నరసన్నపేట, న్యూస్‌లైన్: నరసన్నపేట పరిసర ప్రాంతాల్లోని బొమ్మరిల్లు బాధితులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బుడితి గ్రామానికి చెందిన తంగుడు గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైరక్టర్లపై కేసు పెట్టారు. నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు 400 మందితో రూ. కోటి వరకు డిపాజిట్ల రూపేణా, రోజువారీ చీటీల పేరుతో చెల్లింపులు చేశామని, సుమారు 400 మంది ఖాతాదారులు జాబితాను సిద్ధం చేసి పోలీసులకు సమర్పించారు. ఈ ప్రాంతంలో కనీసం వెయ్యి మంది వరకు బాధితులు ఉంటారని భావిస్తున్నారు.