ఆదిత్య కళాశాలకు ‘నాక్’ గుర్తింపు
ఆదిత్య కళాశాలకు ‘నాక్’ గుర్తింపు
Published Sat, Sep 17 2016 10:29 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలకు నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) బి ప్లస్‌ప్లస్ గుర్తింపు కల్పించినట్లు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు నాక్ బృందం డాక్టర్ బీఆర్ అనంతన్ ఆధ్వర్యంలో కళాశాలలో మూడు రోజులు పరిశీలించి, పరిశోధనలు, తరగతులు, విద్యార్థుల ఉత్తీర్ణతశాతం, క్రీడారంగ ప్రతిభ, కళాశాల పరిసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గుర్తింపు అందజేసిందన్నారు. నాక్ ప్లస్‌ప్లస్ గుర్తింపు కలిగిన ఏకైక ప్రైవేట్ కళాశాల ఆదిత్య ఒక్కటేనని విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్‌రెడ్డి పేర్కోన్నారు. నాక్ గుర్తింపు పత్రాన్ని అందుకునే కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్.సతీష్‌రెడ్డి, కళాశాల కో ఆర్డినేటర్ బీఈవీఎల్ నాయుడు పాల్గొన్నారు.
Advertisement