సాక్షి, సినిమా : ప్రముఖ ధ్యాన గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌కు బాలీవుడ్ బ్యూటీలు సోనమ్ కపూర్, అలియా భట్‌లు హోమో సెక్సువాలిటీ గురించి క్లాసులు పీకుతున్నారు.
సోమవారం ఢిల్లీలోని జేఎన్‌యూలో ఓ కార్యక్రమానికి హాజరైన రవిశంకర్ అక్కడ హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ఓ విద్యార్థి తనకు స్వలింగ సంపర్క సమస్య ఉందని.. దాని ద్వారా సంఘం, తన కుటుంబంతో సమస్యలు ఎదుర్కుంటున్నాని తెలిపాడు. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో రవిశంకర్ పెద్ద ఉపన్యాసమే దంచారు. అది పుట్టుకతో వచ్చే ఓ ధోరణి మాత్రమేనని.. ప్రయత్నిస్తే ఖచ్ఛితంగా మార్పు వచ్చి తీరుతుందని ఆ విద్యార్థికి సలహా ఇచ్చారు.
అంతే రవిశంకర్ వ్యాఖ్యలపై పలువురు మండిపడగా.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అయితే కాస్త ఘాటు పదజాలంతోనే తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసింది. అది ధోరణి కాదని... ముందు హిందూయిజం, సాంప్రదాయల గురించి తెలుసుకోవాలంటూ రవిశంకర్‌కు సూచిస్తూ హిందోళ్‌సేన్‌గుప్తా, దైవదూత్‌మైత్ యాష్ ట్యాగ్‌లను ఫాలో కావాలంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ను నటి అలియా భట్ మళ్లీ రీట్వీట్ చేయటం విశేషం.
WTF is wrong with god men, if you want to learn something about Hinduism and culture it’s better to follow @HindolSengupta & @devduttmyth
— Sonam Kapoor (@sonamakapoor) November 14, 2017
Homosexuality is not a ‘tendency’ it’s something you are born as and is absolutely NORMAL. To tell someone you can change is irresponsible.
— Sonam Kapoor (@sonamakapoor) November 14, 2017
Comments
Please login to add a commentAdd a comment