Nithiin And Krithi Shetty New Film Name As Macherla Niyojakavargam - Sakshi
Sakshi News home page

ప్రారంభమైన నితిన్‌ కొత్త చిత్రం, ఆకట్టుకుంటున్న మోషన్‌ పోస్టర్‌

Published Fri, Sep 10 2021 7:37 PM | Last Updated on Sat, Sep 11 2021 1:07 PM

Nithiin New Movie Name As Macherla Niyojakavargam - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌ 31వ సినిమా ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఎస్‌ఆర్‌ శేఖర్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నితిన్‌కు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి క్లాప్‌ కోట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను ఖారారు చేస్తూ టైటిల్‌, మోషన్‌ పోస్టర్లను విడుదలను చేశారు మేకర్స్‌.

హీరో నితిన్‌ వెనుక భాగం చూపిస్తూ వదిలిన ఈ పోస్టర్‌లో మూవీ పేరు ‘మాచర్ల నియోజకవర్గం’గా వెల్లడించారు. ఇక మోషన్‌ పోస్టర్‌లో విధ్వంసం సృష్టించిన విలన్ గ్యాంగ్ తన వైపుకు దూసుకు వస్తుంటే, ధైర్యంగా వాళ్లకి ఎదురు నిలిచిన యువకుడిగా నితిన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ మూవీ విలేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ను జరుపుకోనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement