Prabhas Radhe Shyam Update: Love Anthem Teaser Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Radhe Shyam Second Song: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రాధేశ్యామ్ నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్

Published Sun, Nov 28 2021 12:06 PM | Last Updated on Sun, Nov 28 2021 1:08 PM

Radhe Shyam Song Love Anthem Teaser Release On 29th November - Sakshi

Prabhas Radhe Shyam Second Song Update: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త. ‘రాధేశ్యామ్‌(Radhe Shyam)’నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ విడుదల కాబోతుంది. రేపు(నవంబర్‌ 29) వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ టీజర్ రిలీజ్‌ కానుంది. ‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు.

సాహో తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’.పూజ హెగ్డే హీరోహీరోయిన్‌. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement