
రాజాం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయదారి మోసగాడని, గారడీలు చేస్తూ ప్రజ లను మోసగిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగభృతి విషయంలో కూడా నిబంధనలు పెట్టి నిరుద్యోగులకు మోసగిస్తాడని అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, వడ్డీ రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా సంఘాలను, ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కొత్త పన్నాగాలు పన్నుతాడని వైఎస్సార్ సీపీ క్యాడరంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు చేపట్టిన ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, సెక్స్ రాకెట్ వంటివి ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో న్యాయం చేయడంలో విఫలమైన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు.
టీడీపీది నయవంచన దీక్ష
పాలకొండ రూరల్: నాలుగున్నరేళ్లలో టీడీపీ నయవంచన కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో శనివారం నెల్లూరులో నిర్వహించిన వంచనపై గర్జనలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీడీపీ తీరును ఎండగట్టారు. సీఎం చంద్రబాబు పాలకొండ నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా తోటపల్లి కాలువల ఆధునికీకరణ, జంపరకోట జలాశయం పూర్తిపై చేసిన మోసాలను ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment