
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ సీటుకు అవమానం జరిగింది. శుక్రవారం విభజన హామీల అమలుపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంలో 13 నిమిషాల పాటు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు రెస్ట్ రూములోకి వెళ్ళారు. ఆ సమయంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య స్పీకర్ స్థానాన్ని అధిష్టించి సభను నడిపించారు. ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్లచొక్కా, నల్ల ప్యాంటు వేసుకొని శాసనసభకు వచ్చారు. పూర్తిగా నల్ల దుస్తులతో స్పీకర్ స్థానంలో కూర్చోవడం పలువురిలో చర్చకు దారితీసింది.