
అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, అర్జున్ ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీ నుంచి ‘సవదీక..’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ పాటను అరివు రాయగా, ఆంథోని దాసన్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘విడాముయర్చి’. అజిత్, త్రిషలపై వచ్చే ఈ పాట ఎనర్జిటిక్‌గా సాగుతుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: ఓం ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్.
Comments
Please login to add a commentAdd a comment