ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విశ్వరూపం దాల్చింది. ఓమిక్రాన్ దెబ్బకి పలు దేశాల్లో మళ్లీ ఆంక్షల విధింపు మొదలైన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. పలు చోట్ల సినిమా థియేటర్స్‌ని మూసివేశారు. దీంతో పలు పాన్ ఇండియా చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. టాలీవుడ్ లో దాని ప్రభావం ‘ఆర్.ఆర్.ఆర్.’ పై పడింది. జనవరి 7న విడుదల కావలసి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూన్నట్లు ఇటీవల చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.ఈ మూవీ సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడొచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వాస‍్తవానికి ఈ మూవీ జనవరి 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. చిత్రబృందం కూడా ఇదివరకు చెప్పినట్లుగానే సంక్రాంతి సందర్భంగా జనవరి 14నే ‘రాధేశ్యామ్’విడుదల అవుతుందని స్పష్టం చేసింది. కానీ కరోనా కారణంగా ఈ మూవీ పక్కా పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుందట.
(చదవండి: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ..)
దేశంలో ఆంక్షలు ఎక్కువైతే.. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు గానూ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 400 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే ఓటీటీలో విడుదల చేసే ఆలోచన మాత్రం చిత్రబృందానికి లేదని తెలుస్తోంది. కానీ, కరోనా ఆంక్షలు ఎక్కువతున్న ఇలాంటి సమయంలో.. , కనీసం రూ. 450కోట్ల ఆఫర్ వస్తే నేరుగా ఓటీటీలో విడుదల చేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment