
సాక్షి, వైఎస్సార్ జిల్లా: డిసెంబర్ 5న కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమ గర్జనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఇన్‌చార్జ్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ కడపలో రాయలసీమ గర్జన పేరుతో పోస్టర్‌లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీమ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ సలహా మండలి ఛైర్మన్ తిరుపాల్‌రెడ్డి హాజరయ్యారు.