
పూజా హెగ్డే, ప్రభాస్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఫిక్షనల్ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమజంటలు దేవదాస్–పార్వతి, లైలా–మజ్నుల ఫోటోల మీదగా ట్రైన్‌లో మోషన్ పోస్టర్ మూవ్ అవుతున్నట్లు మోషన్ పోస్టర్‌లో కనబడుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడీ పోస్టర్‌లో కనబడుతుంది. ఈ జంట కూడా అంతటి గొప్ప ప్రేమికులనే అర్థం వచ్చేట్లు లుక్‌ను డిజైన్ చేశారు దర్శక–నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment