
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు.
చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