
'పుష్ప 2' వచ్చి మూడు నెలలు దాటేసింది. అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా.. ఎవరితో చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి డైరెక్టర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలింతకీ ఏంటి సమస్య? ఎవరితో ఫస్ట్ చేయొచ్చు?
అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు కానీ ఇదివరకే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పీరియాడిక్ సెటప్ ఉన్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పట్టేలా ఉంది. నిర్మాత నాగవంశీ.. రీసెంట్ గానే మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రాజెక్ట్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఆరేడు నెలలు బన్నీ ఖాళీగానే ఉంటాడు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)
మరోవైపు అల్లు అర్జున్.. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. కాకపోతే బడ్జెట్-రెమ్యునరేషన్ దగ్గరే చిక్కంతా వచ్చి పడిందని తెలుస్తోంది. రూ.600 కోట్ల బడ్జెట్ కాగా.. పారితోషికం కింద తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ అంటున్నాడట. ఈ పాయింట్ దగ్గరే డిష్కసన్స్ నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో బన్నీ-అట్లీ కాంబోపై క్లారిటీ వస్తుందని టాక్.
అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే మొదలవుతుంది. లేదంటే మాత్రం ఈ ఏడాది చివర్లో షురూ చేసేస్తారు. మరి బన్నీ ఏం చేస్తాడనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే)
Comments
Please login to add a commentAdd a comment