
‘‘నేను ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమా ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. మా చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రని ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా.. అంతకుమించి ఉంటుంది’’ అని తెలిపారు.
‘‘2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ‘కన్నప్ప’ప్రాజెక్ట్‌లోకి పంపించాడు. అదే శివ లీల’’ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. బ్రహ్మాజీ, రఘుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment