
లక్ష్మీ రాయ్
శ్రీ రామ్, లక్ష్మీ రాయ్ జంటగా బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ నిర్మించిన చిత్రం ‘గర్జన’. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో చేసిన జె. పార్తిబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇంట్లోకి పులి రావడం, పులి నుంచి లక్ష్మీ రాయ్, చిన్నారి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, పులిని వేటాడడానికి శ్రీరామ్ గన్ను పట్టుకుని ఉండటం వంటి విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.
‘‘ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువులు దాడి చేస్తాయి. కానీ మనిషి దాడి చేయాలనుకుంటే కారణం అవసరం లేదు అనే అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ సినిమా కథనం ఆసక్తికరంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో సృష్టించిన పెద్ద పులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment