అనికారావు, ఆదిత్య
‘వివేక్ మంచి రైటర్ అని అతికొద్ది మందికే తెలుసు. నాతో కలిసి పనిచేసినప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది. మంచి యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు అల్లాణి శ్రీధర్ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్వయంవద’. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మిస్తున్నారు. అల్లాణి శ్రీధర్ టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఎ సుబ్బారావు, టైటిల్ మోషన్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి ఆవిష్కరించారు.
వివేక్ వర్మ మాట్లాడుతూ– ‘‘అల్లాణి శ్రీధర్‌గారి వద్ద 15 ఏళ్లు పని చేశాను. రాజ్ కందుకూరిగారి దగ్గర వర్క్ చేసి, చాలా విషయాలు తెలుసుకున్నా. ఎ.వి.ఎ సుబ్బారావుగారి సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తున్నా. ‘స్వయం వద’ అనేది సంస్కృతి పదం. తానే ఓ సర్వస్వం అనుకునే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి.
Comments
Please login to add a commentAdd a comment