motion poster released
-
ఎవరు తాతా ఇతను!
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. మారుతీ టీమ్ ప్రోడక్ట్ సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘తాతా.. ఎవరు తాతా ఇతను’, ‘ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా..’, ‘భీష్ముడా తాతా.. కాదమ్మ...’, ‘మాధవ.. వెయ్యి ఏనుగుల బలశాలి భీముడికి మనవణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని’ వంటి డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బాండ్. -
ఈ పాయింట్‌తో యాత్ర 2 ఉంటుంది: మహీ వి. రాఘవ్
'యాత్ర’కి, ‘యాత్ర 2’కి కథ పరంగా సంబంధం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి జీవితంలోని ఎత్తుపల్లాలనే ‘యాత్ర 2’లో చూపిస్తాం' అన్నారు డైరెక్టర్ మహీ వి. రాఘవ్. ఆయన దర్శకత్వంలో శివ మేక నిర్మించనున్న చిత్రం ‘యాత్ర 2’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భగా మహీ వి. రాఘవ్ మాట్లాడుతూ–'యాత్ర 2’లో 2009 నుంచి 2019 వరకు జగన్‌గారి జీవితాన్ని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైమ్‌లో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైమ్‌లో 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. ‘యాత్ర 2’తో ఓటర్లు ప్రభావితం అవుతారనుకోవద్దు. మా సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. కానీ, వాళ్లకు నచ్చినవాళ్లకు ఓటు వేస్తారు. ‘యాత్ర 2’ని వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకున్నా పర్లేదు' అన్నారు. 'నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘యాత్ర’ను అందరూ సపోర్ట్ చేశారు.. ‘యాత్ర 2’ మూవీని కూడా ఆదరించాలి' అన్నారు శివ మేక. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రేమించుకుందాం రా చైల్డ్ ఆర్టిస్ట్
‘ప్రేమించుకుందాం..రా’ , ‘సూర్యవంశం’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటించిన తొలి చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రోష్ని సాహోత, నవమి గయాక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో జి. వంశీకృష్ణ వర్మ, సామ్ జీ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ– ‘‘సినిమా నాప్రాణం. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయడానికి జీవితాంతం సినిమాల్లోనే ఉంటాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథలో హీరో ఆరు నెలలు కంటిన్యూస్‌గా నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఇది’’ అన్నారు ప్రసన్న కుమార్. నటీమణులు రోష్ని సాహోత, నవమి గయాక్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడారు. -
ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మా బలమేదంటే మీ పై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే... మహిమాన్విత మంత్రం నీ నామమే.' అంటూ సాగింది. చివర్లో జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించింది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్ పోస్టర్లను ప్రభాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మీరు ఛార్ ధామ్ దర్శించుకోలేదా.. అయితే జై శ్రీరామ్ నామాన్ని జపించండి చాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. గతంలో ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్‌ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘హంట్’టైటిల్‌ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్‌ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
‘కెప్టెన్ మిల్లర్’గా ధనుష్.. మోషన్ పోస్టర్ విడుదల
Dhanush Captain Miller Movie Motion Poster Released: చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్ తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కెప్టెన్ మిల్లర్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి రాఖీ, సాని కాగితం చిత్రాల ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం (జులై 4) విడుదల చేశారు. ఇది 1930 - 40 ప్రాంతంలో జరిగే పీరియడ్ కథా చిత్రంగా ఉంటుందని, తమిళం, తెలుగు, హిందీ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నిర్మాత టీజీ త్యాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థలో నిర్మించిన భారీ చిత్రాల్లో ఇది చోటు దక్కించుకుంటుందన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు తానూ, ధనుష్ చాలా ఆనందంగా ఫీలయ్యామన్నారు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, మదన్ కార్తీ మాటలు, శ్రేయోస్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. Captain miller .. This is going to be so exciting. Super kicked to work with @ArunMatheswaran and my brother @gvprakash @SathyaJyothi pic.twitter.com/lS8OMSh4I9 — Dhanush (@dhanushkraja) July 2, 2022 -
Slumdog Husband: కుక్కకు భర్తగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు..
Daggubati Rana launched Sanjay Rao Slumdog Husband Motion Poster: పాపులర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం స్లమ్‌డాగ్ హస్బండ్. ఈ సినిమాతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా ప్రణవి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా ఆవిష్కరించాడు. సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ మోస్టర్ ఎంతో హ్యూమరస్‌గా ఉందన్న రానా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'స్లమ్‌డాగ్ హస్బండ్' మూవీ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. వివాహాల్లో కొంతమంది పాటిస్తున్న కొన్ని మూఢనమ్మకాలను వినోదాత్మకంగా చూపెడుతున్నాడు దర్శకుడు. ఈ పోస్టర్ ఐశ్వర్య రాయ్‌కు చెట్టుతో పెళ్లి చేయడం, కొందరికి జంతువులతో వివాహం చేసిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల ఫొటోలతో ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా ఇందులో హీరోకు కుక్కతో పెళ్లి జరిపించే ఫొటోను చూపించారు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో 'ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది' అని డైలాగ్ చెప్పడం బాగా నవ్విస్తోంది. 'మిమ్మల్ని ఈ పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం' అంటూ మోషన్ పోస్టర్‌ను ముగించారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. We are so happy to announce that our #slumdoghusband movie motion poster has been launched. Special thanks for your sweet gesture @RanaDaggubati garu.#productionno04 #SlumDogHusband #SDH#ranadaggubati #motionposterlaunched Link▶️https://t.co/zuq6Fdc6yo@Mic_Movies pic.twitter.com/nPsGUSmXs5 — Productionno4 (@Productionno04) May 29, 2022 -
ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
'బెగ్గర్'గా మారిన సంపూర్ణేష్ బాబు..
Sampoornesh Babu Mr Beggar Movie Motion Poster Released: 'హృదయ కాలేయం' సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తనదైన కామెడీ శైలీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ఆడియెన్స్‌కు ఎంటర్టైన్మెంట్ పంచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు సంపూర్ణేష్ బాబు. ఇటీవలే 'శీలో రక్షతి రక్షితః' అనే విభిన్నమైన క్యాప్షన్‌తో క్యాలీఫ్లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా బెగ్గర్‌గా అలరించనున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు, అద్వితీ శెట్టి జంటగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్’. ‘వీడు చిల్లరడగడు’ అన్నది ట్యాగ్‌లైన్. వడ్ల నాగశారద సమర్పణలో గురురాజ్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరదాగా సాగే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ నెల 25న ప్రారంభించే సెకండ్ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది’’ అన్నారు వడ్ల జనార్థన్. ‘‘దర్శకుడు చక్కటి ప్లానింగ్‌తో అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తున్నారు’’ అని గురురాజ్, కార్తీక్ అన్నారు. చదవండి: ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’ -
రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ మరో సినిమా..
Ravi Teja Presenting Vishnu Vishal Movie Titled Matti Kusthi: కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్ఐఆర్'. విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 11న విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాందించుకుంది. మాస్ మహారాజ రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ మరో సినిమా రానుంది. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' అంటూ క్రీడా నేపథ్యంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చదవండి: రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్ ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై డైరెక్టర్ చెల్లా అయ్యావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ను చిత్రబృందం మంగళవారం (ఏప్రిల్ 5) ప్రకటిస్తూ 'మట్టి కుస్తీ' మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే కుస్తీ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విష్ణు విశాల్‌కు జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించనుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. 'మట్టి కుస్తీ' రెగ్యూలర్ షూటింగ్ బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. -
'గీత' మూవీ మోషన్ పోస్టర్ విడుదల
రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో నటించిన చిత్రం `గీత` (మన కృష్ణగాడి ప్రేమకథ ట్యాగ్ లైన్). శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై రాము, మురళి, పరమేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఫిలించాంబర్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ``మోషన్ పోస్టర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే థియేటర్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు అని పేర్కొన్నారు. -
ఒక ఫైటర్‌గా తప్ప లూజర్‌గా చనిపోకూడదనుకున్నా: హీరో
'చనిపోతే ఒక ఫైటర్‌గా తప్ప లూజర్‌గా చనిపోకూడదని అనుకున్నా' అని హీరో, నిర్మాత రిత్విక్ చిల్లికేశల తెలిపారు. రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కళింగపట్నం జీవా'. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మళ్లీ రావా' చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో లక్ష్య సినిమా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పాల్గొన్నారు. సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని రాహుల్ యాదవ్ తెలిపారు. తనే కథ రాసుకుని, హీరోగా, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం గొప్ప విషయమన్నారు. సినిమా హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ 'మాములుగా నేను డ్యాన్సర్‌ని. కానీ ఈ చిత్రంలో ఒక్క పాట కూడా లేదు. ఒక కమర్షియల్ చిత్రంగా కాకుండా వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాను. ఈ చిత్రానికి కథ, నిర్మాత, రీరికార్డింగ్ వర్క్ కూడా నేనే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అప్పుడు ఒక్కటే అనుకున్నా. ఒకవేళ చనిపోయినా ఒక ఫైటర్‌గా చనిపోవాలి తప్ప లూజర్‌గా కాదని. అందుకే పట్టుదలగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. ఇందులో హీరోకి ఒక కన్ను మాత్రమే ఉండి చాలా వైవిధ్యంగా సినిమా ఉంటుంది.' అని పేర్కొన్నారు. -
ప్రారంభమైన నితిన్ కొత్త చిత్రం, ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్
యంగ్ హీరో నితిన్ 31వ సినిమా ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నితిన్‌కు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి క్లాప్ కోట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను ఖారారు చేస్తూ టైటిల్, మోషన్ పోస్టర్లను విడుదలను చేశారు మేకర్స్. హీరో నితిన్ వెనుక భాగం చూపిస్తూ వదిలిన ఈ పోస్టర్లో మూవీ పేరు ‘మాచర్ల నియోజకవర్గం’గా వెల్లడించారు. ఇక మోషన్ పోస్టర్లో విధ్వంసం సృష్టించిన విలన్ గ్యాంగ్ తన వైపుకు దూసుకు వస్తుంటే, ధైర్యంగా వాళ్లకి ఎదురు నిలిచిన యువకుడిగా నితిన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ మూవీ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. -
‘కళాకార్’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి
‘6 టీన్స్’ మూవీ హీరో రోహిత్ నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కళాకార్’. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. శ్రీను బందెల దర్శకుడు. ఇందులో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఇటీవల హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ‘కళాకార్’ మూవీ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి రిలీజ్చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సినిమాలో రోహిత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మహేంద్ర వర్మగా కనిపించనున్నట్లు మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. క్రియేటివ్‌గా, స్టైలిష్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. హీరో రోహిత్ మాట్లాడుతూ .. ‘ఇటీవల విడుదల చేసిన ‘కళాకార్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా చాలా ఫిట్‌గా ఉన్నావు అని నా ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్ చేసి ప్రసంశించారు. ఇప్పుడు మా మూవీ మోషన్‌పోస్టర్‌ను అనిల్ రావిపూడిగారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నాడు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ.. ‘మేము అడిగిన వెంటనే మోషన్ పోస్టర్ని విడుదల చేసిన అనిల్ రావిపూడిగారికి మా ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ తరపున ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ఇక దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో టీజర్ విడుదలచేస్తాం’ అని తెలిపారు. -
ఆకట్టుకుంటున్న ‘రౌడి బాయ్స్’ మోషన్ పోస్టర్
హుషారు దర్శకుడు హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ మూవీతో ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆశిష్‌కు జోడిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశ్లో ఉన్న ఈ మూవీ మెషన్ పోస్టర్‌ను తాజా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, మేడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథే ఈ రౌడీ బాయ్స్. ‘మా బాయ్స్తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ యువతను వీపరితంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా జూన్ 25న ఈ మూవీ విడుదల కానుంది. -
ఆర్ఆర్ఆర్ : పవర్ఫుల్ లుక్‌లో అజయ్ దేవగన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్‌బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది శుక్రవారం (ఏప్రిల్2)న ఆయన పుట్టినరోజు కావడంతో ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. Empowering his people is his defining characteristic. His strength lies in his emotion. Presenting the poweRRRful avatar of @ajaydevgn in #RRRMovie.https://t.co/2cwcGGl7BF#HappyBirthdayAjayDevgn#AjayDevgn #RRR @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @DVVMovies — RRR Movie (@RRRMovie) April 2, 2021 చదవండి : రాజమౌళి నిర్ణయంతో వకీల్‌సాబ్ నిర్మాత అప్సెట్! ఆర్ఆర్ఆర్ : రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి -
భరతం పట్టడానికి రెడీ
‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఈ నెల 24 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా అదేరోజు ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ‘‘అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి..’ అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
‘బజార్ రౌడీ’.. సంపూ ఎంట్రీ మూములుగా లేదుగా..
‘హృదయ కాలేయం’, ‘సింగం 123’,‘కొబ్బరి మట్ట’ చిత్రాల తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మళ్లీ తెరపై కనిపించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత సంపూ ‘బజార్ రౌడీ’తో మళ్లీ ప్రేక్షకులను నవ్వించేందుకు వస్తున్నాడు. దర్శకుడు వసంత నాగేశ్వర్ రూపొందించిన ఈ చిత్రాన్ని కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్ విషయానికి వస్తే.. చార్మినార్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైలు సీన్లతో మొదలై... రసూల్ పూర సిటీకి రౌడీలు జీపులో వచ్చి హల్చల్ చేస్తున్నట్లు కనిపించారు. అక్కడే పక్కన నడిరోడ్డులో మంచంపై పడుకుని స్టైల్‌గా సిగరేట్ వెలిగిస్తూ బర్నింగ్ స్టార్ రౌడీ లుక్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ పోస్టర్ చూస్తూంటే మరోసారి సంపూ సీరియస్ కామెడీతో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక పెద్ద పెద్ద హీరోలకు పనిచేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ‘బజార్ రౌడీ’కి కొరియోగ్రఫీ అందించడం విశేషం. First Look & Motion Poster of BURNING STAR sampoornesh's #BazarRowdy #SandhireddySrinivasaRao #VasantaNageswaraRao #SekharAlvalapati #SaiKarthik pic.twitter.com/yV042wYDja — Movie Updates (@popcorn553) February 10, 2021 -
దేవినేని: నిజాలు చూపించాం
నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్‌లైన్. శివనాగు దర్శకత్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మించారు. రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ‘మా’ అసోసియేషన్ కార్యదర్శి జీవితా రాజశేఖర్ విడుదల చేయగా, ఫస్ట్ లుక్‌ను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తారకరత్న అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో అతనికి పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్నామన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘గతంలో బెజవాడను బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినా వాటికి పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తీశాం. ఇంతవరకూ ఎవరూ చూపించని నిజాలను ఇందులో చూపించాం. వంగవీటి రంగాని ఎవరు చంపారు అనేది ఈ చిత్రంలో చూపించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగ పాత్రలో నటించిన సురేశ్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన నిర్మాత టి. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/hLIXtGw72G — Nandamuri TarakaRathna (@NTarakarathna) January 10, 2021 -
నల్లమల అడవి నేపథ్యంలో...
‘‘నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను మా ‘నల్లమల’ సినిమాలో చూపించనున్నాం’’ అని దర్శకుడు రవికిరణ్ అన్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ–‘‘సేవ్ నల్లమల’ అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అవినీతి ఒప్పందాలకు వ్యతిరేకంగా భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కరించాడనే వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఆర్.ఎమ్. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్. -
లిఫ్ట్‌లో ఇరుక్కున్న అనసూయ.. మహేశ్ సాయం
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ సినిమాతో రమేష్ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ అంతా భయంకరమైన శబ్ధాలతో ఉండగా, నెలలు నిండిన గర్భవతిగా అనసూయ, అశ్విన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని భయంతో చూస్తున్నారు.లిఫ్ట్ మధ్యలో స్ట్రక్ అయినట్టు.. సాయం కోసం అభి అరుస్తున్నట్టు మోషన్ పోస్టర్లో చూపించారు. అనసూయ ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు రివీల్ చేశారు. ఇంతకి లిఫ్ట్ లో అనసూయ ఎందుకు ఇరుక్కుంది. అసలేం జరిగిందనేది తెలియాలంటే ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమా చూడాల్సిందే. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామ్ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. Happy to present the official motion poster of #ThankYouBrother! Looks thrilling! Wishing the entire team huge success 😊@Raparthy @anusuyakhasba @viraj_ashwin @JustOrdinaryEnthttps://t.co/M9CqobM01n — Mahesh Babu (@urstrulyMahesh) December 24, 2020 -
శ్రీదేవి సోడా సెంటర్
సుధీర్ బాబు హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘భలే మంచి రోజు’లో హీరోగా నటించిన సుధీర్ బాబు ఈ ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ హీరోగా నటించనున్నారు. శుక్రవారం విడుదల చేసిన మోషన్ పోస్టర్లో సుధీర్ బాబు సోడా పట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో మొదలుపెడుతున్నట్లు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: షామ్‌దత్ శైనుద్దీన్. -
గొప్ప ప్రేమజంట
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఫిక్షనల్ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమజంటలు దేవదాస్–పార్వతి, లైలా–మజ్నుల ఫోటోల మీదగా ట్రైన్లో మోషన్ పోస్టర్ మూవ్ అవుతున్నట్లు మోషన్ పోస్టర్లో కనబడుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడీ పోస్టర్లో కనబడుతుంది. ఈ జంట కూడా అంతటి గొప్ప ప్రేమికులనే అర్థం వచ్చేట్లు లుక్‌ను డిజైన్ చేశారు దర్శక–నిర్మాతలు. -
యూత్ రాజా
రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘టెంప్ట్ రాజ’. ఏఆర్కే ఆర్ట్స్ సమర్పణలో రాంకి (రామకృష్ణ) తెరకెక్కించారు. దివ్యా రావు, ఆస్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీర్నాల రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఫీమేల్ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన చిత్రమిది. యువతను అలరించే అంశాలు ఉన్నాయి. పోసాని కృష్ణమురళీగారి పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్, సంగీతం: హరి గౌర. -
మల్టీజానర్ క్లైమాక్స్
పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై పి.రాజేశ్వరరెడ్డి, కె. కరుణాకర్ రెడ్డి తెరకెక్కించారు. భవానీ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను కీలక పాత్రను పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రదర్శకుడు భవానీ శంకర్‌తో గతంలో నేను ‘డ్రీం’ అనే ౖసైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించాను. ఆ చిత్రం రాయల్రీల్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతోపాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. కానీ, ఓ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే ఆదరించారని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్.. ఇలా మల్టీజానర్ కథతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు భవానీ శంకర్. -
థ్యాంక్యూ మోహన్‌బాబు: చిరంజీవి
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెడలో ఎర్ర తుండు, చేతిలో కత్తితో సీరియస్ లుక్‌లో ఉన్నారు చిరు. మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోషన్ పోస్టర్లో ఓ ఆకర్షణలా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చిరంజీవి ఉద్యమకారుడిగా నటిస్తున్నారని సమాచారం. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. మిత్రుడికి చిరు కానుక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చెక్కతో తయారు చేసిన హ్యార్లీ డేవిడ్సన్ బైక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు మోహన్‌బాబు. ‘నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజునాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్‌బాబు’ అని ఆ బైక్‌తో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు చిరు. మోహన్‌బాబు కానుక ఇచ్చిన చెక్క బైక్‌తో చిరంజీవి -
విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు
విన్నర్స్ రన్ ది వరల్డ్.... విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు. ఈ డైలాగ్ శుక్రవారం దర్శకుడు దేవా కట్టా విడుదల చేసిన ‘ఇంద్రప్రస్థం’ (వర్కింగ్ టైటిల్) చిత్రం థీమ్ పోస్టర్లోనిది. దేవా కట్టా రచయితగా, దర్శకునిగా చేస్తున్న తాజా చిత్రం ఇది. ‘‘ఒకప్పటి మంచి స్నేహితులు, రాజకీయ ప్రత్యర్థులుగా మారి 30 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిన ఇద్దరి నాయకుల ప్రయాణం ప్రధానాంశంగా కాల్పనిక సన్నివేశాలతో తయారవుతున్నదే నా సినిమా. ఇద్దరు రాజకీయ దిగ్గజాల స్నేహానికి, రాజకీయాల్లో వారి శత్రుత్వానికి, ఆ ఇద్దరికీ వారి అనుచరులు ఇచ్చే గౌరవానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే సినిమా ఇది’’ అన్నారు దేవా కట్టా. ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షా.వి, తేజ.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సురేశ్ బొబ్బిలి అందించారు. ప్రస్తుతం దేవా కట్టా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 14వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. -
రౌద్రం రణం రుధిరం
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అని, ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకొచ్చాయి. తాము అనుకున్న టైటిల్‌ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మోషన్ పోస్టర్ చూస్తుంటే అగ్ని స్వభావంతో ఉన్నట్లు రామ్‌చరణ్ పాత్రను, జల స్వభావంతో ఉన్నట్లు ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి తీర్చిదిద్దారని అర్థమవుతోంది. ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది. -
ఆలోచింపజేసే 14
‘కుమారి 21 ఎఫ్’ నోయల్ ప్రధాన పాత్రలో రతన్, విశాఖ జంటగా నటించిన చిత్రం ‘14’. లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ‘బిగ్ బాస్’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ‘14’ చిత్రంతో ఎక్కువ పేరు రావాలి’’ అన్నారు. ‘‘వైవిద్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. కొత్త పాయింట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు లక్ష్మి శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి. -
చిన్నారి..యువతి..మధ్యలో పులి
శ్రీ రామ్, లక్ష్మీ రాయ్ జంటగా బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ నిర్మించిన చిత్రం ‘గర్జన’. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో చేసిన జె. పార్తిబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇంట్లోకి పులి రావడం, పులి నుంచి లక్ష్మీ రాయ్, చిన్నారి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, పులిని వేటాడడానికి శ్రీరామ్ గన్ను పట్టుకుని ఉండటం వంటి విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. ‘‘ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువులు దాడి చేస్తాయి. కానీ మనిషి దాడి చేయాలనుకుంటే కారణం అవసరం లేదు అనే అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ సినిమా కథనం ఆసక్తికరంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో సృష్టించిన పెద్ద పులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మంచి మలుపు అవుతుంది
సీనియర్ నటుడు సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. రక్షకభటుడు, ఆనందం, లవర్స్ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఎ. గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత తదితరులు ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మోషన్ పోస్టర్ని హీరో వెంకటేశ్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాష్ నాకు మంచి మిత్రుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కు ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు’’ అన్నారు సత్యప్రకాష్. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ. -
మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన 'తోలుబొమ్మలాట' చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. బలమైన, పదునైన డైలాగులతో, మానవ సంబంధాల మర్మాన్ని విప్పుతున్నట్టున్న ఈ మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆ నలుగురు లాంటి మూవీల ద్వారా విలక్షణ పాత్రల్లో నటుడిగా తనకంటూ ఒకప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్ననటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ సోమరాజు అలియాస్ సోడాల్రాజు పాత్ర ద్వారా మరోసారి ప్రశంసలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి విలువలతో విభిన్న కుటుంబ కథాచిత్రంగా వస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదైలన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పక్కా గ్రామీణ వాతావరణం, గ్రామీణ కళలతోపాటు, కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా మూవీ థియేటర్లను పలకరించే సమయం చాలా సమీపంలోనే ఉంది. Motion poster from Team #Tholubommalata 😀😀😀https://t.co/EbdutRmGdh — vennela kishore (@vennelakishore) October 11, 2019 -
నిజమైన ప్రేమకోసం...
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో, సుమన్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ‘సెర్చింగ్ ఫర్ ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. మురళి రామస్వామిని దర్శకత్వంలో ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గశ్రీ ఫిలింస్‌తో కలిసి పి.ఎస్.రామకృష్ణ (ఆర్.కె) నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబటి రామకృష్ణ విడుదల చేశారు. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, రొమాన్స్, కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి పాత్ర కనెక్టయ్యేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో ఆడియోతో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పి.ఎస్.రామకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్ పండిట్, జియస్ రావ్, వై. వెంకటలక్ష్మి. -
అక్షర పోరాటం
విద్య సమాజాన్ని మార్చే బలమైన ఆయుధం అంటున్నారు దర్శకుడు చిన్నికృష్ణ. కానీ ఇప్పుడు సమాజంలో విద్యను మించిన వ్యాపారం మరోటి లేదు అని అందరూ అంటుంటారు. విద్యా వ్యవస్థను కథా వస్తువుగా చేసుకుని నందితా శ్వేత ముఖ్య పాత్రలో దర్శకుడు చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అక్షర’. సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మాతలు. భోగి పండగ సందర్భంగా ‘అక్షర’ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఫక్తు వ్యాపారంగా మారిపోయిన విద్యా వ్యవస్థపై అక్షర చేసే పోరాటమే ఈ సినిమా. నందిత కెరీర్లోనే అక్షర బెస్ట్ పాత్రగా నిలుస్తుంది. సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాక్గౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. వేసవిలో సినిమాను విడదల చేస్తాం’’ అన్నారు. -
పదిమందికి సాయపడితే....
చుట్టూ ఉన్న పదిమందికి సాయపడితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనందమే వేరు...! ఇదే కాన్సెప్ట్‌తో ఓ చిత్రం రానుంది. శ్రీనివాస్ కళ్యాణ్, పొద్దార్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పిల్లర్ 9 పతాకంపై నిర్మితమవు తోన్న మొదటి చిత్రం ‘వెల్కమ్ జిందగీ’. శాలు–లక్ష్మణ్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకులు శాలు–లక్ష్మణ్‌లు మాట్లాడుతూ– ‘‘సాయం గురించి మాట్లాడే సినిమా ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా మా చిత్రం రాబోతోంది. హీరో,హీరోయిన్ల్ కొత్తవారైనా చక్కగా నటించారు. మధుమణి, కమల్ కీలక పాత్రలు పోషించారు. జబర్ధస్త్ ఫేమ్ కొమరం హీరో ఫ్రెండ్‌గా నటించారు. తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటాడు. చిత్రంలో ఐదు పాటలుంటాయి. గౌతమ్ రవిరామ్ మంచి సంగీతం అందించారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటు న్నాం’’ అన్నారు. -
సర్వస్వం తానే!
‘వివేక్ మంచి రైటర్ అని అతికొద్ది మందికే తెలుసు. నాతో కలిసి పనిచేసినప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది. మంచి యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు అల్లాణి శ్రీధర్ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్వయంవద’. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మిస్తున్నారు. అల్లాణి శ్రీధర్ టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఎ సుబ్బారావు, టైటిల్ మోషన్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. వివేక్ వర్మ మాట్లాడుతూ– ‘‘అల్లాణి శ్రీధర్‌గారి వద్ద 15 ఏళ్లు పని చేశాను. రాజ్ కందుకూరిగారి దగ్గర వర్క్ చేసి, చాలా విషయాలు తెలుసుకున్నా. ఎ.వి.ఎ సుబ్బారావుగారి సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తున్నా. ‘స్వయం వద’ అనేది సంస్కృతి పదం. తానే ఓ సర్వస్వం అనుకునే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి. -
సురయ్యా.. ఆగయా
‘మల్లీశ్వరి, అల్లరి పిడుగు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్రంలో కీలక పాత్రలకు సంబంధించిన లుక్స్, మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం కత్రినా కైఫ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఈ పొడుగుకాళ్ల సుందరి సురయ్యా పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన అభిమానులు లుక్ అదుర్స్ అంటూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు. -
సత్తి హీరో అయ్యాడోచ్
యాంకర్‌గా, నటుడిగా ఫేమస్ అయిన ‘బిత్తిరి’ సత్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘తుపాకి రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘బిత్తిరి సత్తి’గా పరిచయమైన సత్తి ఈ సినిమాతో మరో కోణంలో కనిపిస్తున్నారు. నాకు పరిచయమైన తొలి దర్శకుడు ప్రభాకర్‌గారు. ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ మంచి పేరు, సక్సెస్ తేవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సత్తిని కొత్త కోణంలో చూపిస్తున్నాం. బాలకిషన్‌గారు రాజీ పడ కుండా నిర్మించారు’’ అన్నారు టి.ప్రభాకర్. ‘‘సత్తిని హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు ఈ చిత్రం సత్తిని బిజీ నటుడిని చేస్తుంది’’ అన్నారు బాలకిషన్. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మక్కపాటి చంద్రశేఖర్, మక్బూల్ హుస్సేన్. -
పేట్టలో వేట
గంటల వ్యవధిలో ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. అటు ‘2.0’ టీజర్, ఇటు తాజా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాకు ‘పేట్ట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా మోషన్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మాళవికా మోహనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. ‘పేట్ట’లో రజనీకాంత్ విలన్స్‌ని ఎలా వేటాడతారు? అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచి... ‘2.0’ విషయానికి వస్తే... శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలుగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
కల్కి షురూ
పవర్ఫుల్ పాత్రలతో పాటు కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు కథానాయకుడు డా. రాజశేఖర్. గతేడాది ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తర్వాతి చిత్రానికి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తర్వాతి చిత్రం ఉంటుందని రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్రబృందం ‘కల్కి’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అంజలి కనిపించనున్నారనే వార్త షికారు చేస్తోంది. -
సల్మాన్ రేస్ 3 మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సల్మాన్ ఖాన్ నెక్ట్స్ మూవీ రేస్ 3 మోషన్ పోస్టర్‌ను బాలీవుడ్ కండలవీరుడు గురువారం విడుదల చేశారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఈ సందర్భంగా సల్మాన్ వెల్లడించారు. రేస్ 3 లీడ్ రోల్లో సల్మాన్ ఖాన్ సందడి చేయనుండగా, జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా తమ అందాలతో కనువిందు చేయనున్నారు. ఇంకా అనిల్ కపూర్, సాఖిబ్ సలీంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో రేస్, రేస్ 2 మూవీల్లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక రేస్ 3 మూవీ టిప్స్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోంది. రేస్ సీక్వెల్లో సైఫ్ అలీ ఖాన్ స్ధానంలో సల్మాన్ ఖాన్ ఎంతవరకూ మెప్పించగలరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా కూడా కొద్దిసేపు మెరవనున్నట్టు తెలిసింది. యాక్షన్, డ్రామా, రొమాన్స్, గ్లామర్ కలగలిపి రేస్ 3 ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. -
ఊరంతా అనుకుంటున్నారు
‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో ప్రేక్షకులకు నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ప్రస్తుతం తండ్రి నరేష్‌తో కలిసి ‘విఠలాచార్య’ సినిమాలో నటిస్తున్న నవీన్ పుట్టినరోజును(మంగళవారం) పురస్కరించుకొని మూడో సినిమా ప్రకటించారు. బాలాజీ సనాల దర్శకత్వంలో రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్–యు–ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి– ఎ.పద్మనాభరెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నవీన్ విజయ్‌కృష్ణ మిత్రుడు హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: జి.లింగబాబు, లైన్ ప్రొడ్యూసర్: శ్రీరమ్య గోగుల. -
సింగం ఈజ్ బ్యాక్!
భయం లేదు.. చిక్కులెన్ని ఎదురైనా ముందడుగు వేసే వీరుడు.. పిడుగల్లే వచ్చే పోలీస్.. నరసింహం అలియాస్ సింగం మళ్లీ వస్తున్నాడు. సింహంలా గర్జించడానికి సిద్ధమయ్యాడు. హరి దర్శకత్వంలో మాస్ పోలీసాఫీసర్ నరసింహంగా హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘సింగం-3’. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. దీపావళి కానుకగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నవంబర్ 7న టీజర్ విడుదల చేయనున్నారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ - ‘‘సింగం సిరీస్‌లో గత రెండు సినిమాల కంటే పవర్ఫుల్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ చివరి వారంలో పాటల్ని, డిసెంబర్ 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
తాతామనవళ్ల 'శతమానం భవతి'
-
ఈనెల 28న 'గోపాల గోపాల' ఆడియో
-
గోపాల గోపాల ఫస్ట్‌లుక్ వచ్చేసిందీ!
-
గోపాల గోపాల ఫస్ట్‌లుక్ విడుదల
టాలీవుడ్ అభిమానులు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం తొలి మోషన్ పోస్టర్ విడుదలైంది. యూట్యూబ్‌లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. 'ఓ మైగాడ్' హిందీ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దేవుడిపై కోర్టులో కేసు వేసే హీరో పాత్రలో వెంకటేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్లో పవన్ కల్యాణ్ ఉయ్యాలలో పడుకుని, కళ్లు మూసుకుని చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తుండగా, ఆ వెనక నుంచి వెంకటేశ్ వచ్చి, అచ్చం పవన్ ఇచ్చిన పోజులోనే నిలబడి ఉండగా గోపాల గోపాల అనే టైటిల్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ అంతా సింబాలిక్‌గా నెమలి ఈకల డిజైన్ ఉంచారు. మొత్తానికి పవన్, వెంకటేశ్ అభిమానుల ఎదురుచూపులు ఇన్నాళ్లకు ఫలించాయి.