Sri Sri Ravi Shankar
-
మనసు నిన్ను తెలుసుకుందయ్యా...
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్‌బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్‌లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. -
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్
ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తన వారం రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమిరేట్స్ నాయకత్వంతో వ్యూహాత్మక సంభాషణలు సహా, వాతావరణ మార్పులపై చర్చించే కాప్ 28 సదస్సులో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొంటున్నారు. శాంతి స్థాపన, సంక్షోభ నివారణ, సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిక్షణ తదితర అంశాలలో శ్రీశ్రీ రవిశంకర్ గణనీయమైన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. పర్యటనలో భాగంగా శ్రీశ్రీ మొదటగా ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడైన గౌ. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీతో అతని రాజ నివాసంలో సమావేశమై, ధర్మబద్ధమైన మానవ విలువల్ని పెంపొందించటం, శాంతియుత సహజీవనపు ఆవశ్యకత సహా విస్తృతమైన అంశాలపై చర్చించారు. భారతదేశంలోని 70 నదులు ఉపనదుల పునరుద్ధరణ, పునరుజ్జీవనానికి, 36 దేశాల్లో 8 కోట్ల 12 లక్షల చెట్లను నాటేందుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, అలాగే 22 లక్షల రైతులను స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేసిన వ్యక్తిగా, గురుదేవ్ తన అభిప్రాయాలను కాప్ 28 సమావేశాలలో పంచుకోనున్నారు. ధార్మిక విశ్వాసాలను పాటించే సమాజాలను భూ పరిరక్షణకు ఎలా సమీకరించాలనే అంశంపై శ్రీశ్రీ ప్రసంగించనున్నారు. బ్రహ్మ కుమారీస్కు చెందిన మోరీన్ గుడ్మాన్ వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్‌కు చెందిన యుకికో యమదా మోరోవిక్ వంటి ఇతర ధార్మిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేగాక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యావరణ హితమైన సుస్థిరమైన జీవనశైలిని పెంపొందించేందుకు మానవ కార్యకలాపాలకు పర్యావరణానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు మొదటగా మనలో రావలసిన అంతర్గత పరివర్తన యొక్క ప్రాముఖ్యతను, అంతర్గత పరివర్తనకు మార్గాలను శ్రీశ్రీ వివరిస్తారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ఎమిరేట్స్ దేశపు సహన, పరస్పర సహజీవన శాఖా మంత్రి గౌ. షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, ఇతర ప్రముఖులతో కలసి గురుదేవ్ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. కాప్28 పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయబడ్డ అనేక కార్యక్రమాలలో భాగంగా, గురుదేవ్ డిసెంబర్ 6న కొలంబియన్ పెవిలియన్‌లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. కొలంబియా ప్రభుత్వం, ఫార్క్ వేర్పాటువాదుల మధ్య 52 సంవత్సరాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలికేందుకు, దౌత్యం, చర్చల ద్వారా ఏకాభిప్రాయ నిర్మాణానికి 2015 సంవత్సరంలో జరిపిన చర్చలను, వాటి ఫలితాన్ని, సభ్యులతో శ్రీశ్రీ పంచుకోనున్నారు. మానవత్వానికి, ప్రేమకు, ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమిచ్చే గురుదేవ్ విధానాలు సంఘర్షణలతో అతలాకుతలమౌతున్న ప్రజలకు ఆశారేఖలుగా దారిచూపుతాయనడంలో సందేహం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం కావాలంటే మొదటగా వ్యక్తిగతమైన ప్రశాంతత కావాలని గురుదేవ్ అంటారు. అందుకు అనుగుణంగా ఈ ఆరు రోజల అరబ్బుదేశాల పర్యటనలో చివరగా గురుదేవ్ దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ - అల్ మక్టూమ్ స్టేడియంలో 15 వేల మందికి పైగా ప్రజలతో ధ్యానం చేయించనున్నారు. అరబ్బు దేశాలలో అభివృద్ధికి కృషిచేసిన వ్యాపారవేత్తలను, సంఘ సేవకులను, సన్మానిస్తున్న ఈ కార్యక్రమానికి రిజర్వు చేసిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. (చదవండి: ప్రధాని జస్టిన్ ట్రూడో కఠిన నిర్ణయం.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!) -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (ఫోటోలు)
-
USA : ఘనంగా జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
వాషింగ్టన్ డి.సి. లోని నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాము. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాలనుండి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డి.సి. నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్, మార్సెలో శాంచెజ్ సోరోండో మొదలైనవారు ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో 1000 మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. -
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
అమెరికాలో ఇకపై ప్రతి ఏడాది రవిశంకర్ గౌరవ దినోత్సవం..
శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్న 27 నగరాల సరసన ఇపుడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అలెఘెనీ కౌంటీ కూడా చేరింది.నగర ప్రాంతంలో హింస, నేరాలను తగ్గించి, వివిధ వర్గాల ప్రజలను స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యకలాపాలవైపు మళ్లించి వారిని ఏకీకృతం చేసేందుకు చేపట్టిన చర్యలను గుర్తిస్తూ ప్రతి ఏటా జూన్ 22వ తేదీన శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినంగా జరుపుకోబోతున్నట్లు కౌంటీ ఎగ్జిక్యూటివ్ రిచ్ ఫిట్జ్‌గెరాల్డ్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్‌ను ప్రపంచ మానవతావాదిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా, శాంతి దూతగా’ ఆయన కొనియాడారు. శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇప్పటికే ఆయన 5 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు, 39కి పైగా ప్రపంచ దేశాల అవార్డులు, 26 గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని నేషనల్ మాల్ స్టేడియంలో ప్రపంచ శాంతి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఉత్సవాలలో అతి పెద్దదైన ‘ది వరల్డ్ కల్చ ఫెస్టివల్’ కు శ్రీశ్రీ సారధ్యం వహిస్తున్నారు. -
‘ఎలిమెంట్స్’ యాప్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ : తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్ ‘ఎలిమెంట్స్’ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గురుపౌర్ణిమ రోజు ఈ యాప్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.(చదవండి : ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు) ఆత్మనిర్భర్ భారత్‌తో పట్టణాలు, గ్రామాల మధ్య సమన్వయం పెరుగుతుందని వెంకయ్యనాయుడు అన్నాడు. మేడిన్ ఇండియాపై అన్ని ప్రాంతాల్లో చైతన్యం వచ్చిందన్నారు. దేశంలోని వనరులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
శ్రీశ్రీ రవి శంకర్ అందుకు సమర్థుడేనా?
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం–బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ప్రకటించిన ముగ్గురు మధ్యవర్తుల కమిటీలోకి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్‌ను తీసుకోవడం ఏ మేరకు సమంజసం? కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చో ఇదివరకే ఆయన తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. అవి ముస్లిం వర్గాలు ఆమోదించేలా ఉన్నాయా? అవి ఏమిటీ? వాటిని పరిగణలోకి తీసుకొనే ఇప్పుడు ఆయన్ని ముగ్గురు మధ్యవర్తుల కమిటీలోకి సుప్రీం కోర్టు తీసుకుందా? రవి శంకర్ అభిప్రాయాలు లేదా సూచనలను అమలు చేయడం వల్ల సుదీర్ఘకాలంగా నలుగుతున్న మందిర్–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? చదవండి...(‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం) 2018లో ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశ్రీ రవి శంకర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు: ‘ సుప్రీం కోర్టు తీర్పు ఎవరికి విరుద్ధంగా వెలువడినా వారు తీవ్రవాదాన్ని ఆశ్రయిస్తారు. సిరియా లాంటి పరిస్థితి లేదా అంతర్యుద్ధం తప్పదు. అందుకని ఈ సమస్యను కోర్టు వెలుపలనే పరిష్కరించుకోవాలి. దానికి కూడా సుహద్భావ చర్యగా అయోధ్యపై ముస్లింలు తమ హక్కును వదులు కోవాలి. ఎందుకంటే రాముడు సంచరించిన అయోధ్య ముస్లిలకు ఆధ్యాత్మికమైనదేమీ కాదు’ అని చెప్పారు. ఇక ఇదే విశయమై గతేడాది ఆయన ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’కు రాసిన ఓ బహిరంగ లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు. 1. కోర్టు తీర్పు ప్రకారం హిందువులకే అయోధ్య స్థలం లభించి అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే ముస్లింలు భారత చట్టంపై, న్యాయ వ్యవస్థపై పూర్తిగా విశ్వాసం కోల్పోతారు. పర్యవసానంగా ముస్లింలు, ముఖ్యంగా యువకులు హింసాకాండకు దిగుతారు. 2, బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం వివాదాస్పద స్థలాన్ని ముస్లింలకే అప్పగిస్తే దేశవ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగుతాయి. గ్రామస్థాయి నుంచి హిందువుల అందరి విశ్వాసాన్ని, మన్ననలను ముస్లింలు పూర్తిగా కోల్పోతారు. 3. టైటిల్‌పై హక్కులు కోరుతున్న ముగ్గురు పిటషనర్లకు వివాదాస్పద భూమిని పంచాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే 1992లో జరిగిన బాబీ మసీదు విధ్వంసం పునరావతం అవుతుంది. 