ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ | Gundamma katha song launch | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Published Sat, Jun 13 2020 6:19 AM | Last Updated on Sat, Jun 13 2020 6:19 AM

Gundamma katha song launch - Sakshi

ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తెరకెక్కిన చిత్రం ‘గుండమ్మ కథ’. ఆదిత్య క్రియేషన్స్‌ పతాకంపై లక్ష్మీ శ్రీవాత్సవ నిర్మించిన ఈ సినిమాలోని ‘రింగ్‌ ట్రింగ్‌..’ అంటూ సాగే మొదటి పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్‌ తదితర అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.  సతీష్‌ సాధన్‌ చక్కటి పాటలు అందించారు. ‘రింగ్‌ ట్రింగ్‌..’ అంటూ సాగే ఈ పాటను వేగ్నేశ్న శ్రీ విజయ రచించగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.  లాక్‌ డౌన్‌ ముగిసిన వెంటనే మా చిత్రాన్ని విడుదల  చేస్తాం’’ అన్నారు. ‘గెటప్‌’ శ్రీను, భాష నటించిన ఈ చిత్రానికి కెమెరా: మోనీష్‌ భూపతి, దర్శకత్వం: లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణంరాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement