
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.
కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.
‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్‌బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్‌లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment