
శాంతికి బదులుగా తలతెగిన ఫొటో
శ్రీశ్రీ రవిశంకర్‌కు ఐసిస్ సమాధానం
అగర్తాల: శాంతి చర్చల కోసం ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పంపిన సందేశానికి.. ఐసిస్ ఉగ్రవాద సంస్థ జుగుప్సాకరసమాధానమిచ్చింది. ఐసిస్‌కు శ్రీశ్రీ రవిశంకర్ శాంతిసందేశాన్ని పంపించారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ఈ సందేశంలో పేర్కొన్నారు. దీనికి ఐసిస్ ఘాటైన బదులిచ్చింది. తల నరికిన వ్యక్తి ఫొటోను రిప్లేగా పంపించింది. ఈ విషయాన్ని రవిశంకర్ గురువారం వెల్లడించారు.
‘ప్రపంచంలోని అన్ని సంస్కృతులు, మతాలు, ఆలోచనలను కలుపుకుని శాంతి పూర్వక వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసమే ఐసిస్‌తో మట్లాడాలనుకున్నాను. కానీ వారు (ఐసిస్) శాంతి కోరుకోవటం లేదు. వారికి మిలటరీతోనే సమాధానం చెప్పాలి’ అని అన్నారు.