశారు. అక్కడి నుంచి ప్రస్తుతానికి వస్తే.. ఈ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి కోండ్రు, జోగులు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన జోగులుకు 69,192 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ మంత్రి హోదాలో పోటీ చేసిన కోండ్రు మురళీకి 4790 ఓట్లు మాత్రమే వచ్చాయి. జోగులు విజయం సాధించగా.. కోండ్రు డిపాజిట్ కూడా గల్లంతై తీవ్ర పరాభవానికి గురయ్యారు. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటన్న పలువురు గతంలో తనపై జరిగిన దాడికి జోగులు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. -
రాజాంలో కంబాల జోగులు విజయం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధించారు. అలాగే పాతపట్నంలో పలమటి వెంకటరమణ, పాలకొండలో కళావతి గెలుపొందారు. టీడీపీ నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు : *శ్రీకాకుళంలో- గుండా లక్ష్మీదేవి *ఎచ్చెర్లలో కళా వెంకట్రావు *ఆముదాలవలసలో కె.రవికుమార్ *నర్సన్నపేటలో రమణమూర్తి *టెక్కలిలో అచ్చెన్నాయుడు *పలాసలో జి.శ్యాంసుందర్ *ఇచ్చాపురంలో అశోక్