garjana
-
బీసీ గర్జన సభలో పాల్గొననున్న ప్రధాని
-
బీసీ గర్జన సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
రేపు కర్నూలు లో రాయలసీమ గర్జన సభ
-
YSRCP: డిసెంబర్ 5న కర్నూలులో సీమ గర్జన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: డిసెంబర్ 5న కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమ గర్జనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఇన్చార్జ్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ కడపలో రాయలసీమ గర్జన పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీమ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ సలహా మండలి ఛైర్మన్ తిరుపాల్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు) -
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ‘విద్యార్థి గర్జన’
చోడవరం(అనకాపల్లి జిల్లా): మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు గర్జించారు. వికేంద్రీకరణకు మద్దతుగా భేరి మోగించారు. తమ బంగారు భవిష్యత్ కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులంతా చోడవరం వేదికగా గళమెత్తారు. మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చోడవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలుత లజపతిరాయ్, దేవుడు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. -
మూడు రాజధానుల కోసం .. తిరుపతి గర్జన
-
చిన్నారి..యువతి..మధ్యలో పులి
శ్రీ రామ్, లక్ష్మీ రాయ్ జంటగా బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ నిర్మించిన చిత్రం ‘గర్జన’. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో చేసిన జె. పార్తిబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇంట్లోకి పులి రావడం, పులి నుంచి లక్ష్మీ రాయ్, చిన్నారి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, పులిని వేటాడడానికి శ్రీరామ్ గన్ను పట్టుకుని ఉండటం వంటి విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. ‘‘ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువులు దాడి చేస్తాయి. కానీ మనిషి దాడి చేయాలనుకుంటే కారణం అవసరం లేదు అనే అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ సినిమా కథనం ఆసక్తికరంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో సృష్టించిన పెద్ద పులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గర్జన సభ వాయిదా
సాక్షి, అనంతపురం : టీడీపీ చేస్తోన్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ తలపెట్టిన గర్జన దీక్ష వాయిదా పడింది. ఈనెల 30న నిర్వహించదలిచిన ఈ సభ వచ్చే నెల 2కు వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. జూలై 2న అనంతపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీడీపీ చేస్తున్న వంచనపై గర్జన దీక్షను చేయబోతున్నట్లు నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణలు తెలిపారు. -
ఖుషీ ఖుఫీగా..
తమిళసినిమా: సంచలన తారల్లో నటి త్రిష ఒకరన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమ, పెళ్లి దాకా వెళ్లి అంతటితోనే ఆగిపోయి నటనపైనే దృష్టిసారిస్తున్న ఈ బ్యూటీ. అదే విధంగా మూడు పదులు దాటినా కథానాయకిగా రాణిస్తున్న త్రిష కమర్శియల్ చిత్రాల నాయకిగానూ, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగానూ రాణిస్తోంది. అలా నయనతార, అనుష్కల బాటలో పయనిస్తున్న త్రిషను నాయకి చిత్రం నిరాశపరచింది. మరో విషయం ఏమిటంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అయిన నాయకి ఫ్లాప్ అయినా, మరిన్ని ఆ తరహా చిత్రాలు ఆమెను వరించడం విశేషమే. అలా మోహిని, గర్జన వంటి చిత్రాలతో యాక్షన్ సన్నివేశాల్లో దుమ్మురేపడానికి త్రిష సిద్ధమైంది. ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. కొడి చిత్రం తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అలాగని అవకాశాలు లేవని కాదు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు మోహిని, గర్జన, అరవిందస్వామికి జంటగా చతురంగవేట్టై 2, విజయ్‌సేతుపతి సరసన 96, 1818 అనే మరో విభిన్న కథా చిత్రం అంటూ బిజీబిజీగా నటించేస్తోంది. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం వంటి పలు కారణాల వల్ల త్రిష చిత్రాల విడుదలలో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ నటించిన మోహిని, గర్జన, 96 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నాయని సమాచారం. దీంతో త్రిష కూడా ఖుషీ అవుతోందట. ఈ విషయం ఆమె అభిమానులను మరింత ఖుషీ పరిచేదే అవుతుందిగా! -
జర్నలిస్టుల గర్జన
-
‘ఎంపీల రాజీనామాలు ఆమోదించాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదించాల్సిందేనన్నారు. టీడీపీ, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. చంద్రబాబు నాయడు వంచనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. జూన్ 2న నెల్లూరు జిల్లా కేంద్రంగా ‘వంచనపై గర్జన’ పేరుతో సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్జనలో నల్ల బ్యాడ్జీలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, రాజీనామా చేసిన ఎంపీలు, కార్యకర్తలంతా పాల్గొంటారని పేర్కొన్నారు. టీడీపీ మహానాడులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కాకుండా అనవసర విషయాలపై చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. -
రియల్ గర్జన
తమిళసినిమా: దక్షిణాదిలో నటి త్రిష తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కట్టా మిఠా చిత్రం తో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్నారు. అయితే ఇప్పటి వర కూ త్రిషలోని అందాన్ని, అభినయాన్ని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు గర్జించే నటనను చూడబోతున్నారట. అదీ చాలా రియల్ రిస్క్ చేసి నటించిన యాక్షన్ సిన్నివేశాలను చూసి థ్రిల్ అవుతారట. విషయం ఏమిటంటే త్రిష నటిస్తున్న తాజా చిత్రం గర్జన. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా త్రిష యాక్షన్ అవతారమెత్తారు. సుందర్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఇందులో త్రిష డాన్సర్‌గా నటిస్తున్నారు. ఒక ప్రోగ్రాం కోసం కోడైకెనాల్ వచ్చిన తను ఒక ఆపదలో చిక్కుకుంటుంది. అందులోంచి ఎలా బయట పడిందన్నదే గర్జన చిత్రం అని దర్శకుడు సుందర్‌బాబు తెలిపారు. మరో విషయం ఏమిటంటే హిందీలో మంచి విజయాన్ని సాధించిన ఎన్‌హెచ్ 10 చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం గర్జన అని దర్శకుడు చెప్పారు. ఇందులో త్రిష కోడైకెనాల్‌లోని అడవి ప్రాంతంలో మెలికలు తిరిగే చాలా డేంజరస్ రోడ్డులో జీప్‌ను వేగంగా నడిపే సన్నివేశాలు. కారైక్కుడిలో గుర్రపు స్వారీ సీన్స్, అదేవిథధంగా రోప్ ఫైట్స్ వంటి రిస్కీ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా నటించారట. అలా త్రిష రోరింగ్ సన్నివేశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా గర్జన ఉంటుందట. ఇది త్రిష కెరీర్లోనే ఇంతకు ముందు ఇకపై కూడా చేయనటువంటి చిత్రంగా గర్జన ఉంటుందని దర్శకుడు సుందర్‌బాబు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
త్రిష రియల్ గర్జన
నటి త్రిష నటిస్తున్న తాజా చిత్రం గర్జన. సెంచరీ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మాత జోన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్‌బాలు తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణ, వడివుక్కరిసి, తవసి, ఆర్యన్, అమిత్, లొల్లుసభ స్వామినాథన్, శ్రీరంజిని, మదురైముత్తు, జాంగిరి మధుమిత, శరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతాన్ని, చిట్టిబాబు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తె లుపుతూ గర్జన కథానాయకి చుట్టూ తిరిగే కమర్శియల్ అంచనాలతో కూడిన విభిన్న కథా చిత్రం అని చెప్పారు. చిత్ర కథ, కథనాలు నచ్చడంతో ఇందులో నటించడానికి నటి త్రిష వెంటనే అంగీకరించారన్నారు. ఐదుగురు స్నేహితులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడం వాటిని సెల్‌ఫోన్ లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి వా రిని బ్లాక్ మెయిల్ చేయడం లాం టి అకృత్యాలకు పాల్పడతారన్నారు. అదే విధంగా తమ ప్రేమను తిరస్కరించిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడి వారిని హత్య చేస్తారన్నారు. ఈ గ్యాంగ్ వెనుక కొందరు పెద్ద మనుషులు ఉంటారన్నారు. ఒక నృత్య కళాకారిణి అయిన త్రిష వారి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసి ఎలా శిక్షించిందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం గర్జన అని తెలిపారు. ఇందులో పోరాటం లాంటి చాలా రిస్కీ సన్నివేశాల్లోనూ త్రిష ఎలాంటి డూప్ లేకుండా నటించారని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక శాతం అడవుల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. పొదలు, ముళ్లు లెక్క చేయకుండా నటించారని, దీంతో కాళ్లకు ముళ్లు గుచ్చుకుని రక్తసిక్తం కావడంతో ఒక రోజు విరామం తీసుకుని షూటింగ్ చేద్దామని చెప్పినా, ఆ తరువాత అయినా ఈ ముళ్ల బారిన పడక తప్పదని, అందువల్ల రక్తం కారుతున్న దృశ్యాలను చిత్రీకరించండి అప్పుడే రియల్‌గా ఉంటుందని చెప్పి బాధను లెక్క చేయకుండా త్రిష నటించారని దర్శకుడు వెల్లడించారు. -
సింహ గర్జనకు సిద్ధం కావాలి
రాజమహేంద్రవరం రూరల్ : సింహగర్జనకు కాపులు సిద్ధంగా ఉండాలని కాపు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన మోరంపూడి బార్లపూడి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు కార్యాచరణ కమిటీ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చడంలో కాలయాపన చేస్తూండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిమాండు నెరవేరే దిశగా ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ముద్రగడ మాట్లాడుతూ, కాపు ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం తనను, తన కుటుంబ సభ్యులను ఎంతో అవమానించిందని పేర్కొంటూ కంటతడి పెట్టుకున్నారు. కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను బలోపేతం చేసుకోవాలని.. ఉద్యమానికి ఎప్పుడు పిలుపు ఇచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. మంజునాథ కమిషన్ ఇప్పటి వరకూ ఎక్కడా పర్యటించలేదన్నారు. ఏవర్గానికీ అన్యాయం జరగకుండా గతంలో ఉన్న రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలనే కోరుతున్నామన్నారు. ఇది కుల ఉద్యమం కాదని, సామాజిక ఉద్యమమని, హక్కుల కోసం పోరాడకపోతే భవిష్యత్తులో జాతి నష్టపోతుందని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చకపోతే టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులకు భయపడకుండా ఉద్యమానికి సన్నద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, జన్మభూమి కమిటీల పెత్తనంతో కాపు కార్పొరేషన్ రుణాలు పచ్చా చొక్కాలకే పరిమితమవుతున్నాయన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారన్నారు. సీఎం ఆయన సామాజికవర్గానికే న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే లక్ష్యంతో ఏ ఉద్యమం చేపట్టినా సిద్ధంగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను మాత్రమే జేఏసీలో నియమించాలని సూచించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, నరిశే సోమేశ్వరరావు తదితరులు కూడా మాట్లాడారు. ముద్రగడతోపాటు కాపునేతలను పొగుడుతూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాడిన పాట అందరినీ అలరించింది. కాపు జేఏసీ నేత వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్ రామినీడి మురళి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, బసవా ప్రభాకరరావు, కామన ప్రభాకరరావు, కలువకొలను తాతాజీ, సంగిశెట్టి అశోక్, నారాయణస్వామి, జక్కంపూడి గణేష్, నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజా చినబాబుకు సత్కారం తుని కాపు ఐక్యగర్జనకు కొబ్బరితోట ఇచ్చిన రాజా చినబాబును ముద్రగడ పద్మనాభం, కాపునేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ, ముద్రగడ తనకు రాజకీయ గురువని ఆయన కోసం ఏదైనా చేస్తానని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చిన అనంతరం అదే కొబ్బరితోటలో ముద్రగడను ఘనంగా సత్కరిస్తామని చెప్పారు. -
'మార్చిలో బీసీ సింహ గర్జన'
విజయవాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే యోచనకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని వంద కులాల బీసీ వర్గ నేతలు నిర్ణయించారు. కాపు రిజర్వేషన్లపై విజయవాడలోని ఐలాపురంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు పులువురు నేతలు హాజరు అయ్యారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపులను బీసీ జాబీతాలో చేర్చితే బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేరిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
విశాఖ బీచ్‌రోడ్‌లో టీడీపీ సభపై అభ్యంతరాలు
-
నిరుత్సాహపు నీడలు
తెలుగుదేశం పార్టీ ‘గర్జన’ నీరుగారుతోంది. పార్టీ అధినేత ఎదుట తమ బలాన్ని నిరూపించుకునేందుకు గంటా బృందం ఎంతో ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమ వేదిక ఇంకా ఖరారు కాకపోవటంపై టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అనుకున్నట్లుగా బుధవారంనాడే గర్జనను నిర్వహించాలంటే ఈ రెండు రోజుల వ్యవధి చాలదని, వాయిదా వేయక తప్పదని భావిస్తున్నారు. విశాఖపట్నం: తెలుగుదేశం ప్రజాగర్జన సభ వాయి దా పడనుంది. ఈనెల 12న పార్టీ అధినేత నారా చంద్రబాబు హాజరయ్యే ఈ సభను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో భారీస్థాయిలో నిర్వహించాలని పార్టీలోకి కొత్తగా చేరిన గంటా బృందం ఉవ్విళ్లూరింది. భారీస్థాయి జనసమీకరణ ద్వారా తమ బలం నిరూపించుకోవాలనుకుంది. చివర్లో సభా వేదిక అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పార్టీ నేతలు తలపోస్తున్నారు. వాస్తవానికి ప్రజాగర్జనను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విద్యాసంస్థల ఆవరణల్లో బహిరంగ సభలు నిర్వహించకూడదని సీపీ శివధరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ రాజు, ఇతర అధికారులు మాత్రం గంటా బృందానికి సాగిలపడి సభ నిర్వహించుకునేందుకు వీలుగా మద్దతుగా నిలిచారు. దీనిని సీపీ మాత్రం గట్టిగా వ్యవహరించారు. ఏయూ మైదానంలో నిర్వహించడానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ప్రస్తుతం నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయంగా విశాలక్షి నగర్‌లోని విశాఖపట్నం వెటర్నరీ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలంలో సభ ఏర్పాటు చేయాలని భావించారు. వన్‌టౌన్ ప్రాంతంలోని మరో మైదానం కూడా పరిశీలించారు. ఆదివారం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జుల సమావేశంలో తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా జనం వచ్చే వీలుందని పలువురు సూచించారు. సభా వేదికకు అనువైన స్థలం సిద్ధంగా ఉన్నా ఇంకా రెండురోజుల వ్యవధిలో ఏర్పాట్లు చేయడం సాధ్యమని తేల్చారు. దీంతో ప్రస్తుతం గంటా బృందం వెనుకడుగు వేస్తోంది. స్వల్ప వ్యవధిలో బహిరంగసభ నిర్వహిస్తే జనసమీకరణ ఇబ్బందిగా మారి తాము పార్టీలో చేరే విషయం పెద్దగా గుర్తింపులోకి రాదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సభ వాయిదావేయాలా? వద్దా?అనేది సోమవారం నగరానికి రానున్న పార్టీ సీనియర్ నేతలు గరికపాటి,యనమలతో కలిసి మాట్లాడి నిర్ణయించనున్నారు.