
సంభల్(యూపీ): అయోధ్యలో రామాలయ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతితో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ), బాబ్రీ యాక్షన్ కమిటీ కూడా సోమవారం తిరస్కరించాయి. అయోధ్య మందిర నిర్మాణం ఉద్యమంలో రవిశంకర్ ఎప్పుడూ పాల్గొనలేదని, మధ్యవర్తిత్వం వహించే అర్హత ఆయనకు లేదని వేదాంతి పేర్కొ న్నారు.
మందిర నిర్మాణ విషయంలో తాము జైలుకెళ్లామని, కేసులకు వెరవకుండా ముందుకుపోతున్నామన్నారు. ఆయన ఎన్నడూ రామ మందిర ప్రాంతాన్ని సందర్శించలేదని, అలాంటి వ్యక్తిని మధ్యవర్తిగా ఎలా అంగీకరిస్తామన్నారు. ముస్లిం నాయకులు ముందుకు వచ్చి చర్చలతో అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో రామమందిరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment