అల్లు అర్జున్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ..? | Janhvi Kapoor to reportedly star opposite Allu Arjun in Atlee next movie | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ..?

Published Wed, Feb 19 2025 1:06 AM | Last Updated on Wed, Feb 19 2025 6:42 AM

Janhvi Kapoor to reportedly star opposite Allu Arjun in Atlee next movie

తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ ‘దేవర: పార్ట్‌ 1’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారామె. ఈ యంగ్‌ బ్యూటీకి మరో సూపర్‌ చాన్స్‌ దక్కిందట. అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే టాక్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించనుందట. ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రకు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి... ఈ వార్త నిజమై అల్లు అర్జున్‌ సరసన జాన్వీ కనిపిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్‌లో భాగంగా అల్లు అర్జున్‌ స్పెయిన్‌లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement