adithya
-
Aditya Subramanian: ఫిట్‌గా ఒక్కో మెట్టెక్కి...
మిస్టర్ ఇండియా విజయం నేను కోరుకుంటున్న కెరీర్‌కు తొలి అడుగు మాత్రమే. నా ఈ విజయం మనదేశంలో మోడలింగ్, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. అంకితభావంతో హార్డ్‌వర్క్ చేసినప్పుడే విజయం సొంతమవుతుంది. అదే మనల్ని మన లక్ష్యాల దరి చేరుస్తుంది. – ఆదిత్య సుబ్రమణియన్, మిస్టర్ ఇండియా విజేతఆదిత్య సుబ్రమణియన్... ఆరడుగుల ఎత్తున్న 27 ఏళ్ల కుర్రాడు. చెన్నైలోని పల్లవరానికి చెందిన ఈ యువకుడు ఎస్ఆర్ఎమ్ కాలేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. చదువు పూర్తి చేసి కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడితో సంతృప్తి చెందలేదతడు. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కెరీర్ దృష్టిని విస్తృతం చేసుకున్నాడు. తనకిష్టమైన ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్‌లో అదృష్టాన్ని, అవకాశాలనూ పరీక్షించుకోవాలనుకున్నాడు. అందుకోసం ముందుగా ఏదైనా ఒక వేదిక మీద విజేతగా నిలవడం తొలి మెట్టు అనుకున్నాడు. ఏకకాలంలో పలువురి దృష్టిని ఆకర్షించడానికి మిస్టర్ ఇండియా పోటీలను ఎంచుకున్నాడు, విజేతగా నిలిచాడు. కలసాధనకు కాలపరీక్ష!సాహిత్యాభిలాషి అయిన ఆదిత్య తాను కలలు కన్న లక్ష్యాన్ని చేరడానికి ఆరేళ్లుగా కఠోరంగా శ్రమించాడు. పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ తనను తాను మలుచుకుంటూ దేహాకృతి కోసం క్రమం తప్పకుండా జిమ్‌లో ఎక్సర్సైజ్లు చేశాడు. మిస్టర్ మదరాసీ, ఐరిస్ గ్లామ్ మిస్టర్ సూపరామ్ప్, ఎస్టిలో మిస్టర్ సదరన్ క్రౌన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. మోడలింగ్‌లో నిరూపించుకున్నాడు. ఇదంతా చెప్పుకున్నంత సులువుగా జరగలేదు.ఒక్కో విజయాన్ని అందుకుంటూ తాను ఎంచుకున్న శిఖరం వైపు ప్రయాణం సాగిస్తున్న సమయంలో కాలం పెద్ద పరీక్ష పెట్టింది. మిస్టర్ ఇండియా పోటీల కోసం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు వెన్నెముకకు గాయమైంది. ప్రాక్టీస్ మానేయాల్సి వచ్చింది. గాయం మానే వరకు విశ్రాంతి తప్పదు. ఈ లోపు బాడీ షేపవుట్ కాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం కూడా పెద్ద చాలెంజ్ అనే చె΄్పాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో మొదలైన అంతర్మథనం తనలో ప్రశాంతతను అలవరిచిందని, ఆత్మస్థయిర్యాన్ని పెంచి వ్యక్తిగా పరిణతి చెందడానికి దోహదం చేసిందని చె΄్పాడు ఆదిత్య. వెండితెర మీద వెలగాలి..ఆదిత్య గెలిచిన మిస్టర్ ఇండియా కిరీటం పేరు ‘రుబారు మిస్టర్ ఇండియా 2024 కాబల్లెరో యూనివర్సల్’. ఈ టైటిల్ విజేతలు వెనిజులాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కాబల్లెరో యూనివర్సల్ పోటీల్లో ప్రపంచదేశాలతో పోటీ పడతారు. ఆ పోటీల్లో మనదేశానికిప్రాతినిధ్యం వహించనున్నాడు ఆదిత్య. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్, యాక్టింగ్ పట్ల తన ఇష్టాన్ని తెలియచేస్తూ నటుడిగా స్థిరపడాలనేది తన అంతిమ లక్ష్యమని చె΄్పాడు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గాయని కుటుంబంలో తీవ్ర విషాదం
ముంబై: ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ ఆదిత్య పౌడ్వాల్(35) కన్నుమూశారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘ఈ వార్త వినగానే విషాదంలో మునిగిపోయాను. మా సన్నిహితుడైన ఆదిత్య పౌడ్వాల్ ఇకలేరు. తనొక అద్భుతమైన మ్యుజీషియన్. మంచి వ్యక్తి. హాస్య చతురత గలవాడు. మేమిద్దరం కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేశాం. ఈ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. లవ్ యూ ఆదిత్య.. నిన్ను మిస్సవుతున్నా’’ అని ఆదిత్య ఫొటో షేర్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆదిత్య అనారోగ్య కారణాలతో సతమతమవుతున్నాడని, కిడ్నీలు, ఊపిరి తిత్తుల్లో సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆదిత్య మరణించినట్లు శంకర్ మహదేవన్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. కాగా ఆదిత్య పౌడ్వాల్ మృతి పట్ల సినీ, సంగీత ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గాయకుడు, సంగీత దర్శకుడు తౌసీఫ్ అక్తర్, సింగర్ అర్మాన్ మాలిక్ ట్విటర్ వేదికగా అతడికి నివాళులు అర్పించారు. మంచి మనసున్న ఆదిత్య ఇంత చిన్న వయస్సులోనే లోకాన్ని వీడి వెళ్లడం బాధాకరమన్నారు. ఆదిత్యతో తమకున్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ.. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా ఆదిత్య తల్లిదండ్రులు అనురాధ- అరుణ్ పౌడ్వాల్ ఇద్దరూ సంగీత ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సంగీత రంగానికి అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అనురాధను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక తల్లిదండ్రుల బాటలోనే నడిచిన ఆదిత్య సైతం సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఠాక్రే సినిమాకు అతడు చివరిసారిగా సంగీతం అందించాడు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తెరకెక్కిన చిత్రం ‘గుండమ్మ కథ’. ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీ శ్రీవాత్సవ నిర్మించిన ఈ సినిమాలోని ‘రింగ్ ట్రింగ్..’ అంటూ సాగే మొదటి పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్ తదితర అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. సతీష్ సాధన్ చక్కటి పాటలు అందించారు. ‘రింగ్ ట్రింగ్..’ అంటూ సాగే ఈ పాటను వేగ్నేశ్న శ్రీ విజయ రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘గెటప్’ శ్రీను, భాష నటించిన ఈ చిత్రానికి కెమెరా: మోనీష్ భూపతి, దర్శకత్వం: లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణంరాజు. -
ఉదిత్ నారాయణ్ కోడలు కాబోతున్న సింగర్!
ముంబై: ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్-11 వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బాలీవుడ్ టాప్ సింగర్ ఉదిత్ నారాయణ్, గాయని అల్కా యాగ్నిక్ అతిథులుగా సందడి చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఈ షో జడ్జి నేహా కక్కర్ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు రావడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. షో హోస్ట్, ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ తమకు బాగా నచ్చాడని.. అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో నేహా కంగుతిన్నారు. నటుడు, బుల్లితెర హోస్ట్‌గా గుర్తింపు పొందిన ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా జడ్జి నేహా కక్కర్‌ను ప్రేమిస్తున్నానంటూ తరచుగా ఆమెకు ప్రపోజ్ చేయడం... ఆమె సమాధానం ఇవ్వకుండా దాటవేయడం వంటి పరిణామాలతో షో సందడిగా సాగుతోంది. (‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’) ఈ క్రమంలో ఆదివారం నాటి షోకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదిత్ నారాయణ దంపతులతో పాటు నేహా కక్కర్ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు వచ్చారు. నేహను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు ఉదిత్ నారాయణ పేర్కొన్నారు. ఆయన భార్య దీపా నారాయణ్ సైతం ఇదే ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతేగాక నేహా తల్లిదండ్రులు కూడా పెళ్లి ఖాయం చేశామంటూ వ్యాఖ్యానించడంతో నేహా సహ జడ్జీలు ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 14న నేహా-ఆదిత్యల వివాహం జరుగనుందంటూ ప్రోమోలో పేర్కొనడంతో..ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే.. ‘ఇదంతా నిజమా లేదా షో రేటింగ్‌ను పెంచే క్రమంలో భాగంగానో తెలియదు గానీ.. మీ జంట బాగుంటుంది నేహా- ఆదిత్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ఆలపించిన నేహా.. నటుడు హిమాంశు కోహ్లితో ప్రేమలో ఉన్నట్టు ఇండియన్ ఐడల్ వేదికపై గతంలో ప్రకటించారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోయారు. Taareekh teh ho chuki hai, Mummy-Papa ne bhi apni haan de di hai! Kya Aditya finally Neha ko apni dulhan banaane mein kaamiyaab hoga? Dekhiye #IndianIdol11 #AlkajiUditjiSpecial mein, iss Sunday raat 8 baje. #AlkaYagnik #UditNarayan #AdityaNarayan @iAmNehaKakkar @VishalDadlani pic.twitter.com/odf47CSwMH — Sony TV (@SonyTV) January 9, 2020 -
అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక..
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. కింగ్ నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సుమంత్, సుప్రియా, నాగసుశీల, సుశాంత్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే తన సోదరుడు ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోలో నాగచైతన్య భార్య సమంత కనిపించకపోవడంతో.. సమంత ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య, వెంకటేశ్‌తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామా’ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
స్పీకర్ సీటుకు అవమానం!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ సీటుకు అవమానం జరిగింది. శుక్రవారం విభజన హామీల అమలుపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంలో 13 నిమిషాల పాటు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు రెస్ట్ రూములోకి వెళ్ళారు. ఆ సమయంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య స్పీకర్ స్థానాన్ని అధిష్టించి సభను నడిపించారు. ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్లచొక్కా, నల్ల ప్యాంటు వేసుకొని శాసనసభకు వచ్చారు. పూర్తిగా నల్ల దుస్తులతో స్పీకర్ స్థానంలో కూర్చోవడం పలువురిలో చర్చకు దారితీసింది. -
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
ఆటోనగర్(విజయవాడ తూర్పు): చెడు స్నేహానికి అలవాటు పడి యువకుడు నిండుప్రాణాలను బలితీసుకున్న ఘటన రామలింగేశ్వరనగర్లో గురువారం చోటుచేసుకుంది. పటమట పోలీసుల అందించిన వివరాలు.. మందపాటి ఆదిత్య(25) డిగ్రీ మధ్యలో చదువు మానివేసి వ్యసనాలకు బానిసయ్యాడు. పనికి వెళ్లే విషయలో వివా దం రావడంతో గురువారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిమీద బయటికి వెళ్లిన తల్లి కరుణజ్యోతి ఇంటికి వచ్చి చూస్తే ఉరి వేసుకుని వేలాడుతుండడంతో పోలీ స్‌లకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
సర్వస్వం తానే!
‘వివేక్ మంచి రైటర్ అని అతికొద్ది మందికే తెలుసు. నాతో కలిసి పనిచేసినప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది. మంచి యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు అల్లాణి శ్రీధర్ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్వయంవద’. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మిస్తున్నారు. అల్లాణి శ్రీధర్ టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఎ సుబ్బారావు, టైటిల్ మోషన్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. వివేక్ వర్మ మాట్లాడుతూ– ‘‘అల్లాణి శ్రీధర్‌గారి వద్ద 15 ఏళ్లు పని చేశాను. రాజ్ కందుకూరిగారి దగ్గర వర్క్ చేసి, చాలా విషయాలు తెలుసుకున్నా. ఎ.వి.ఎ సుబ్బారావుగారి సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తున్నా. ‘స్వయం వద’ అనేది సంస్కృతి పదం. తానే ఓ సర్వస్వం అనుకునే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
కీసర(మేడ్చల్): మేడ్చల్ జిల్లా కీసర మండలం పెద్దమ్మచెరువులో దూకి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మోర రవికాంత్ కుమారుడు ఆదిత్య(22) ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల లో సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం కళాశాలకు వెళ్లిన ఆదిత్య తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం గాలించగా మంగళవారం ఉదయం పెద్దమ్మ చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి మేడ్చల్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కుమారుడి అకాల మరణంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న రవికాంత్‌ను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఓదార్చారు. -
ఆదిత్య కళాశాలకు ‘నాక్’ గుర్తింపు
బాలాజీచెరువు (కాకినాడ) : స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలకు నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) బి ప్లస్‌ప్లస్ గుర్తింపు కల్పించినట్లు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు నాక్ బృందం డాక్టర్ బీఆర్ అనంతన్ ఆధ్వర్యంలో కళాశాలలో మూడు రోజులు పరిశీలించి, పరిశోధనలు, తరగతులు, విద్యార్థుల ఉత్తీర్ణతశాతం, క్రీడారంగ ప్రతిభ, కళాశాల పరిసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గుర్తింపు అందజేసిందన్నారు. నాక్ ప్లస్‌ప్లస్ గుర్తింపు కలిగిన ఏకైక ప్రైవేట్ కళాశాల ఆదిత్య ఒక్కటేనని విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్‌రెడ్డి పేర్కోన్నారు. నాక్ గుర్తింపు పత్రాన్ని అందుకునే కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్.సతీష్‌రెడ్డి, కళాశాల కో ఆర్డినేటర్ బీఈవీఎల్ నాయుడు పాల్గొన్నారు. -
అగ్నిమాపక శాఖ అధికారి రూ.70 వేలు లంచం
కర్నూలు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నర్సింగ్ హోం యజమాని నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి(ఏడీఎఫ్‌ఓ) రామన్న బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆదోని పట్టణానికి చెందిన డాక్టర్ బి.శ్రీనివాసులు స్థానికంగా 51 పడకలతో ఆదిత్య నర్సింగ్ హోం నిర్వహిస్తున్నాడు. వైద్యారోగ్య శాఖ నుంచి నర్సింగ్ హోంకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలంటే ముందుగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. ఇందుకు గత నెలలో కర్నూలు బీక్యాంప్‌లో ఉన్న అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాసులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, సహాయ అగ్నిమాపక శాఖాధికారి, ఆదోని ఫైర్‌ఆఫీసర్ కలిసి నర్సింగ్ హోంను తనిఖీ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు హైదరాబాద్ రీజినల్ కార్యాలయం అధికారులకు సిఫారసు చేయాల్సి ఉంది. అందుకోసం రూ.1.50 లక్షలు ఇవ్వాలని రామన్న డిమాండ్ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో డాక్టర్ శ్రీనివాసులు 1.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్ కింద గత నెలలోనే రూ.50 వేలు ముట్టజెప్పాడు. మిగిలిన డబ్బుల కోసం ఈనెల 3వ తేదీన రామన్న ఆదోనికి వెళ్లి శ్రీనివాసులుతో కలిసి డబ్బులు డిమాండ్ చేశాడు. రెండు, మూడు రోజుల్లోగా డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన శ్రీనివాసులు మంగళవారం కర్నూలులోని సీక్యాంప్ సెంటర్లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు రామన్నపై నిఘా వేశారు. డబ్బులు తీసుకుని ఎక్కడికి రమ్మంటావని డాక్టర్ చేత ఫోన్ చేయించారు. తన కార్యాలయం వద్దకు రమ్మని రామన్న సూచించగా సంభాషణను రికార్డ్ చేసి డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో సీఐలు క్రిష్ణారెడ్డి, ప్రసాదరావు, సీతారామారావు, పోలీస్ సిబ్బందితో కార్యాలయం వద్దకు చేరుకుని మాటు వేశారు. శ్రీనివాసుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా రామన్నను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోనే కెమికల్ పరీక్షల అనంతరం కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. -
షార్ట్ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేశాడు!
ప్రతిభ ఉండాలే కానీ... అవకాశాలు అవే వెదుక్కొంటూ వచ్చే కాలం ఇది. అయితే ఆ అవకాశాల కోసం వల పన్నాలి. ప్రతిభావంతుల కోసం అన్వేషించే వారిని ఆకర్షించగలగాలి. అలాంటి ఒడుపు తెలిసిన వాళ్లు చాలా సులభంగా సక్సెస్‌ను సొంతం చేసుకొంటున్నారు. ఇలా సక్సెస్ అయిన యువకుడే ఆదిత్య. 23 యేళ్ల వయసుకే బాలీవుడ్ దర్శకులే పిలిచి అవకాశాలు ఇచ్చేంత స్థాయికి చేరుకొన్నాడు. అలా అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఆదిత్య చూపిన ఒడుపు , చొరవ ఏమిటంటే... ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక.. ఇంజనీరింగ్ చదవమని చెప్పారట ఆదిత్య జెల్లా తల్లిదండ్రులు. అయితే అతడికి మాత్రం సినిమా అంటే ఆసక్తి, తనలోని సృజనాత్మకతను చాటాలనే అభిలాష ఉన్నాయి. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి మూడేళ్ల డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఆ డిగ్రీ పూర్తవ్వగానే మళ్లీ సినిమా గుర్తుకొచ్చింది. అయితే గుడ్డెద్దు చేల్లో పడినట్టు కాకుండా ముందు మెళుకువలను నేర్చుకోవాలని అనుకొన్నాడు. అందుకోసం ప్రసిద్ధ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగు నెలల కోర్సును పూర్తి చేశాడు. థియరీ అక్కడ పూర్తయ్యింది. మరి ఆ థియరీని మాత్రమే చూసి ఎవరూ అవకాశం ఇవ్వరు కదా. అందుకే ప్రాక్టికల్‌గా తనను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌పై దృష్టి సారించాడు ఈ యువకుడు. కోర్సు విషయమై అమెరికాలో ఉన్న సమయంలోనే సరదాగా ఒక షార్ట్‌ఫిల్మ్ తీసి ఇంటర్నెట్లో పెట్టాడు ఆదిత్య. ఫ్లోరిడా నుంచి మియామీ మధ్య ప్రయాణం చేస్తూ ఆ జర్నీ గురించి ఒక సరదా షార్ట్‌ఫిల్మ్ తీశాడు. ఇక్కడ కట్ చేస్తే బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్ హీరోగా రూపొందుతున్న ‘గో గోవా గాన్’ సినిమా సెట్స్‌పై తేలాడు ఆదిత్య. ‘న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సుపూర్తి చేశాను’ అని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆదిత్యకు అవకాశం కలిసివచ్చింది. ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయిన షార్ట ఫిల్మ్ ఇతనికి అవకాశాలను తెచ్చిపెట్టింది. ‘గో గోవా గాన్’ సినిమా దర్శక ద్వయం రాజ్, డీకేలు ఆదిత్యను తమ టీమ్‌లో చేర్చుకొన్నారు. సినిమా రూపకల్పనలో సృజనాత్మక సాయం చేయమని అడిగారు. ఆ విధంగా వ్యక్తిగత ఆసక్తి, అభిలాష, న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీ కోర్సు, షార్ట్ ఫిల్మ్.. ఇవన్నీ కలిసి ఆదిత్యను ఛాంపియన్‌ను చేశాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తయారైన ‘గో గోవా గాన్’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రచారం కోసం ఆదిత్య రూపొందించిన ప్రోమోలకు బాగా పేరు వచ్చింది. దీంతో ఇతడికి అవకాశాలు కలిసి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు మకాం మార్చాడు. బాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో ముంబై చేరుకొన్నాడు. తను సినిమా అవకాశాలు పొందడం తన ఇంట్లో వాళ్లను అమితాశ్చర్యపరిచిందని అంటాడు ఆదిత్య. తనకు సైఫ్ వంటి స్టార్హీరో సినిమాలో అవకాశం వచ్చిందని అంటే మొదట ఎవరూ నమ్మలేదని, తీరా తాను రూపొందించిన వీడియో ప్రోమోలు టీవీల్లో ప్రసారం అయ్యే సరికి గర్వమనిపించిందని ఆదిత్య చెప్పాడు. చాలా చిన్న వయసులోనే, తొలి సినిమాతోనే సైఫ్ వంటి హీరోతో పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఆదిత్య వివరించాడు. ఎక్కువ సినిమాలకు పనిచేయాల్సిన అవసరం లేకుండానే.. ఆదిత్య తగిన గుర్తింపు సంపాదించుకొన్నాడు. తెలుగు ‘డీ ఫర్ దోపిడి’ అనే సినిమాకు కో డెరైక్టర్‌గా కూడా పనిచేశాడు. ఆదిత్య తన అభిలాషను నెరవేర్చుకోవడాన్ని గమనిస్తే డబ్బు, తెలివి తేటలు మాత్రమే కాదు.. అవకాశాలు సంపాదించుకోవడానికి వాటిని సద్వినియోగం చేసుకొనే నేర్పు కూడా తెలిసి ఉండాలని అనిపిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు మకాం మార్చాడు. బాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో ముంబై చేరుకొన్నాడు. తను సినిమా అవకాశాలు పొందడం తన ఇంట్లో వాళ్లను అమితాశ్చర్యపరిచిందని అంటున్నాడు ఆదిత్య.