విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అధికారులు తీరు హేయంగా ఉందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజాం నగర పంచాయతీ కమిషనర్ తీరు మరీ దారుణంగా ఉందన్నారు. ప్రతి పనినీ రాజకీయంగా చూడడం దారుణమన్నారు. పూర్తిగా అవినీతి అధికారిగా ముద్రపడిపోయారని ఆరోపించారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అలాగే పోలీస్, రెవెన్యూ శాఖల పనితీరు పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అసలు ఆ రెండు శాఖలు ఉన్నట్టే లేదని, ఒక వేళ ఉన్నా కేవలం అధికార పార్టీ నాయకులకు భజన చేయడానికేనన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజల పక్షాన పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, జిల్లా కార్యదర్శి ఉత్తరావిల్లి సురేష్‌ముఖర్జీ,రాజాం టౌన్ కన్వినర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం, రేగిడి, వంగర మండలాల కన్వినర్లు లావేటి రాజగోపాలనాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, కరణం సుదర్శనరావు, శాసపు కేశవరావునాయుడు, రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.