నల్లమల అడవి నేపథ్యంలో... | NALLAMALA Movie Motion Poster Launched By Trivikram | Sakshi
Sakshi News home page

నల్లమల అడవి నేపథ్యంలో...

Published Sat, Jan 2 2021 1:15 AM | Last Updated on Sat, Jan 2 2021 1:15 AM

NALLAMALA Movie Motion Poster Launched By Trivikram - Sakshi

అమిత్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, రవికిరణ్‌

‘‘నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను మా ‘నల్లమల’ సినిమాలో చూపించనున్నాం’’ అని దర్శకుడు రవికిరణ్‌ అన్నారు. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి, ముక్కు అవినాశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు త్రివిక్రమ్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రవికిరణ్‌ మాట్లాడుతూ–‘‘సేవ్‌ నల్లమల’ అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అవినీతి ఒప్పందాలకు వ్యతిరేకంగా భవిష్యత్‌ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కరించాడనే వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఆర్‌.ఎమ్‌. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement