మల్హర్: వ్యవసాయా నికి చేసిన అప్పులు తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుపల్లి గ్రామానికి చెందిన పోటు రమేష్ రెడ్డి (35) అనే రైతు ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సాగుకు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు.
సరైన దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి పాప, బాబు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment