పుష్ప2 విజయంతో అంతర్జాతీయస్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్ కూడా మరింత పెరిగింది. అయితే, అల్లు అర్జున్- త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలు తాజాగా నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.
డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిర్మాత నాగవంశీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. 2025లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాలో వారిద్దరూ కూర్చుని ఫైనల్ చేయనున్నారన్నారు.
'పుష్ప2తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. అందుకు సరిపోయేలా ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్‌లోనే ఉంటుంది. బన్నీ, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గత చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓస్టూడియోను నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చే ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ పార్ట్ చాలా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇది పాన్ ఇండియా మొదటి సినిమా. అందుకే త్రివిక్రమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రెడీ చేశారు.' అని ఆయన అన్నారు.
ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని. ఆయన కూడా టచ్ చేయని జానర్‌లో ఈ సినిమా ఉంటుందని గతంలోనే నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా ఆయన అన్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment