తెలంగాణలో ఆత్మహత్యలు ఆగిపోవాలి
ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్
హన్మకొండ అర్బన్: ‘తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటికి సరైన కారణాలు లేవు. మనుషుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంవల్లే ఆత్మహత్యల నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. ఆత్మహత్యలు ఆపేందుకు మనం పని చేద్దాం. ఆ పని వరంగల్ నుంచే ప్రారంభి ద్దాం’ అని ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ పిలుపుని చ్చారు. ఆధ్యాత్మికం, ధ్యానం ద్వారా మాత్ర మే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, ప్రభుత్వం స్థలం కేటాయిస్తే నగరంలో నాలు గు ధ్యాన కేంద్రాలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదివారం హన్మకొండలో ‘గానం-ధ్యానం- జ్ఞానం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిం చారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు వరంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నటు తెలిపారు.
తెలంగాణ వ్యవసాయం ఆదర్శం..
తెలంగాణ వ్యవసాయ పద్ధతులు దేశానికే ఆదర్శమని రవిశంకర్ అన్నారు. రైతాంగానికి టెక్నాలజీ అందిస్తే మరింత ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. ఉదయం నగరంలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో రవిశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అనేక స్ఫూర్తిదాయకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ప్రశంసించారు.