4. కోర్టుతో సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు జారీచేసినా ముస్లిం గాయపడతారు. హింసాకాండకు పాల్పడతారు. నాలుగు సూచనల్లో ఏ సూచనను అమలు చేసిన ఇరువర్గాల మధ్య ఘర్షణలు, రక్తపాతం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకనే ఆయన మధ్యేమార్గంగా మరో సూచన చేశారు. కోర్టు వెలుపల పరిష్కారం ‘కోర్టు వెలుపలే పరిష్కారం ఒక్కటే ఉత్తమమైన మార్గంగా నాకు కనిపిస్తోంది. హిందువుల పట్ల సుహద్భావంతో ముస్లింలు ముందుకు వచ్చి ఒక ఎకరం వివాదాస్పద స్థలాన్ని బహుమానంగా ఇవ్వాలి. అందుకు బదులుగా హిందువులు అక్కడికి సమీపంలోని ఐదు ఎకరాల స్థలాన్ని బహుమానంగా ఇస్తుంది. దీని వల్ల ముస్లింలు వంద కోట్ల హిందువుల మన్ననలను అందుకోవడంతోపాటు అయోధ్య వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ముస్లిం తరాలు ప్రశాంతంగా జీవించవచ్చు’ అని రవి శంకర్ సూచించారు. ఆయన చేసిన ఈ సూచనతో పలువురు హిందూ సంస్థల నాయకులే అంగీకరించలేదు. విదేశాల నుంచి భారీ విరాళాలు అందుకున్న రవి శంకర్ ఆ విషయం నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని విశ్వహిందూ పరిషద్ నాయకులు విమర్శించారు. సంప్రతింపుల ద్వారా అయోధ్య పరిష్కారానికి గతంలోనే ప్రయత్నాలు జరగ్గా వాటిని అడ్డుకున్నదే రవి శంకర్ అంటూ అయోధ్యలోని హనుమాన్‌గఢీ ఆలయం అధిపతి మహంత్ జ్ఞాన్ దాస్ ఆరోపించారు. అన్ని వర్గాలు తమ ఈగోలను పక్కన పెట్టి సంప్రదింపుల ద్వారానే అయోధ్య సమస్యను పరిష్కరించుకోవాలంటూ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులకు ఒక్క రోజు ముందే రవి శంకర్ ట్వీట్ చేశారు. రవి శంకర్ సూచించినట్లు బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం ఒక ఎకరం కాదు. 2.77 ఎకరాల స్థలం. నాడు బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ఇరువర్గాల మధ్య రాజీ కోసం నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వివాదాస్పద స్థలానికి పక్కన దాదాపు 60 ఎకరాలను సేకరించింది. వాటిలో ఆలయంతోపాటు మ్యూజియం, యాత్రికుల వసతిశాలలు నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ స్థానంలో అయోధ్య పేరిట చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. వివాదాస్పద స్థలంలో అంగుళం కూడా వదులుకోమంటూ నాడు బీజేపీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బీజేపీ అధికారంలో ఉంది. ఇక రవి శంకర్ సూచించినట్లు ముస్లింలు వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించినట్లయితే హిందూత్వ సంస్థలు ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలోని అన్ని వివాదాస్పద స్థలాలపై దాడులు చేసే అవకాశం ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మధ్యవర్తుల కమిటీలో రవి శంకర్‌తోపాటు జస్టిస్ ఫక్కీర్ మొహమ్మద్ ఇబ్రహీం కాలిఫుల్లా, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పాంచు ఉన్నారు కనుక ఎంత మేరకు వారి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి. -
మత్తుమందులను వదిలేద్దాం : శ్రీశ్రీ రవిశంకర్
హిసార్, (చంఢీగఢ్) : చంఢీగఢ్ విశ్వవిద్యాలయ ప్రాంతం 'నేను డ్రగ్స్ తీసుకోను, ఎవరిని తీసుకోనివ్వను' అనే నినాదాలతో మారుమ్రోగింది. మత్తుమందుల రహిత భారతదేశం పేరిట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రారంభించిన కార్యక్రమంలో రెండు రోజులపాటు 60 వేల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, కోటిమంది సామాజికమాధ్యమాల ద్వారా పాల్గొని మత్తుమందులకు వ్యతిరేకంగా పని చేస్తామని ప్రతిన పూనారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు. 'మన దేశపు యువతను బలోపేతం చేయాలి. వారిని బలహీనపరిచే మత్తు మందులు వంటి వాటిని నిషేధించాలి. ఆనందం, సరదా, ప్రేమ కోసం ప్రజలు మత్తు పదార్థాల ఊబిలో పడతారు. వాటికి బదులుగా మాతో చేయి కలపండి. మిమ్మల్ని ఎప్పటికీ వీడిపోని ఆనందాన్ని, ప్రేమమత్తును మేం చూపిస్తాం. ఉన్నతంగా ఉండే మనసు మాత్రమే ప్రేమను, ఆనందాన్ని ఇవ్వగలదు' అని పేర్కొన్నారు. దేశంలో మత్తు మందుల వాడకానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపడుతున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. 'మత్తు పదార్థాల నుండి భారత దేశాన్ని విముక్తం చేసేందుకు శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన కార్యక్రమాలను మన పూర్వకంగా ప్రశంసిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజల హృదయాలలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో నేను గమనించాను. వివిధ వర్గాల ప్రజలు, చలనచిత్ర పరిశ్రమ, క్రీడాకారులు, సామాజిక మాధ్యమాలలో కోట్లాదిమంది ఈ కార్యక్రమానికి చేయూత నివ్వడం ముదావహం' అని మోదీ అన్నారు. ఇది కేవలం మానసిక- సామాజిక- ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, మత్తు మందుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం జాతి వ్యతిరేక శక్తులు, తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని గమనించాలని కోరారు. చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ సహా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ర్యాప్ గాయకుడు, గేయ రచయిత బాద్షా, హాస్య నటుడు కపిల్ శర్మ, ప్రముఖ పంజాబీ జానపద గాయకుడు గురుదాస్ మాన్, పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ పాల్గొన్నారు. రెండవరోజున హిస్సార్ లో జరిగిన కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో గురుదేవులతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ప్రముఖ నటుడు వరుణ్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రజలను మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచటం కోసం దేశంలోని పట్టణాలు, గ్రామాలలో మార్చి 10వ తేదీన వాకథాన్ నిర్వహించనున్నట్లు గురుదేవ్ శ్రీశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సంజయ్ దత్ మాట్లాడుతూ మత్తు మందుల వలన తాను ఎదుర్కొన్న మానసిక క్షోభను, తాను చేసిన యుద్ధాన్ని వివరించారు. 'నా నోటి నుండి, ముక్కు నుండి రక్తం పడేది. తిండి తినలేక పోయే వాడిని. నన్ను నేను అద్దంలో చూసుకుంటే భయపడేవాడిని. నాకు సహాయం కావాలని మా నాన్నని అర్థించాను' అని గుర్తుచేసుకున్నారు. ఆ అలవాటు నుండి బయటపడ్డ అనంతరం సైతం ఒక మత్తు మందుల వ్యాపారి తనను సంప్రదించినట్లు, ఆ క్షణం నుండే తాను జీవితంలో మరలా వాటి జోలికి పోకూడదని నిర్ణయించుకున్నట్లు సంజయ్‌దత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 12 వేల కళాశాలలోని కోటి మంది విద్యార్థులు అంతర్జాలం (వెబ్ కాస్ట్) ద్వారా జరిగిన కార్యక్రమంలో మత్తుమందులకు వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ పూనారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు బాద్షా మాట్లాడుతూ, మీ జీవితంలో ఉన్నత ఆశయాలను గుర్తుంచుకోమని కోరారు. ఆశయాలు ఉన్నతంగా ఉంటే అవి మిమ్మల్ని మత్తు మందుల వైపు పోకుండా చూస్తాయని అన్నారు. 'నేను ఎప్పుడూ వాడలేదు. కానీ నా మిత్రుడు, అతను నాకంటే బాగా పాడేవాడు. అతడు వీటి బారిన పడ్డాడు, ఇవాళ ఆతడు జీవించి లేడు. నా ఆనందాన్ని సంగీతంలో చూశాను. మీరు మీ ఆనందాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఈ దేశానికి మీరే భవిష్యత్తు' అని బాద్షా అన్నారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని కళాశాలలో స్వాట్ క్లబ్ (సోషల్ వెల్నెస్ అండ్ అవేర్నెస్ ట్రైనింగ్) పేరిట సంఘాలను నెలకొల్పి, వాటి ద్వారా మత్తుమందుల దుష్ప్రభావాలపై అవగాహన కలిగించటం, వాడకుండా నివారించే చర్యలు చేపట్టనున్నారు. డ్రగ్ ఫ్రీ ఇండియా (మత్తుమందుల రహిత భారతదేశం) సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. చలనచిత్ర పరిశ్రమ, క్రీడలు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన 90 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు. -
‘బాబ్రీ’ స్థానంలో మందిరాన్ని ఒప్పుకోం
అయోధ్య/లక్నో: బాబ్రీమసీదు–రామమందిరం వివాద పరిష్కారానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాలను ఈ కేసులో కక్షిదారైన హాజీ మహబూబ్ స్వాగతించారు. కోర్టు బయట వివాదం పరిష్కారమయితే శాంతి, సామరస్య పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అయితే బాబ్రీ మసీదు స్థానంలో మరే కట్టడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘అయోధ్య వివాదం ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా పరిష్కారమయితే మంచింది. దీనివల్ల హిందూ–ముస్లిం మతస్తుల మధ్య దీర్ఘకాల శాంతి, సామరస్యం నెలకొంటుంది. ఇందుకోసం ప్రయత్నిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్‌కు మేం సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. అయితే మసీదు ఎప్పటికీ మసీదుగానే ఉంటుంది. బాబ్రీమసీదుకు సంబంధంలేని స్థలంలో రామమందిరం కట్టుకుంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం’ అని హాజీ తెలిపారు. -
రవిశంకర్‌పై విరుచుకుపడ్డ ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌పై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్ మరో సిరియా అవుతుందని రవిశంకర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ పై కేసు నమోదు చేయాలని ఒవైసీ డిమాండ్ చేస్తున్నారు. ‘రాజ్యాంగంపై ఆయనకు(రవిశంకర్‌ను ఉద్దేశించి) గౌరవం లేదు. అలాంటప్పుడు చట్టాన్ని ఎలా నమ్ముతారు. ఆయనకు ఆయనే చట్టంగా ఫీలయిపోతున్నారు. ఆయన చెప్పిందే అందరూ వినాలని కోరుకుంటున్నారు. ఆయన మధ్యవర్తిలా అనిపించటం లేదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లకు పురిగొల్పాలని చూస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు స్పందించటం లేదు. వారికి భయమేస్తే చెప్పండి రవిశంకర్‌పై నేనే ఫిర్యాదు చేస్తా. ’ అంటూ మండిపడ్డారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే వివాదాస్పద స్థల వివాదంలో తీర్పు ఇవ్వాల్సిందిగా ఒవైసీ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నా మాటలు వక్రీకరించారు : రవిశంకర్ బరేలీ : రామ మందిర నిర్మాణం చేపట్టకపోతే భారత్ మరో సిరియాగా మారుతుందంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తగా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ‘నేను ఇచ్చింది హెచ్చరిక కాదు. ముందస్తుగా జాగ్రత్త సూచన మాత్రమే చేశాను’ అని ఆయన తెలిపారు. పరిష్కారం చూపకపోతే భారత్ లో అలాంటి పరిస్థితులు కనిపిస్తాయన్న కోణంలోనే తాను అలా మాట్లాడానని, ఆ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. -
'మందిరం కట్టకపోతే మరో సిరియాగా భారత్'
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమని, లేనిపక్షంలో భారత్ మరో సిరియాగా మారుతుందని హెచ్చరించారు. సిరియాలో జరుగుతున్న బాంబుదాడుల్లో అమాయక ప్రజలు, చిన్నారులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో భారత్‌లోనే సిరియాను చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. సిరియా నరమేధం నుంచి ముస్లింలు కొన్ని విషయాలు నేర్చుకుని, అయోధ్య వివాదంపై ఆశలు వదులుకుని వెనక్కి తగ్గడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ ఈ విషయాలు ప్రస్తావించారు. అయోధ్య అనేది ముస్లింలకు సంబంధించిన అంశం, ప్రాంతం కాదని వారు గుర్తించాలన్నారు. శ్రీరాముడిని అయోధ్యలో కాకుండా వేరే ప్రాంతంలో జన్మించేలా చేయడం అసాధ్యమని.. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాన్ని ఇస్లాం ఎప్పటికీ కోరుకోదని చెప్పారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో రామమందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని, వారు ఆ స్థలంలో మసీదు నిర్మించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు ముస్లింలు పూర్తి మద్ధతు తెలపాలని పిలుపునిచ్చారు. రామ మందిరం-బాబ్రీ మసీదు కూల్చిన ప్రాంతంలో అన్ని మతాల వారికి ఉపయోగపడే ఆసుపత్రి, లేదా ఇతరత్రా ఏదైనా నిర్మించాలని సలహా ఇచ్చారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య అంశంలో ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును అంగీకరించే పరిస్థితుల్లో లేరన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) బహిష్కృత సభ్యుడు సయ్యద్ సల్మాన్ హుస్సేన్ నద్వీని తాను ప్రలోభపెట్టలేదని వెల్లడించారు. షరియా చట్టం ప్రకారం మసీదును వేరే చోటుకి తరలించడం సాధ్యమేనని నద్వీ గతంలో ప్రకటన చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. -
‘పద్మావత్’.. చాలా బాగుంది!
-
‘పద్మావత్’.. చాలా బాగుంది!
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావత్’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి రవిశంకర్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పద్మావత్’ చిత్రం చాలా బాగుందన్నారు. దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌ల నటన అద్భుతంగా ఉందని రవిశంకర్ చెప్పారు. ఈ చిత్రంపై రాజపుత్రులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివని అన్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారంతా చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ‘పద్మావత్’ చిత్రం రాజపుత్రుల గౌరవాన్ని పెంచుతుందని, రాణీ పద్మావతి దేవి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. -
వెయ్యి స్టోర్లు.. 500 కోట్ల ఆదాయం
ముంబై: ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌కి చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ శ్రీశ్రీ తత్వ... తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆన్లైన్లో పరిమిత స్థాయిలో ఉన్న లావాదేవీలను మరింత పెంచుకునేందుకు ఆన్లైన్ రిటైల్ సంస్థ బిగ్‌బాస్కెట్‌తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ఏడాది ఆఖరుకల్లా 1,000 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ అరవింద్ వర్చస్వి తెలిపారు. ఫ్రాంచైజీ విధానంలో ప్రారంభించే ఈ స్టోర్స్ కోసం ఫ్రాంచైజీ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీశ్రీ తత్వ మార్ట్, శ్రీశ్రీ తత్వ వెల్నెస్ ప్లేస్, శ్రీశ్రీ తత్వ హోమ్ అండ్ హెల్త్ పేరిట మూడు రకాల స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అరవింద్ తెలిపారు. మార్ట్‌లో ఆహారోత్పత్తులు, హోమ్ కేర్ ఉత్పత్తులు ఉంటాయని, వెల్నెస్ ప్లేస్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులతో పాటు హెల్త్‌కేర్ నిపుణులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారాయన. ఇక, హోమ్ అండ్ హెల్త్ బ్రాండ్ స్టోర్స్‌లో రోజువారీ ఉపయోగించే అన్ని ఉత్పత్తులు, ఔషధాలతో పాటు ఆయుర్వేద వైద్యులు కూడా ఉంటారని తెలియజేశారు. కంపెనీ ప్రస్తుతం 33 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఈ ఏడాది ప్రధానంగా లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, రష్యా, తూర్పు యూరప్, మధ్యప్రాచ్య ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ తెలియజేశారు. యోగా గురు రాందేవ్ బాబాకి చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా.. పలు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
అయోధ్యలో ప్రత్యేక పూజలు చేసిన రవిశంకర్
-
హోమో సెక్సువల్ కామెంట్లు.. హీరోయిన్లు ఫైర్
సాక్షి, సినిమా : ప్రముఖ ధ్యాన గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌కు బాలీవుడ్ బ్యూటీలు సోనమ్ కపూర్, అలియా భట్లు హోమో సెక్సువాలిటీ గురించి క్లాసులు పీకుతున్నారు. సోమవారం ఢిల్లీలోని జేఎన్‌యూలో ఓ కార్యక్రమానికి హాజరైన రవిశంకర్ అక్కడ హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ఓ విద్యార్థి తనకు స్వలింగ సంపర్క సమస్య ఉందని.. దాని ద్వారా సంఘం, తన కుటుంబంతో సమస్యలు ఎదుర్కుంటున్నాని తెలిపాడు. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో రవిశంకర్ పెద్ద ఉపన్యాసమే దంచారు. అది పుట్టుకతో వచ్చే ఓ ధోరణి మాత్రమేనని.. ప్రయత్నిస్తే ఖచ్ఛితంగా మార్పు వచ్చి తీరుతుందని ఆ విద్యార్థికి సలహా ఇచ్చారు. అంతే రవిశంకర్ వ్యాఖ్యలపై పలువురు మండిపడగా.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అయితే కాస్త ఘాటు పదజాలంతోనే తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది. అది ధోరణి కాదని... ముందు హిందూయిజం, సాంప్రదాయల గురించి తెలుసుకోవాలంటూ రవిశంకర్‌కు సూచిస్తూ హిందోళ్‌సేన్‌గుప్తా, దైవదూత్మైత్ యాష్ ట్యాగ్‌లను ఫాలో కావాలంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ను నటి అలియా భట్ మళ్లీ రీట్వీట్ చేయటం విశేషం. WTF is wrong with god men, if you want to learn something about Hinduism and culture it’s better to follow @HindolSengupta & @devduttmyth — Sonam Kapoor (@sonamakapoor) November 14, 2017 Homosexuality is not a ‘tendency’ it’s something you are born as and is absolutely NORMAL. To tell someone you can change is irresponsible. — Sonam Kapoor (@sonamakapoor) November 14, 2017 -
శ్రీ శ్రీ రవిశంకర్‌కు చుక్కెదురు
సంభల్(యూపీ): అయోధ్యలో రామాలయ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతితో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ), బాబ్రీ యాక్షన్ కమిటీ కూడా సోమవారం తిరస్కరించాయి. అయోధ్య మందిర నిర్మాణం ఉద్యమంలో రవిశంకర్ ఎప్పుడూ పాల్గొనలేదని, మధ్యవర్తిత్వం వహించే అర్హత ఆయనకు లేదని వేదాంతి పేర్కొ న్నారు. మందిర నిర్మాణ విషయంలో తాము జైలుకెళ్లామని, కేసులకు వెరవకుండా ముందుకుపోతున్నామన్నారు. ఆయన ఎన్నడూ రామ మందిర ప్రాంతాన్ని సందర్శించలేదని, అలాంటి వ్యక్తిని మధ్యవర్తిగా ఎలా అంగీకరిస్తామన్నారు. ముస్లిం నాయకులు ముందుకు వచ్చి చర్చలతో అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో రామమందిరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. -
పతంజలికి పోటీగా ఆధ్యాత్మిక గురు స్టోర్స్
ముంబై : యోగా గురు రాందేవ్ బాబా పతంజలి స్టోర్లపై మరో ఆధ్యాత్మిక గురు పోటీకి వస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్, ఆయుర్వేదిక్ టూత్‌పేస్టులు, సబ్బులు విక్రయించడానికి 1,000 రిటైల్ స్టోర్లను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. భారత్‌లో హెర్బల్ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రవిశంకర్ కూడా ఆయుర్వేదిక్ ఉత్పత్తుల స్టోర్లను లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాతకమైన పౌర సత్కారం పొందిన శ్రీశ్రీ రవిశంకర్, క్లినిక్స్, ట్రీమెంట్మెంట్ సెంటర్లను కూడా లాంచ్చేయబోతున్నారు. దేశీయ కన్జ్యూమర్ ఇండస్ట్రిలో ఆధిపత్య స్థానంలో ఉన్న బహుళ జాతీయ కంపెనీలకు ఇక పతంజలి నుంచి మాత్రమేకాక, శ్రీశ్రీ రిటైల్ స్టోర్ల నుంచి గట్టిపోటీ నెలకొనబోతుంది. ప్రజలు తమ రోజువారీ జీవనంలో ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారని, ప్రస్తుతం మార్కెట్ ప్లేయర్స్ అందిస్తున్న వాటికంటే భిన్నంగా తమ బ్రాండ్ ఉత్పత్తులను ఆఫర్ చేయనున్నట్టు శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తేజ్ కట్పిటియా చెప్పారు. ''శ్రీశ్రీ తత్త్వ'' బ్రాండెడ్ స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీ మోడరన్ రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ ద్వారా హెల్త్ డ్రింక్స్, సబ్బులు, సుగంధాలు, సుగంధద్రవ్యాలును 2003 నుంచి విక్రయిస్తోంది. కానీ ప్రస్తుతం పలు ఆహార, గృహ కేటగిరీల్లో 300కు పైగా ఉత్పత్తులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ఈ ఉత్పత్తులను కూడా భారత్‌లో మూడు తయారీ యూనిట్లలో ఇన్-హౌజ్గానే ఉత్పత్తిచేస్తున్నారు. మరోవైపు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ కూడా ఆయుష్ బ్రాండులో ఆయుర్వేదిక్ పర్సనల్ కేర్ ఉత్పత్తులను రీలాంచ్ చేసింది. డాబర్ కూడా తన తొలి ఆయుర్వేదిక్ జెల్ టూత్‌పేస్ట్‌ను డాబర్ రెడ్ ప్రాంచైజ్ కింద ఆవిష్కరించింది. -
ఆధ్యాత్మికత లేకే ఆత్మహత్యలు!
రైతుల ఆత్మహత్యలపై శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్య ముంబై: దేశానికి అన్నంపెట్టే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడానికి పేదరికం ఒక్కటే కారణం కాదని, ఆధ్యాత్మిక భావాలు లోపించడమూ ఒక కారణమని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్యానించారు. కరువు కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని 512 గ్రామాల్లో పాదయాత్ర చేసిన సమయంలో రైతులతో మమేకమయ్యాక ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక భావాలతో ముందుకెళ్తున్న వారు రైతన్నల్లో ఆత్మస్థైర్యం నింపాలని కోరారు. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో ఆత్మహత్యకు పురిగొల్పే చెడు భావాలను యోగా, ప్రాణాయామంతో మటుమాయం చేయవచ్చని రవిశంకర్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వివాదంపైనా ఆయన మాట్లాడారు. ‘నిర్దిష్ట కాలపరిమితో ప్రతీ మతవిధానాల్లో సంస్కరణలొస్తాయి. ట్రిపుల్ తలాక్‌ను వెంటనే నిషేధించాలని నేను అనను. ప్రతీ ఒక్కరి మానవ, సామాజిక హక్కులు పరిరక్షించేలా ఆ మతాధికారులే ఒక పరిష్కారాన్ని వెతకాలి’ అని ఆయన అన్నారు. -
ప్రపంచానికే ఉదాహరణవుతుంది
మహిళా బిల్లుపై శ్రీశ్రీ రవిశంకర్ సాక్షి, అమరావతి: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్ అయితే అది ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారుతుందని ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ఈ బిల్లు పాసవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం ఘాట్‌వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సభనుద్దేశించి బెంగుళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ‘రాజకీయాల్లో మహిళలు’ అంశంపై మాట్లాడారు. కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్ని కచ్చితంగా చేసే నైపుణ్యం ఒక్క భారతీయ మహిళకే ఉంటుందన్నారు. రాజకీయాల్లో అయినా.. బ్యూరోక్రసీలో అయినా మహిళల్లో గొప్ప నిర్వహణా సామర్థ్యం ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత మహిళలు కొంత ముందుకెళ్లినా గ్రామాల్లో మహిళలకు ఇంకా అవకాశాలు లభించడంలేదన్నారు. ఈ వ్యత్యాసాన్ని పూరించడం కోసం గ్రామీణ మహిళలకు సహకారం అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లింగ వివక్ష లేకపోవడమే సాధికారిత: జయసుధ లింగ వివక్ష లేనప్పుడే నిజమైన సాధికారిత సాధ్యమని సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. స్త్రీపురుష సమానత్వం కావాలని అందరూ అంటారని, కానీ అది వాస్తవ రూపం దాల్చే పరిస్థితుల్ని నెలకొల్పాల్సి ఉందన్నారు. ‘రాజకీయాల్లో మహిళలు’ అంశంపై ఆమె మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు, కట్టుబాట్లు పురుషుడికి మహిళలను బానిసగా మార్చాయన్నారు. చట్ట సభల్లో మహిళలు సభ్యులుగా ఉన్నా.. వారి భర్తల జోక్యం ఎక్కువగా ఉంటోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 12 శాతం మంది మహిళలే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, భారత్ కంటే సౌదీ అరేబియా వంటి దేశాల్లోనే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని తెలిపారు. నిర్ణయాధికారం పొందాలి మహిళలు అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు నిర్ణ యాధికారాలు పొందాలి. ప్రపంచంలో సామాజిక సమానత్వం, లింగ వివక్ష ఎక్కువగా ఉంది. మా దేశంలో మహిళల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. – జోయెసె లబొసె, కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ‘స్థానిక’ మహిళా ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఏదీ? మహిళలు గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు గా ఎన్నికైన చోట ఆయా మహిళా ప్రజాప్రతినిధి భర్తలే అ«ధికా రాలు చెలాయిస్తున్నారు. మహిళా ప్రజా ప్రతినిధులకు భర్తలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారి పూర్తి సామర్థ్యంతో పనిచేయగల రు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. – పరిటాల సునీత, ఏపీ మంత్రి ప్రతి తల్లి తమ కొడుకులను స్త్రీ వాదులుగా తీర్చిదిద్దాలి మహిళా సాధికారిత సాధనలో మొదటి మెట్టుగా ప్రతి తల్లి తమ కొడుకులను స్త్రీవాదులుగా తీర్చిదిద్దాలి. హక్కుల సాధన కోసం జరుగుతున్న ఇలాంటి వేదికలపై వక్తలు ఏం చేయాలన్న దానిపై ప్రసంగాలకు పరిమితం కాకుండా చేసింది చెప్పుకునే పరిస్థితి ఉంటే విజయాలు మనముందే ఉంటాయి. – వినీషా నీరో, కర్టాటక నామినేటెడ్ ఎమ్మెల్యే ముందు మనిషిగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరికీ తాను స్త్రీ లేదా పురుషుడు అనే స్పృహ కలిగే ముందు మొదట తాను మనిషి అన్న విషయం గుర్తెరిగి వ్యవహ రించాలి. వ్యక్తి ప్రవర్తన వల్లే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. మరణించిన తర్వాత కూడా తన ప్రవర్తన గురించి ఇతరులు ఉన్నతంగా చెప్పుకోవాలన్న తపన మనిషిని సన్మామార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది. – మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ 90 శాతం విద్యార్థినులకు రక్తహీనత రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థినుల్లో 90 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించాను. విజయనగరం జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 130 మంది విద్యార్థినుల రక్తాన్ని పరీక్షిస్తే అందులో 10 మందే రక్తదానం చేయడానికి అర్హులుగా తేలారు. ఆడపిల్ల యుక్త వయస్సులోనే రక్తహీనతతో బాధపడే పరిస్థితి ఉంటే పెళ్లయ్యాక బిడ్డని ఆరోగ్యకరంగా ఎలా కనగలదు! – మృణాళిని, ఏపీ మంత్రి ప్రసవ వేదనకన్నా కష్టం ఏముంటుంది..! ప్రసవ సమయంలో మహిళ అనుభవించే బాధ కన్నా ప్రపంచంలో పెద్ద కష్టం ఏదీ ఉండదు. మహిళలు పెద్ద పెద్ద కలల సాధనలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ఆడపిల్ల పెద్ద కలలు కని... సవాళ్లను అధిగమించి వాటిని సాకారం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. – సలోని సాధన, యువ ఐఏఎస్ అధికారిణి మహిళా బిల్లు ఆమోదానికి ఏకతాటిపైకి రావాలి జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం రెండు దశాబ్దాలుగా నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మహిళా బిల్లును ఆమోదించేలా ఏకతాటిపైకి రావాలి. పనిచేసే ప్రాంతాల్లో వేధింపులు మహిళలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతున్నాయి. వేదకాలంలో భారతీయ సమాజం మహిళలకు సమున్నత స్థానం కల్పించింది. కానీ మహిళలను ఇంటికి పరిమితం చేసే వివక్షాపూరిత సంప్రదాయం మధ్యయుగాల్లోనే మొదలైంది. – రాజ్‌కుమారీ భట్, రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే సదస్సులో బాబు భజనలు మహిళా పార్లమెంట్ సదస్సులో రాష్ట్ర మహిళా మంత్రులు, అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తమకు అవకాశం కలిగించడం వల్లే తాము ఉన్నత స్థాయికి ఎదగామంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి పరిటాల సునీత, కిమిడి మృణాళిని, పీతల సుజాత, టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగా తాము ఎమ్మెల్యే, మంత్రులు కాగలిగామంటూ కీర్తించారు. స్త్రీత్వాన్ని గౌరవిస్తేనే దేశం పురోభివృద్ధి ప్రముఖ నర్తకి సోనాల్ మాన్సింగ్ స్త్రీత్వాన్ని గౌరవిం చినప్పుడే సమాజం, దేశం పురోభివృద్ధి సాధించగలుగుతాయని ప్రముఖ నర్తకి సోనాల్ మాన్సింగ్ పేర్కొన్నారు. విజయ వాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ముగింపు సమావేశంలో ఆమె ప్రసంగించారు. ‘దేశంలోని నగరాల్లో ప్రధాన రోడ్లకు ప్రముఖ నేతల పేర్లు పెట్ట డంతోపాటు ముఖ్య కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటాం. కానీ ఢిల్లీ సహా దేశంలోని ఏ నగరంలోనూ రోడ్లకు మహిళా ప్రముఖుల పేర్లు.. విగ్రహాలూ ఏర్పాటు చేయడమే లేదు. కస్తూరీబాయి గాంధీ, సావి త్రిబాయి పూలే, సరోజినీనాయుడు తదితర మహిళా ప్రముఖులకు తగిన గుర్తింపే లభించడం లేదు’ అన్నా రు. మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లోని ప్రతిబంధకాలు, రాజకీ యాలను ఎదురొడ్డి విజయం సాధించే స్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అందుకు తాము ఎంచుకున్న రంగంపట్ల అవ్యాజ్య మైన ప్రేమ ఉండాలన్నారు. ‘నేను ఓ గవర్నర్ మనుమరాలిని. నాట్యంలో రాణిం చాలని భావించాను. అందుకోసం 1963లో ముంబైలోని మా ఇంటిని విడిచిపెట్టి బెంగ ళూరు వచ్చేశాను. నేను ఎంచుకున్న రంగం లో ఎదురైన అన్ని ప్రతిబంధకాలను విజయ వంతంగా ఛేదిస్తూ ప్రయాణం సాగించడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోగలిగాను’ అని సోనాల్ పేర్కొన్నారు. -
జల్లికట్టును సమర్ధించిన రవిశంకర్
-
పెద్ద నోట్ల రద్దు చాలా బిగ్ స్టెప్
-
తెలంగాణలో ఆత్మహత్యలు ఆగిపోవాలి
ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ హన్మకొండ అర్బన్: ‘తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటికి సరైన కారణాలు లేవు. మనుషుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంవల్లే ఆత్మహత్యల నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. ఆత్మహత్యలు ఆపేందుకు మనం పని చేద్దాం. ఆ పని వరంగల్ నుంచే ప్రారంభి ద్దాం’ అని ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ పిలుపుని చ్చారు. ఆధ్యాత్మికం, ధ్యానం ద్వారా మాత్ర మే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, ప్రభుత్వం స్థలం కేటాయిస్తే నగరంలో నాలు గు ధ్యాన కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదివారం హన్మకొండలో ‘గానం-ధ్యానం- జ్ఞానం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిం చారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు వరంగల్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నటు తెలిపారు. తెలంగాణ వ్యవసాయం ఆదర్శం.. తెలంగాణ వ్యవసాయ పద్ధతులు దేశానికే ఆదర్శమని రవిశంకర్ అన్నారు. రైతాంగానికి టెక్నాలజీ అందిస్తే మరింత ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. ఉదయం నగరంలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో రవిశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అనేక స్ఫూర్తిదాయకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ప్రశంసించారు.