bhupalpally district
-
గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, సాక్షి: ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్అండ్బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు
సాక్షి, భూపాలపల్లి: కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. చదవండి: కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్ ఎందుకు లేదు: రాహుల్ ఫైర్ -
భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
డబల్ బెడ్ రూమ్ ఇల్లు మొత్తం డొల్లే...!
-
కోతుల కోసం కుక్క పులి వేషం వేసింది!
పలిమెల: జయశంకర్భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగ్గూడెంలో ఓ కుక్క పులి వేషం వేసింది! అదిప్పుడు వైరల్‌గా మారింది. గ్రామానికి చెందిన ఓ రైతు పంట చేనులో కోతుల బెడదను తప్పించుకోవడానికి మార్గం ఆలోచించాడు. శునకం శరీరంపై నలుపు రంగుతో పులి చారలు గీసి చేనులో కాపలా పెట్టాడు. పంట చేను వద్ద పులిని తలపిస్తున్న శునకాన్ని చూసి భయపడిన కోతులు పంట చేనులోకి రావడం లేదని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
పరిహారం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్‌కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్‌హౌస్‌లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్‌హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు. ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. -
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్.. మాజీ స్పీకర్ VS సిట్టింగ్ ఎమ్మెల్యే
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్‌కు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి? 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. బర్త్‌డే పాలిట్రిక్స్? మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది. -
తొమ్మిదేళ్ల తర్వాత నామకరణం
సాక్షి, హైదరాబాద్/భూపాలపల్లి రూరల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోనే తమ బిడ్డకు పేరుపెట్టించాలనుకున్న ఆ తల్లిదండ్రుల సంకల్పం నెరవేరింది. తొమ్మిదేళ్ల కల ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామకు చెందిన జనగాం సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి సీఎం కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం చిట్టి అనే ముద్దు పేరుతో ఐదో తరగతి చదువుతున్న ఆ బిడ్డకు ఇప్పటివరకు పేరుపెట్టకుండానే పెంచుతున్న విషయాన్ని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి తెలుసుకున్నారు. దీంతో వారిని ఆదివారం ప్రగతి భవన్‌కు తోడ్కొని వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్ అనితల బిడ్డకు..‘మహతి’అని నామకరణం చేశారు. సీఎం దంపతులు వారికి బట్టలుపెట్టి ఆతిథ్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమను ఆదరించి ఆశీర్వదించిన తీరుకు, సురేష్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ బిడ్డను ఇప్పటివరకు ఇంట్లో చిట్టి, బంధువులు కేసీఆర్ అని, కొంతమంది స్వీటీ అని పిలిచేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
కేటీకే 8వ గనిలో ప్రమాదం నలుగురు కార్మికులకు గాయాలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం కోల్ కట్టింగ్‌లో భాగంగా బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులు, అధికారుల కథనం ప్రకారం.. గనిలోని 3వ సీమ్ 21వ లెవల్లో ఉదయం మొదటి షిఫ్ట్‌లో కోల్‌కట్టింగ్ కార్మికులు సీహెచ్ రామకృష్ణ, బండి రాజశేఖర్, ఈర్ల శ్రీనివాస్‌తోపాటు భూక్య గంగ్య అనే యాక్టింట్ కోల్ కట్టర్.. బొగ్గును తొలిచేందుకు పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేశారు. రెండోసారి కూడా బ్లాస్టింగ్ చేసేందుకు డ్రిల్స్ చేస్తున్నారు. ముందు పెట్టిన పేలుడు మందు ఒక చోట పేలకుండా ఉండిపోయింది. దీనిని గమనించకుండా డ్రిల్స్ చేస్తుండగా ఆ పేలుడు పదార్థానికి డ్రిల్లింగ్ మెషీన్ బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో రామకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్‌లకు తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ గంగ్య భయంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆ నలుగురిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
పలిమెల.. విలవిల, మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో బంధం కట్
భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఐదురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలురోడ్లు, బ్రిడ్జీలు కోతకు గురవడంతో రవాణా సౌకర్యం స్తంభించింది. ఏడు 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులుగా మండలానికి వెలుపల ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది. మండలంలో 8 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం జనాభా సుమారు 7,500 ఉంటుంది. ఈ మండలానికి మూడు వైపుల ఉన్న దారులు స్తంభించాయి. మండల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఎక్కువగా మహదేవ్పూర్ మీదుగా జిల్లాకేంద్రానికి వస్తుంటారు. శనివారంరాత్రి ఆ దారిలోని పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో మధ్యలోని బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. పక్కనే పొలాల్లో ఉన్న ఏడు 33 కేవీ కరెంటు లైన్ స్తంభాలు కూలిపోయాయి. గర్భిణి రజితను వాగు దాటించి తీసుకొస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం దీంతో ఆ మండలం మొత్తానికి శనివారంరాత్రి నుంచి రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. తాగు, వంట, ఇతర అవసరాలకు వర్షపు నీరే దిక్కు అయింది. మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పలువురు యువకులు ట్రాలీలు, కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలతో సెల్ఫోన్లు చార్జింగ్ చేసుకొని అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మండల ప్రజల దయనీయ పరిస్థితి తెలుసుకొని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. గర్భిణులతోపాటు పాలు, కూరగాయల వ్యాపారులను వాగు దాటిస్తూ ఆపత్కాలంలో సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది పలుచోట్ల వాగులు దాటుకుంటూ వచ్చి నలుగురు గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించి ప్రసవాలు చేశారు. పలిమెల, పంకేన గ్రామాలకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. మండల కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ట్రాక్టర్ బ్యాటరీతో సెల్ చార్జింగ్ పలిమెల: విద్యుత్ సరఫరా లేక ఫోన్ చార్జింగ్కు ఇబ్బంది ఏర్పడటంతో ఒక రైతు వినూత్నంగా ట్రాక్టర్ బ్యాటరీతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఫోన్లు మూగబోయాయి. దీంతో మండల కేంద్రంలో వంగల శివ అనే రైతు సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ట్రాక్టర్ బ్యాటరీ సహాయంతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. దానికి స్విచ్ బోర్డు కనెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులతోపాటు సమీప గ్రామాల ప్రజలు ట్రాక్టర్ నడిచేందుకు డీజిల్ తెచ్చి శివకు అందిస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచుతూ ఫోన్లు చార్జింగ్ చేసుకుంటున్నారు. (క్లిక్: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు) -
ఇంట్లోనే ప్రసవం
పలిమెల: వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించి.. రోడ్డు తెగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేని ఒక గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన గర్భిణి తోలెం నాగేశ్వరికి సోమవారం తెల్లవారుజామున నొప్పులు మొదలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చాలంటే మండల కేంద్రం నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం, మహాముత్తారం మీదుగా భూపాలపల్లి, మహాదేవ్‌పూర్ తీసుకెళ్లాలి. కానీ వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో ఎక్కడికి వెళ్లలేక ఆమె నరకయాతన అనుభవిస్తూ కారు చీకట్లో ఇంట్లోనే ప్రసవించింది. కాగా.. సోమవారం ఉదయం బాలింతను ఆస్పత్రికి తరలించేందుకు పెద్దంపేట వాగు వద్దకు తీసుకుపోయారు. అక్కడి నుంచి బాలింత వాగు దాటలేకపోవడంతో అంబటిపల్లి పీహెచ్సీ వైద్యులకు సమాచారం అందించారు. వాగు వద్దకు వైద్య బృందం చేరుకుని ఆమెకు పరీక్షలు నిర్వహించి.. పంకెనలోని సబ్సెంటర్కు తరలించి వైద్య సేవలు అందించారు. -
కేటీపీపీలో మరోసారి అగ్నిప్రమాదం
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో బుధవారం రాత్రి మరో సారి అగ్ని ప్రమాదం సంభవించింది. జెన్కో స్టేజ్–2లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం లోని ఓవర్ ఫ్లో పంపు మోటార్ నుంచి మంట లు చెలరేగాయి. అధిక వేడిమి కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. మంటలు చెలరేగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. కొద్ది రోజుల క్రితం ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందగా, ఏడుగురు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. నిలిచిన విద్యుదుత్పత్తి కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రధాన ప్లాంట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. -
కేటీపీపీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృతి
భూపాలపల్లి జిల్లా/హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతుడు వీరస్వామి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ. వీరస్వామికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వీరస్వామి మృతిచెందడంతో కేటీపీసీలో విషాదం అలుముకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ కార్మికుడు సీతారాములు చికిత్స పొందుతున్నారు. హనుమకొండ అజార ఆస్పత్రిలో మరో నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. సీఈ సిద్దయ్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకునే పనిలో జెన్కో అధికారులు ఉన్నారు. చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో పది మందికిపైగా భక్తుల దుర్మరణం -
కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం రాత్రి భారీ ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో ఏడు గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాకతీయ థర్మల్ విద్యుత్ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని కోల్ మిల్లర్‌లో ఇనుప రాడ్డు రావడంతో కార్మికులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డోర్‌ను తెరవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి కార్మికులకు అంటుకున్నాయి. ప్రమాదంలో జేపీఏ వెంకటేష్, ఆర్జిజన్ కేశమల్ల వీరస్వామితోపాటు బ్రదర్స్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు సీతారాములు, జానకిరాములు, సాయికుమార్, రాజు, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేటీపీపీ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అందులో ఆర్జిజన్ వీరస్వామి, జేపీఏ వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో, ఏడుగురిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. మిల్లర్‌లోకి ఇనుపరాడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఆస్తినష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన కార్మికుల్లో ఐదుగురు విజయవాడనుంచి సోమవారమే కేటీపీపీకి వచ్చినట్లు తెలిసింది. కేటీపీపీ పవర్‌ప్లాంట్‌లో మొదటిసారి ప్రమాదం జరగడంతో ఇంజనీర్లు, కార్మికులు షాక్‌కు గురయ్యారు. -
ముగిసిన ‘పుష్కరం’.. భక్తజన పునీతం
కౌటాల(సిర్పూర్)/కోటపల్లి(చెన్నూర్)/కాళేశ్వరం: ప్రాణహిత నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈనెల 13న ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లితోపాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ పుష్కరఘాట్లలో ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు. అలాగే కాళేశ్వరాలయాన్ని 10 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల రూపేణా రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పన్నెండు రోజులు పన్నెండు హారతులిచ్చారు. ఆదివారం తుమ్మిడిహెట్టి వద్ద 108 యజ్ఞకుండాతో శివసంకల్ప మహాయజ్ఞం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన వేదపండితులు నదికి ముగింపు హారతినిచ్చారు. -
‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన
సాక్షి, వరంగల్: మీకు పెన్ ఉంటే మాకు గన్ ఉంది.. ఈయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియాలి.. అంటూ ఓ సీఐ కాళేశ్వరం వద్ద పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద అధికారిని పుష్కరాల విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన ఓ టీవీ చానల్ రిపోర్టర్ పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల పూజలను వీడియో తీశాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మొగిలి సదరు జర్నలిస్టును అడ్డుకొని వీడియో తీయొద్దంటూ ఆలయం ఎదుట ఉన్న సీఐ జానీ నర్సింహులు వద్దకు తీసుకొచ్చాడు. ఆలయంలో వీడియో తీయడానికి అనుమతి లేదంటూనే జర్నలిస్టు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను సీఐ బలవంతంగా లాక్కున్నాడు. తాను స్థానిక రిపోర్టర్నని మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులంటే ఏమనుకుంటున్నావు.. మీ దగ్గర పెన్ ఉంటే.. మా దగ్గర గన్ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు జర్నలిస్టులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఉన్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫోన్ ద్వారా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే వివాదానికి తెరలేపిన సీఐ జానీ నర్సింహులు అక్కడికి చేరుకొని ఇగో అన్న.. నా ఫిర్యాదు.. జరిగిందంతా ఇందులో రాసిన.. వాళ్ల మీద ఎఫ్ఐఆర్ చెయ్ అన్నాడు. ఇందుకు డీఎస్పీ బదులిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాను.. కొద్దిసేపట్లో సార్ నిర్ణయం తీసుకుంటారు.. మీరు ఏదైనా చెప్పాలనుంకుంటే ఎస్పీ సంప్రదించండి అని వెల్లడించాడు. చదవండి: మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్! అయినప్పటికీ వినకుండా సీఐ కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి ఫిర్యాదు అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ సురేందర్‌రెడ్డి పుష్కర విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు, ఎస్సై మొగిలిని తొలగించినట్లు అనధికారిక సమాచారం. ఇదిలా ఉండగా సీఐ జానీ నర్సింహులు తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవా లని టీయూడబ్ల్యూజే(హెచ్143) రాష్ట్ర నాయకుడు తడక రాజ్నారాయణగౌడ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు సామంతుల శ్యాం, క్యాతం సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. చదవండి: రంజాన్ మాసంలో.. ఇది తప్పనిసరి! ఫుల్ డిమాండ్ -
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది. -
ముగ్గురు రైతులను మింగిన అప్పులు
గార్ల/భూపాలపల్లి రూరల్/నార్నూర్: పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు చివరికి ఆ రైతులనే కబళించాయి. పంటల దిగుబడి ఆశించిన మేర రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక మహబూబాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం పంచాయతీ వేదనాయక పురం గ్రామానికి చెందిన కుడితెట్టి ఉపేందర్(32) ఎకరంలో మిర్చితోట సాగు చేశాడు. రూ.1.50 లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. పూత కాత రాక మిర్చి పంట ఎండిపోయింది. సోమవారం ఉదయం తోటకు వెళ్లి కంటనీరు పెట్టుకొని అప్పులెలా తీర్చాలని మధనపడుతుండగా ఉపేందర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు గార్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు న్నారు. జయశంకర్ భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధిలోని కాసింపల్లికి చెందిన ఎల కంటి ఈశ్వరయ్య (45) తనకున్న మూడెక రాలలో మిర్చి సాగు చేశాడు. తామర పురుగు సోకడంతో దిగుబడి రాలేదు. పంటకు చేసిన రూ.4.50 లక్షలతోపాటు బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు కుప్పలవడంతో మనస్తాపానికి గురై ఆదివారంరాత్రి తోటలోకి వెళ్లి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రమేశ్(40)తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి సరిగా రాలేదు. యాసంగిలో జొన్నపంట సాగు చేయగా, ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితిలేదు. పంటల సాగు కోసం రెండేళ్లలో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. కూతురు పెళ్లికి ఎదగడం, వ్యవసాయంలో నష్టాలు రావడం, ఇప్పటికే చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో సోమవారం ఉదయం తన చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌కు భార్య బిక్కుబాయి, కొడుకు, కూతురు ఉన్నారు. -
దిగుబడి రాక దిగులుతో..
మల్హర్: వ్యవసాయా నికి చేసిన అప్పులు తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుపల్లి గ్రామానికి చెందిన పోటు రమేష్ రెడ్డి (35) అనే రైతు ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సాగుకు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. సరైన దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతునికి పాప, బాబు ఉన్నారు. -
రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం.. ప్రాణం తీసిన బైక్ దావత్
సాక్షి, వరంగల్: బైక్ దావత్.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరిగింది. స్థానిక ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని కర్కపల్లి గ్రామానికి చెందిన జట్టి సిద్ధు ఇటీవల సెకండ్‌హ్యాండ్‌లో పల్సర్–220 బైక్‌ను కొనుగోలు చేశాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు వేముల రాజ్‌కుమార్(24)కు బైక్ దావత్ ఇస్తానని సోమవారం రాత్రి గణపురం తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో టవేరా వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో వేముల రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలి పారు. సిద్ధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం బైక్ ప్రమాదంలో మృతిచెందిన రాజ్‌కుమార్‌కు రెండు క్రితమే ఓ అమ్మాయితో నిశ్చితార్థం అయింది. వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్న రాజ్‌కుమార్ ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చదవండి: లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని.. -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
భూపాలపల్లి రూరల్/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సోమవారం పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపా లపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఇద్దరు, ము లుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో ఒక మహిళ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు వరి పొలంలో కలుపుతీస్తుండగా జరిగాయి. భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్ భార్య గట్టు లక్ష్మి (40) తన వ్యవసాయ పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన పసరగొండ మంజుల (38)ని కూలికి తీసుకెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో వర్షం రావడంతో ఇద్దరు కవరు కప్పుకొని పొలం గట్టుపై కూర్చు న్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మరణించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ప రామర్శించారు. మరోఘటనలో ములుగు జిల్లా ఏటూరునా గారం మండలం శంకరాజుపల్లికి చెందిన ఆతుకూరి లాలమ్మ తన కుమార్తె రమ్య (20)తో కలిసి సోమవారం పంట పొలాల్లోకి కూలి పనికి వెళ్లింది. వీరికి సమీపంలో పిడుగు పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా రమ్య మృతి చెందింది. లాలమ్మ కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. -
ఎన్నికలకు రెండేళ్లు.. అప్పుడే కాంగ్రెస్‌లో సీటు పంచాయితీ
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట సాగుతోంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే భూపాలపల్లి స్థానం తమదంటే తమదంటూ పోటీ పడుతున్నారు. త్వరలోనే పార్టీలో చేరుతానంటూ ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లిలో పోటీ చేసేది కొండా దంపతులేనంటూ వారి అనుచరులు చెప్పుకుంటుండగా, ఇక్కడ పాగా కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుర్చీలాటతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. రేవంత్‌రెడ్డి రాకతో మారిన సమీకరణాలు.. 2009 సంవత్సరంలో భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడింది. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి గెలుపొందగా 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మరోమారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌కు ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు లేకుండాపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో కాంగ్రెస్‌లో మళ్లీ జోష్ నెలకొంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావుకు రేవంత్‌రెడ్డి మధ్య మంచి సాన్ని హిత్యం ఉంది. దీంతో రేవంత్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాక సత్యనారాయణరావు కూడా అదే పార్టీలో చేరుతాడని ప్రచారం జరిగింది. ఈ ప్రచారా నికి సత్యనారాయణరావు ఇటీవల తెరదింపారు. కొ ద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి మండలాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతానని సహకరించాలని సత్యనారాయణరావు కోరుతున్నారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను మంథని ఎ మ్మెల్యే శ్రీధర్‌బాబు ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు శ్రీనుబాబు రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. భూపాలపల్లి బరిలో ఉండటం శ్రీనుబాబుకు కూడా ఇష్టమే అని తెలు స్తోంది. అన్నదమ్ములు రెండు స్థానాల్లో పోటీ చేయ డం సబబు కాదని, శ్రీధర్‌బాబు వద్దని చెప్పినట్లు సమాచారం. మంథని చాలని, భూపాలపల్లిలో పోటీచేసే ఆలోచన లేదని చెపుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ శ్రీనుబాబు కొంత స్థబ్ధుగా ఉండగా, సత్యనారాయణరావు, కొండా వర్గీయులు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ సమయంలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసమస్యల పరి ష్కారం కోసం పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు కుర్చీల కోసం కుమ్ములాడుతుండటంతో భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఆది నుంచి మేమున్నాం అంటూ.. భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆది నుంచి కొండా సురేఖ, మురళి దంపతులు అండగా నిలిచారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొండా దంపతుల్లో ఒకరు భూపాలపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని కొండా వర్గీయులు ఇటీవల వెల్లడించారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కొండా దంపతులు పార్టీ బాధ్యతలు మోశారని పేర్కొన్నారు. పార్టీలో చేరకముందే ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి అయోమయానికి గురి చేస్తున్నారని కొండా వర్గీయులు ప్రకటించారు. -
ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్
సాక్షి, భూపాలపల్లి: కాటారం తహశీల్దార్ మేడిపల్లి సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐత హరికృష్ణకు చెందిన కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు-3 లో భూమికి ఆన్లైన్ చేసి, పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు తహశీల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటూ సునీత.. ఏసీబీ అధికారులకు చిక్కారు. -
తండ్రి, ఇద్దరు కుమారులను నరికి చంపిన ప్రత్యర్ధులు
సాక్షి, భూపాలపల్లి: ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూవివాదం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. సొంత సోదరుడు, ఆయన ఇద్దరు కుమారులను పాశవికంగా నరికి చంపారు దుండగులు. ఫ్యాక్షనిజాన్ని మరిపించేలా ఏకకాలంలో ముగ్గురిని హత్యచేసిన ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లావుడ్యా మంజనాయక్ (68), ఆయన కుమారులు సారయ్య నాయక్ (45), భాస్కర్ నాయక్ (38) హతమయ్యారు. పదేళ్లుగా గొడవలు.. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన లావుడ్యా మంజనాయక్, సమ్మయ్య నాయక్, మహంకాళి నాయక్, రజ్జానాయక్ సొంత అన్నదమ్ములు. వీరిలో మంజనాయక్ 15 ఏళ్ల క్రితం గ్రామశివారులో 20 ఎకరాల భూమి కొన్నాడు. పక్కనే కొన్ని గుంటల మిగులు భూమి ఉంటే తన భూమితో పాటే సాగు చేసుకుంటుండమే కాకుండా తన భూమితో కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇదే క్రమంలో మిగిలిన అన్నదమ్ములు ఆ భూమిలో తమకూ హక్కు ఉందని అడ్డుపడుతుండగా పదేళ్లుగా వివాదం కొనసాగుతుంది. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. శనివారం మంజనాయక్, ఆయన ముగ్గురు కుమారులు సారయ్య నాయక్, భాస్కర్ నాయక్, సమ్మయ్య నాయక్, కోడలు సునీత, మనవడు భూమి వద్దకు వెళ్లి పత్తి కట్టె ఏరుతూ దుక్కి దున్నుతున్నారు. ఇది తెలుసుకున్న మహంకాళి నాయక్, మరికొందరు కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి వెళ్లారు. తమతోపాటుగా తెచ్చుకున్న కారం పొడిని మంజనాయక్, ఆయన కుమారులపై చల్లి గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మంజనాయక్, పెద్దకుమారుడు సారయ్య, చిన్నకుమారుడు భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమారుడు సమ్మయ్య నాయక్ తలపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై తప్పించుకుని పారిపోయాడు. కోడలు సునీత చేయి విరిగింది. సుమారు పదిమంది తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. చదవండి: పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం -
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
-
ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య
కాళేశ్వరం/మహదేవపూర్: కార్తీకమాసం ఏకాదశి ఉదయం 5 గంటల తర్వాత మంచి ముహూర్తం. అప్పుడు చనిపోతే ఆత్మలైనా సంతోషంగా ఉంటాయి. తమ జీవిత చరమాంకంలో సరిగ్గా చూసుకోని కుమారుడు, కోడలికి ఇబ్బందులు రావొద్దనే భావనతో ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, తాము చనిపోయాక అంత్యక్రియల నిమిత్తం ఎవరికీ అవస్థ కలగొద్దని రూ.10 వేల నగదును భర్త తన నడుముకు కట్టుకోగా.. ఇద్దరూ కొత్త బట్టలు ధరించి పురుగుల మందు తాగారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని ఎలికేశ్వరంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులకు కుమారుడు సత్యం, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉన్న పొలాన్ని కుమారుడికి ఇచ్చి.. వారు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. తరచూ సాలయ్య దంపతులను కుమారుడు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఇరుగుపొరుగు వచ్చే సరికి రాధమ్మ మృతి చెందగా, సాలయ్య కొనఊపిరితో ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒకరిపైన ఆధారపడి బతకొద్దనే తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కామాంధుడికి జీవిత ఖైదు
భూపాలపల్లి: ఒక్కగానొక్క బిడ్డ.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బిడ్డ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకోవాలని కేక్, చాక్లెట్లు, కొత్త బట్టలు తెచ్చారు. తెల్లవారితే వేడుకలు జరగాల్సిన ఇంట్లోకి విషాదం దూసుకొచ్చింది. కామాంధుడి చేతిలో బలైన చిట్టితల్లిని చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నం టాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లిలో జరిగిన ఈ సంఘటనపై శుక్రవారం కోర్టు తీర్పు వెలువడింది. మానవ మృగానికి జీవిత ఖైదు పడింది. బర్త్‌డేకు ముందు రోజే.. గోరికొత్తపల్లికి చెందిన ఈర్ల రాజు, ప్రవళిక దంపతులకు ఒకే కుమార్తె రేష్మ(6). కూతురు స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. 2017 డిసెంబర్ 4న రేష్మ పుట్టిన రోజు కావడంతో ఓ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు ముందు రోజు కొత్త బట్టలు తెమ్మని భార్య ప్రవళికకు డబ్బులు ఇచ్చి డ్యూటీకి వెళ్లాడు. తల్లీబిడ్డలు ఉదయం పరకాలకు వెళ్లి డ్రెస్, కేక్, చాక్లెట్లు తెచ్చుకున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజు ఇంటికి వచ్చి పుట్టిన రోజు వేడుకల విషయమై మాట్లాడుకుంటున్నారు. 7.30 గంటలకు సమయంలో ఇంటి ముందు డీజీ సౌండ్ వినిపించడంతో భోజనం చేస్తున్న రేష్మ ప్లేటును తల్లి చేతికి ఇచ్చి పాటలు విని వస్తానంటూ వెళ్లింది. గంట దాటినా బిడ్డ రాకపోవడంతో ప్రవళిక బయటకు వచ్చి వెతికినా కనిపించకపోవడంతో భర్తకు చెప్పింది. బంధువులు, ఇరుగుపొరుగు వారు కలిసి గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంటకు రేగొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలు రాత్రంతా ఏడ్చుకుంటూనే ఉన్నారు. మరునాడు రాజు సోదరుడు సదయ్య గ్రామ సమీపంలోని ఓ గడ్డివామును కట్టెతో కదిలించగా అందులో రేష్మ మృతదేహం కనిపించగా వెంటనే రాజుకు తెలపడంతో వారు వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యారు. అత్యంత కిరాతకంగా.. రేష్మపై అదే గ్రామానికి చెందిన కనకం శివ అత్యంత కిరాతకంగా లైంగిక దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. డీజీ సౌండ్ విని బయటకు వచ్చిన రేష్మను కొద్దిసేపు శివ ఎత్తుకొని డాన్స్ చేసిన అనంతరం మిక్చర్ ప్యాకెట్ కొనిచ్చి గ్రామానికి అనుకొని ఉన్న పంట పొలాల వద్ద లైంగిక దాడికి పాల్పడిన తర్వాత గొంతు నులిమి చంపాడు. పాత కక్షలతోనే ఘాతుకం.. పాత కక్షలతోనే శివ ఈ ఘాతుకానికి పాల్పడిన ట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శివ అన్నయ్య సదానందం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయమై గ్రామస్తులతో పాటు రేష్మ తండ్రి రాజు కూడా మందలించాడు. దీంతో సదానందం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అన్నయ్య చావుకు రాజే కారణమని భావించిన శివ ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. రెండు రోజుల్లోనే అదుపులోకి.. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు 2 రోజుల్లోనే పట్టుకున్నారు. సంఘటన జరిగిన రోజు రాత్రి రేష్మ కోసం ఆమె తల్లితండ్రులు, గ్రామస్తులంతా కలిసి వెతుకుతుండగా శివ మాత్రం తాపీగా ఓ బెల్టుషాపులో కూర్చొని మద్యం తాగడాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులు శివను గుర్తించి సెక్షన్ 364, 302, 201, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ అధికారిగా భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 మంది సాక్షుల వాంగ్మూలం విచారించిన కోర్టు నేరము రుజువుకావడంతో నిందితుడకి శిక్ష విధిస్తూ జడ్జి జయకుమార్ తీర్పు వెల్లడించారు. -
స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం
సాక్షి, భూపాలపల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. జిల్లాలోని సమస్యలను ఆ శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జిల్లా పరిషత్‌కు స్థాయి సంఘాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అటువంటి స్థాయీసంఘాలకు నేడు సభ్యుల ఎన్నిక జరగబోతోంది. దీని కోసం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులు సమావేశం కాబోతున్నారు. దీంతో అన్ని మండలాల జెడ్పీటీసీలతో సహా, కోఆప్షన్ మెంబర్లు, జిల్లాతో సంబంధం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. స్థాయీ సంఘాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం వారం క్రితమే ప్రతీ జెడ్పీటీసీ సభ్యుడికి అధికారులు తెలియజేశారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్‌తో కలిపి మొత్తం 11 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు కోఆప్షన్ మెంబర్లతో పాటు జిల్లాకు సంబంధం ఉన్న ములుగు, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులతో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీల కూర్పు జిల్లా పరిషత్ పాలనలో కీలకమైనవి స్థాయిసంఘాలు. ప్రతీ జిల్లా పరిషత్‌లో 7 సాయీ సంఘాలు ఉంటాయి. ఇందులో 1. ఆర్థికం ప్రణాళిక , 2. పనుల స్టాండింగ్ కమిటీ, 3. గ్రామీణాభివృద్ధి , 4. విద్యా వైద్యం ఈ నాలుగు స్థాయిసంఘాలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరి స్తారు. 5. వ్యవసాయ స్టాండింగ్ కమిటీకి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తా రు. 6. మహిళా స్త్రీ శిశు సంక్షేమ కమిటీకి, 7. సాంఘిక సంక్షేమ స్థాయిసంఘానికి మహిళా జెడ్పీటీసీలు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం జిల్లాలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ మహిళలే కావడంతో జిల్లాలోని ప్రతీ స్థాయీ సంఘానికి మహిళలే అ«ధ్యక్షురాలిగా ఉండనున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్య కమిటీలకు డిమాండ్ జిల్లా పరిషత్‌లో ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నా రెండింటికి మాత్రమే ఫుల్ డిమాండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి, విద్యావైద్యానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉండేందుకే జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈరెండింటాì ఎక్కువగా సమీక్షించే అవకాశం ఉండటం కూడా డిమాండ్‌కు కారణంగా ఉంది. స్థాయీ సంఘాల ఎన్నికకు సంబధించిన నియమాలు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యుడు ఒకటి కంటే ఎ క్కువ సంఘాల్లో సభ్యుడిగా ఉండరాదు. ఏ స్థాయి సంఘం కొరకు ఎన్నిక జరుగుతుందో, ఆ స్థాయీ సంఘం పేరును, ఖాళీల సంఖ్యను ప్రకటిస్తారు. ఎన్నిక కోసం నిలబడే ప్రతి అభ్యర్థిని ఒక జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదించాలి, మరోకరు బలపరచాలి. సరైన క్రమంలో ప్రతిపాదించబడిన జెడ్పీటీసీ సభ్యుల పేర్లను ఈ సమావేశంలో చదువుతారు. ఎన్నిక జరిగేలోపు అభ్యర్థి ఏ దశలోనైన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చ. ప్రతిపాదించిన అభ్యర్థుల సంఖ్య కమిటీల్లోని స్థానాల కన్నా ఎక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక వేళ అభ్యర్థుల సంఖ్య, స్థాయి సంఘాల్లో ఉండాల్సినసభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటే నిబంధనలకు లోబడి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఎన్నికైనట్లు ప్రకటించవచ్చు. ఏదేని కారణం వల్ల స్థాయీ సంఘం ఎన్నిక జరగకపోతే తరువాత ఎన్నిక ఉంటుంది. ఉన్న సభ్యులతోనే సర్దుబాటు మొత్తం జెడ్పీ చైర్మన్‌తో సహా 19 మంది సభ్యులు 7 సాయీ సంఘాల్లో సభ్యులుగా ఉండనున్నారు. హోదారీత్యా జెడ్పీచైర్మన్ అన్ని స్థాయీ సంఘాల్లో సభ్యురాలిగా ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ సంఘాల్లో సభ్యులుగా ఉండేందుకు అవకాశం లేదు. దీంతో పాలకపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఏదో ఒక కమిటీలో చోటు దక్కనుంది. సభ్యులు తక్కువగా ఉండటంతో జెడ్పీచైర్మన్‌తో కలిపి కొన్ని స్థాయిసంఘాల్లో నలుగురు, కొన్నింటిలో ముగ్గురు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే 7 కమిటీల్లో నాలుగు కమిటీల్లో జెడ్పీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు మొత్తంగా నలుగురు సభ్యులు ఉంటే, మూడు స్థాయీ సంఘాల్లో జెడ్పీ చైర్మన్, మరో ఇద్దరు సభ్యులు మొత్తంగా ముగ్గురు సభ్యులు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వారు కాగా, నలుగురు కాంగ్రెస్, ఒక్కరు ఏఐఎఫ్బీ నుంచి ఉన్నారు. -
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్‌డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు. పచ్చడి బాగుందే అక్కా.. బాగున్నారా? అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? మీతో నాకూ కాస్త వడ్డించండి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరి నాటు కూలీలతో కలసి రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపి కూలీలతో మాట్లాడారు. మీతోపాటు నాకూ వడ్డించండి అని కూలీలతో కలసి భోజనం చేశారు. పచ్చడి బాగుందంటూ కితాబిచ్చారు. -
అరణ్యంలో.. అగ్గి
సాక్షి, భూపాల్పల్లి: వేసవి ఇలా ప్రారంభమైందో లేదో అప్పుడే అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గంగారం, తాడ్వాయి అడవుల్లో నిప్పు రగులుకుని వృక్షాలు, జీవరాసులు దగ్ధమయ్యాయి. మంటలు అలాగే కొనసాగుతున్నాయి. తాడ్వాయి నుంచి గంగారం, పస్రా నుంచి తాడ్వాయి, ఏటూరునాగారం వరకు ఉన్న అడవుల్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. పశువుల కాపరులు చుట్ట, బీడీలు కాల్చిన అగ్గిపుల్లను అడవుల్లో వేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఉడుములు, పాములు, కుందేళ్లు మంటల్లో కాలి బూడిదైనట్లు జంతు ప్రేమికులు వెల్లడించారు. అలాగే వన్య ప్రాణులైన జింకలు, దుప్పులు, మేకలు, కనుజులు, కొండముచ్చులు, తదితర జంతువులు మంటల వేడికి, పొగకు తట్టుకోలేక పరుగులు పెట్టి దాహానికి అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవిలో అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు నిప్పు నివారణకు ఫైర్ లైన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోతుంది. -
వేట ఆగేదెప్పుడు?
సాక్షి, కాళేశ్వరం: మహదేవపూర్, పలిమెల మండలాల్లో వన్యప్రాణుల వేట మళ్లీ మొదలైంది. నిత్యం అడవిలోని జీవాలను వేటాడి వేటగాళ్లు చంపుతున్నారు. అడవిని కాపాడే అధికారులే పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట కొసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. వేసవి కాలం కావడంతో అడవి జీవాలు దాహం తీర్చుకునేందుకు అడువుల్లో ఉండే నీటి గుంటల వద్దకు రావడంతో వేటగాళ్లు ఉచ్చులు వేసి పట్టుకుంటున్నారు. విద్యుత్ తీగలు అమర్చి షాక్ ఇచ్చి చంపుతున్నారు. అడవుల్లో ఉండే కుందేలు, దుప్పులు, జింకలతో పాటు అడవిపందులను వేటాడుతున్నారు. ఈ మాంసాన్ని, చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కిలో రూ. 300.. మామూలుగా మేక మాంసం కంటే అడవి జంతువుల మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వేటాడిన దుప్పి మాంసాన్ని వేటగాళ్లు మరీ చౌకగా కిలో రూ. 300ల వరకు విక్రయిస్తున్నారు. మహదేవపూర్, పలిమెల అడవి ప్రాంతాల్లో వేటాడిన జంతువుల మాంసం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, చెన్నూరు వరకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇలా నిత్యం అడవి మాంసాన్ని విక్రయిస్తు వేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వన్యప్రాణుల కనుమరుగు.. ఇలా నిత్యం వేట కొనసాగుతుంటే రాబోయే కా లంలో వన్యప్రాణలు కనుమరుగు అయ్యే పరిస్ధితి నెలకొంది. గతంలో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, సాంబార్, కుందేళ్ళు, అడవి పందులు గుంపులు గుంపులుగా దర్శనమిచ్చెది. అడవుల్లో వేటగాళ్లు చెలరేగిపోతుండడం, అడవులు పలచబడడంతో వన్యప్రాణుల మనుగడ తగ్గుతూ వస్తోంది. చుట్టపు చూపుగా.. అడవుల్లో ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికా రులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం అ డవులను పర్యవేక్షించాల్సిన అధికారులు చుట్టపు చూపుగా అడవులకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అడవులు అంతరించి పోతున్నా అటువైపు చూసిన దాఖలాలు లేవు. కలప సరిహద్దులు దాటుతున్నా, వన్యప్రాణుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం పర్యవేక్షిస్తున్నాం.. ప్రతినిత్యం అడవులతో పాటు సిబ్బందిని పర్యవేక్షిస్తున్నాం. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. ఇలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్‌రెడ్డి, ఎఫ్ఆర్వో -
గనిలో చిక్కుకున్న కార్మికుడి మృతి
సాక్షి, కోల్‌బెల్ట్: సింగరేణి యంత్రాంగం చేపట్టిన 48 గంటల ఆపరేషన్ తర్వాత గని కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ టీం సభ్యులు శుక్రవారం గుర్తించారు. సపోర్ట్‌మెన్ కార్మికుడు సత్యనారాయణ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో బుధవారం మొదటి షిఫ్టుకు హాజరయ్యాడు. గనిలోని 36వ డిప్ 3వ సీం ఎస్–7 ప్యానల్ వద్ద 11 లెవల్లో బారికేడ్ వద్ద విధులు నిర్వర్తిసుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో బారికేడ్‌కు రంధ్రం ఏర్పడిందని తెలియడంతో అక్కడికి వెళ్లాడు. అవుట్ మస్టర్ పడకపోవటంతో.. మధ్యాహ్నం విధుల ముగించుకున్న తర్వాత సత్యనారాయణ అవుట్ మస్టరు పడక పోవటంతో అనుమానం వచ్చిన అధికారులు ఆయన ఆచూకీ కోసం గనిలో ఆపరేషన్ చేపట్టారు. అతను విధులు నిర్వర్తిస్తున్న 11 లెవల్ బారికేడ్ వద్ద నుంచి 21 లెవల్ వరకు ఆరు రెస్క్యూ టీంలు ఎస్డీఎల్ యంత్రంతో రెండు రోజుల పాటు ఇసుకను తొలగిస్తూ ఆపరేషన్ చేపట్టారు. అయితే 20వ లెవల్ వద్ద సత్యనారాయణ వెంట తీసుకువెళ్లిన హెడ్ లైట్ దొరకటంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సుమారు 350 మీటర్ల దూరంలోని ఇసుకను తొలగించగా చివరకు 20వ లెవల్ ఈస్ట్ ఆఫ్ 35 డిప్ జంక్షన్‌కు 12 మీటర్ల దూరంలో 21వ లెవల్ వద్ద మృత దేహాన్ని గుర్తించారు. సత్యనారాయణ శరీరం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. మృత దేహాన్ని బయటకు తీసిన అనంతరం అంబులెన్స్‌లో మంజూర్‌నగర్ సింగరేణి ఆస్పత్రికి తరలించారు. బారికేడ్‌కు 0.06 మీటర్ల మేర రంధ్రం పడి ఇసుక, నీరు ఉధృతంగా ప్రవహించినందున సత్యనారాయణ కొట్టుకు పోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గాలింపులో భాగంగా 50 మంది మైనింగ్ ఉద్యోగులు గనిలోని ఇతర గుళాయిలలో వెతికారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ.. గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీని కనుగొనడానికి సింగరేణికి చెందిన జీఎం సేఫ్టీ ఎం.వసంతకుమార్, జీఎం రెస్క్యూ జి.వెంకటేశ్వర్‌రెడ్డి, రీజియన్ సేఫ్టీ జీఎం కలువల నారాయణ, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, ఏరియా జనరల్ మేనేజర్ కొండబత్తిని గురువయ్య గని వద్ద మకాం వేసి నిరంతరం ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. గని ప్రమాదంపై డీడీఎంఎస్ విచారణ గని ప్రమాదంలో కార్మికుడు సత్యనారాయణ మృతి చెందటం పట్ల మైనింగ్ శాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డీడీఎంఎస్ సుబ్రహ్మణ్యం గనిలోని సంఘటనా స్ధలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. కేటీకే–1 గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీ కనుగొనడానికి 48 గంటల సమయం పట్టడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని సత్యనారాయణ కుమారుడు శ్రవన్ శుక్రవారం గని ఆవరణలో జీఎంను నిలదీశాడు. శ్రవన్ బోరున విలపించగా అక్కడే ఉన్న కార్మికులను కంటతడిపెట్టారు. మార్చురి వద్ద మృతుని భార్య అన్నపూర్ణతో పాటు బంధువుల రోధనలు కలచి వేశాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకులు కొక్కుల తిరుపతి, బడితెల సమ్మయ్య, రత్నం అవినాష్‌రెడ్డి, కోటేశ్వర్రావు, మల్లేష్, వెంకటేశ్వర్లు, బాలాజీ, కొరిమి రాజ్‌కుమార్, మొటపలుకుల రమేష్, భీమా, రత్నం సమ్మిరెడ్డి, కె.నర్సింగరావు చేపట్టారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం.. గని కార్మికుడు సత్యనారాయణ కుటుంబాన్ని సింగరేణి సంస్థ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటుంది. కుటుంబంలో ఒకరికి 10 రోజులలో సంస్థలో ఉద్యోగం కల్పిస్తాం. గని ప్రమాదంలో మృతి చెందినందున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను అందజేసేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటాం. – కె.గురువయ్య, ఏరియా జీఎం -
గనిలో కార్మికుడి గల్లంతు.. దొరకని ఆచూకీ
సాక్షి, కోల్‌బెల్ట్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో సపోర్ట్‌మెన్ కార్మికుడు రాయుడు సత్యనారాయణ గల్లంతై 24 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. దీంతో గని వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బుధవారం మొదటి షిఫ్టు విధులకు హాజరైన సత్యనారాయణ మధ్యాహ్నం నుంచి కనిపించక పోవడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ, మైనింగ్ స్టాఫ్ బృందాలు గనిలో గాలిస్తున్నాయి. సింగరేణికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు గని వద్దే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గని ఆవరణలోకి వందలాది మంది కార్మికులు చేరుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం ఉదయం అక్కడికి చేరుకుని సింగరేణి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గనిలో తప్పిపోయిన కార్మికు డి కుటుంబ సభ్యులు గని సమీపంలోనే బిక్కుబిక్కు మంటూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అసలేం జరిగింది.. కేటీకే–1 గనిలోని 36వ డిప్ 3వ సీం ఎస్–7 ప్యానల్ వద్ద 11 లెవల్లో బారికేడ్ వద్ద బుధవారం మొదటి షిఫ్టు విధులకు సపోర్టుమెన్ రాయుడు సత్యనారాయణ హాజరయ్యాడు. ఈక్రమంలో రిలే–డి కి చెందిన ఓవర్‌మెన్ 35 డిప్‌లోని ట్రావెలింగ్ రోడ్లో నీరు వస్తుంది.. అదుపు చేయాలని సత్యనారాయణకు ఆదేశాలు ఇవ్వటంతో ఆయన అక్కడికి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి సత్యనారాయణ ఆచూకీ కనిపించకపోవడంతో గని అధికారులకు సమాచారం అందించగా రెస్క్యూ, మైనింగ్ స్టాఫ్ సిబ్బంది రంగంలోకి దిగి పని ప్రదేశాల్లో వెతికారు. 11వ లెవల్ నుంచి 19 లెవల్ వరకు ఇసుకలో చిక్కుకున్నాడనే అనుమానంతో ఎస్డీఎల్ యంత్రాలతో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గాలింపు ముమ్మరం.. రామగుండం రిజియన్ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, జీఎం ఎస్టేట్ ప్రేంకుమార్, ఏరియా జనరల్ మేనేజర్ కె.గురువయ్య ఆధ్వర్యంలో గురువారం గాలింపు ముమ్మరం చేశారు. మందమర్రి, గోదావరిఖనికి చెందిన రెండు, భూపాలపల్లికి చెందిన నాలుగు రెస్క్యూ బృందాలకు చెందిన 30 మంది, మైనింగ్ స్టాఫ్‌తో ఏర్పాటు చేసిన మరో 30 మంది గనిలోని పని స్థలాలకు వెళ్లి వెతుకుతున్నారు. గాలింపు చర్యలను ఎస్ఓటు జీఎం పద్మనాభరెడ్డి, గ్రూప్ ఆఫ్ ఏజెంట్ టీవీ.రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బచ్చ రవీందర్, సెక్యూరిటీ ఆఫీసర్ మధుకర్, డీవైజీఎం రాజేంద్రకుమార్, గని మేనేజర్ క్రిష్ణప్రసాద్ పర్యవేక్షించారు. గని వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న జీఎం గురువయ్య 20 లెవల్ వద్ద క్యాప్‌లైటు లభ్యం.. గనిలోని 20 లెవల్ వద్ద సత్యనారాయణకు చెందిన క్యాప్‌లైటు గాలింపు చేపట్టిన రెస్క్యూ బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. 11వ లెవల్ వద్ద బారికేడ్ ఫెయిల్ కావటంతో ఇసుక, నీరు ఉధృతంగా వచ్చి ఆ ధాటికి కొట్టుకుపోయి ఉంటాడా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమీపంలో ఉన్న ఇసుక మేటల్లో గాలింపు చేపడుతున్నారు. -
సీఎస్ వర్సెస్ డీఓ
గణపురం(భూపాలపల్లి) : గణపురం మండలంలోని చెల్పూరు çపదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) ప్రభాకర్‌రెడ్డి, డిపార్టమెంటల్ అధికారి(డీఓ)నర్సింహచారి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవలు వీధికెక్కాయి. పరీక్ష కేంద్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడి చేసుకునేందుకు యత్నించడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా గణపురం మండల కేంద్రంలో రెండుసెంటర్లతోపాటు చెల్పూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో సీఎస్ ప్రభాకర్‌రెడ్డి మొదటి రోజు నుంచి సెంటర్లో మాస్ కాపీయింగ్ నడుస్తున్నా పట్టించుకోవడం లేదని డీఓ నర్సింహచారి ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నుట్ల సమాచారం. అందులో భాగంగా సోమవారం ఇంగ్లిష్ మొదటి పేపర్ పరీక్ష జరుగుతుండగా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ చేతిలో చిట్టీ ఉండడం గమనించిన డీఓ ఆమె చేతిని లాక్కొని సీఎస్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ పెనుగులాటలో ఆమె చేతులకు ఉన్న గాజులు పగిలిపోయి గాయాలయ్యాయి. విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద« డబ్బులు తీసుకుంటూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ సీఎస్ ప్రభాకర్‌రెడ్డితో డీఓ నర్సింహచారి గొడవకు దిగారు. రెండు రోజులపాటు పరీక్ష కేంద్రంలో ఈ తంతు నడుస్తుండడంతో విషయం తెలుసుకున్న డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సంఘటనపై విచారణ జరపాలని గణపురం ఎంఈఓ చిలువేరు సురేందర్, వెంటాపురం ఎంఈఓ శాగర్ల అయిలయ్యను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీఓను తొలగిస్తున్నట్లు ఆదేశా>లు జారీచేశారు. ఆయన స్థానంలో కర్కపల్లి పాఠశాల ప్రధానోపాద్యాయుడు భద్రయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి సీఎస్, డీఓల మధ్య జరిగిన గొడవతో చెల్పూరు పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి వారి సెల్ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసుకొని వెళ్తున్నారని, మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
భూపాలపల్లి జిల్లాలో ల్యాండ్మైన్ల అలజడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటోందా? ఎత్తుగడలకు పదును పెట్టి పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రణాళిక రూపొందించిందా? నిఘా వర్గాలు ఇవే అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు పెద్దగా లేవని భావిస్తున్న సమయంలో ల్యాండ్మైన్లు బయటపడటం సంచలనం రేపుతోంది. ఏడాది కిందటే అమర్చారా? భూపాలపల్లి జిల్లా వాజేడు నుంచి వెంకటాపురం వెళ్లే రహదారిలో సోమవారం ఉదయం రెండు ల్యాండ్మైన్లు బయటపడ్డాయి. కల్వర్టు తనిఖీలో భాగంగా బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది వీటిని గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి జేసీబీతో రోడ్డును తొలగించి వాటిని వెలికి తీశారు. ఈ రెండు మందుపాతరలు సుమారు 30 కేజీలు బరువున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఉంటూ అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ.. ఏకంగా వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చడం పోలీస్‌శాఖలో కలకలం రేపింది. కూంబింగ్ బలగాలు వరంగల్ నుంచి తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటపురం మీదుగానే అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. గోదావరి నదిపై నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి మార్గంలో ఎవరిని లక్ష్యంగా చేసుకొని మందుపాతర పెట్టారు? ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలను లక్ష్యంగా చేసుకున్నారా లేదా గ్రేహౌండ్స్ బలగాలను టార్గెట్ చేశారా అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇవి ఏడాది కిందటే అమర్చినట్టు ఇటీవలే ముగ్గురు మిలిటెంట్లు ఏటూరు నాగరం పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే రెండే ఉన్నాయా? మావోయిస్టులు ఇంకా మరిన్ని ల్యాండ్మైన్లు అమర్చారా అన్న అంశంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపేసి, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏడాది క్రితం పేలింది ఇదే దారిలో.. గతేడాది జూలైలో ఇదే రహదారిలో ప్రెషర్ కుక్కర్ బాంబ్‌ను మావోయిస్టు పార్టీ అమర్చింది. దానిపై ఓ గిరిజన యువకుడు తెలియక కాలు వేయడంతో బాంబు పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో రిజర్వ్‌ఫారెస్ట్‌గా ఉన్న ఏటూరు నాగారం నుంచి వాజేడు, వాజేడు నుంచి వెంకటాపురం, అలబాక, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు అటవీ ప్రాంతంలో అనేక ల్యాండ్మైన్లు అమర్చి ఉంటారని స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది. మేడారం జాతర.. నేతల పర్యటనలు.. భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు ముఖ్య నాయకులున్నారు. ఒకరు అసెంబ్లీ స్పీకర్, మరొకరు మంత్రి చందూలాల్. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాల్లో పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనవరి చివరి వారంలో మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు ముందు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న మేడారం, ఏటూరు నాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం, అలబకా ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్ చేపడతారు. ఇందులో భాగంగా పోలీస్ బలగాలను తిప్పి కొట్టడమే కాకుండా మావోయిస్టు కార్యక్రమాలు విస్తృతమయ్యాయన్న సంకేతం పంపేందుకే మందుపాతర అమర్చి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. -
నదికి అడ్డంగా రోడ్డేశారు!
⇔ ఇసుక తరలింపునకు దొడ్డిదారి ⇔ నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్లు ⇔ రెండు నెలల్లో రెండు అడ్డదారుల నిర్మాణం ⇔ నిత్యం వందల లారీలు ⇔ నది ప్రవాహానికి అడ్డంకులు సాక్షి , భూపాలపల్లి : ఇసుక కాంట్రాక్టర్లు నది మధ్యలో రోడ్లు వేశారు. నెల వ్యవధిలో రెండు రోడ్లు వేసి దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. దేశంలోనే రెండో పెద్ద నది అయిన గోదావరిపై అడ్డంగా మట్టితో రోడ్డు వేసి.. రోజు వందలాది లారీలు ఆ రోడ్డుపై వెళ్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ, అన్నారం వద్ద గోదావరిపై రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నారు. బ్యారేజీ బ్యాక్‌వాటర్ పరిధిలో ఇసుకను తీయాలని నిర్ణయించారు. తొలిదశలో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 36 కిలోమీటర్ల పరిధిలో 3.04 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. దీని కోసం 23 ఇసుక రీచ్‌లను గుర్తించగా.. ప్రస్తుతం 11 రీచ్‌ల ద్వారా ఇసుక తోడుతున్నారు. ఇక్కడి రీచ్‌ల దగ్గరి స్టాక్‌పాయింట్ల నుంచి కాళేశ్వరం –మహదేవపూర్–కాటారం–భూపాలపల్లి –వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు ఇసుకను తరలించాలని నిర్ణయించారు. గోదావరి నదిలో మహదేవపూర్, ఏటూరునాగారం, వాజేడుల వద్ద ఉన్న ఇసుక రీచ్‌లు స్టాక్‌పాయింట్ల నుంచి ఓవర్‌లోడ్‌తో ఇసుక వెళ్తుండటంతో ఇటీవల వరంగల్ సమీపంలో ఆర్టీఏ అధికారులు వరుసగా దాడులు ప్రారంభించారు. లారీలను సీజ్ చేసి జరిమానా విధించి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు. దీంతో ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా నిబంధనలకు విరుద్ధంగా గోదావరి అవతలి ఒడ్డున ఉన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు– మంచిర్యాల మీదుగా హైదరాబాద్, నాగ్‌పూర్‌లకు లారీలు వెళ్లే విధంగా ఇసుక కాంట్రాక్టర్లు ప్రణాళిక రచించారు. ఇప్పటికే రెండు మట్టి రోడ్లు పలుగులు –1, పలుగులు –2 రీచ్‌ల వద్ద ఇసుక తరలించేందుకు భూపాలపల్లి –మంచిర్యాల జిల్లాల మధ్య నదికి అడ్డంగా మట్టికట్టలు పోసి రోడ్లు నిర్మించారు. ఈ రోడ్ల మీదుగా నిత్యం వందల సంఖ్యలో లారీలు వెళ్తున్నాయి. మరోవైపు నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో దిగువకు ప్రవహించే నీరు తగ్గిపోతుంది. గోదావరి, కృష్ణా లాంటి పెద్ద నదులకు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కేంద్ర జలవనరుల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా ఖర్చు తగ్గించుకుని లాభాలు పెంచుకునేందుకు ఇసుక కాంట్రాక్టర్లు నదికి అడ్డంగా మట్టికుప్పలు పోసి రోడ్డు నిర్మించారు. మార్చిలో పలుగులు –2 వద్ద నదికి అడ్డంగా రోడ్డు నిర్మించారు. దీనిపై విచారించి రోడ్డు నిర్మించినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ మార్చిలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మీడియా సాక్షిగా హెచ్చరించారు. అయితే, నెలరోజులు గడిచినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా పలుగులు –1 రీచ్ వద్ద మరో రోడ్డును ఏప్రిల్‌లో నిర్మించారు. దీంతో భూపాలపల్లి– వరంగల్ మీదుగా కాకుండా చెన్నూరు– మంచిర్యాల మీదుగా ఇసుక లారీలు పంపిస్తున్నారు. టీఎస్ఎండీసీ వత్తాసు నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదికి అడ్డంగా నిర్మించిన మట్టి రోడ్లపై నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంచిర్యాల జిల్లాలో స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ఎండీసీ ప్రకటించడం విస్మయం కలిగించింది. దీనికి బదులు మంచిర్యాల జిల్లా వైపు నుంచి ఇసుక రీచ్‌లకు అనుమతి ఇస్తే సరిపోయేది. కానీ, నది సహజ నీటి ప్రవాహాన్ని నామరూపాలు లేకుండా చేస్తూ నదిలో ఇసుక కాంట్రాక్టర్లు చేస్తున్న పనులకు టీఎస్ఎండీసీ వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. దాని అర్థం అదే.. నది ప్రవాçహానికి అడ్డుగా మట్టిరోడ్డు నిర్మించే హక్కు ఇసుక కాంట్రాక్టర్లకు ఉందా? అని టీఎస్ఎండీసీ ప్రాజెక్టు మేనేజర్ కేఎల్ఎన్రావును సంప్రదించగా సూటిగా సమాధానం చెప్పలేదు. నదికి అడ్డంగా మట్టిరోడ్డు నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా అని అడిగితే.. మంచిర్యాల జిల్లాలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నామని, అటువైపు ఇసుక లారీలు వెళ్లేలా నదికి అడ్డంగా మట్టి రోడ్డు నిర్మించుకోవచ్చని అర్థం అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. -
వేటాడింది ఐదు.. పట్టుకున్నవి రెండు
♦ మహదేవపూర్ అడవుల్లో జింకల్ని వేటాడింది రెండు బృందాలు ♦ అటవీ సిబ్బందికి దొరికినవి రెండు జింకల కళేబరాలే ♦ మరో మూడింటిని అడవిలోకి విసిరేసి పరారైన వేటగాళ్లు! ♦ ఐదుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మహాదేవపూర్ (మంథని): భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో ఆదివారం రాత్రి వేటగాళ్లు రెండు కాదు... ఐదు జింకలను వేటాడినట్లు తెలుస్తోంది. రెండు బృందాలు ఈ వేటలో పాల్గొనగా.. ఓ బృందం రెండు జింకలను, మరో బృందం మూడు జింకలను వేటాడినట్లు అనుమానిస్తున్నారు. మూడు జింకల కళేబరాలను అడవిలోనే విసిరేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వేటలో స్థానిక నాయకుడితోపాటు సుమారు 14 మంది పాల్గొనగా.. 4 వాహనాలు వినియో గించినట్లు తెలుస్తోంది. రెండు తుపాకులను వాడినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల సహ కారంతో కొన్నేళ్లుగా వేట నడుస్తున్నట్లు సమాచారం. వేట సాగిందిలా.. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు వేటగాళ్లు ఇండికా కారులో తుపా కులతో ఆదివారం మధ్యాహ్నం స్థానిక నాయకుడి రహస్య స్థావరానికి చేరుకున్నారు. స్థానిక షూటర్లు, వేట తర్వాత జంతువును హలాల్ చేసే వారు, కాపుకాసే వారు వేటలో సహకరించే వారు వీరికి తోడయ్యారు. ఒక మిలట్రీ జీపు, ఒక జిప్సీ క్యాంటర్ వాహనం, స్థానికులకు చెందిన స్విఫ్ట్ కారు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండికా కారులో అంబట్పల్లికి బయల్దేరారు. అంబట్ పల్లిలో ఇండికా కారు వదిలి.. మిగతా మూడు వాహనాల్లో పంకెన ప్రాంతం వైపు పయన మయ్యారు. స్థానిక నాయకుడు అక్కడ కూడా వ్యవసాయం చేస్తుండడంతో.. చూసిన వారు భూముల వద్దకు వెళ్తున్నారనుకున్నారు. పంకెనలో వాగు వద్ద సదరు నాయకుడి సూచన మేరకు రెండు బృందాలుగా విడిపోయి జంతువుల సంచారం ఉన్న వైపు వెళ్లారు. వేటగాళ్ల కదలికలను గమనించిన స్థానికులు కొందరు డీఎఫ్‌వోకు సమాచారం అందజేశారు. ఎర్ర జిప్సీ వాహనంలో వెళ్లిన బృందం.. రెండు జింకలను వేటాడింది. సర్వాయపేటలో ఉన్న మరో బృందం మూడు జింకలను వేటాడినట్లు తెలుస్తోంది. ఎర్ర జిప్సీ బృందం.. వేటాడిన రెండు జింకలతో తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో పెట్రోలింగ్‌లో పలిమెల రేంజ్ అధికారికి సమాచారం అందింది. దీంతో ఆయన లెంకలగడ్డ వద్ద వాహనాన్ని అటకాయించినా ఆపకుండా దూసుకెళ్లారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన మహదేవపూర్ రేంజ్ అధికారి నలుగురు సిబ్బందితో సూరారం పొలిమేరల్లో వాహనాన్ని అడ్డుగా నిలిపారు. రాపెల్లికోట మీదుగా వచ్చిన జిప్సీ వాహనం అటవీ వాహ నాన్ని ఢీకొట్టి అంబట్పల్లి వైపు వెళ్లింది. దీన్ని అటవీ అధికారులు వెంబడిం చారు. వెనుక సర్వాయపేట నుంచి బయల్దేరిన మరో మిలట్రీ జీపులో నుంచి మూడు జింకలను దారిలోనే అడవిలోకి విసిరి వేసినట్లు చెబుతున్నారు. జిప్సీలోని జింకలను అంబట్పల్లిలో ఇండికా కారు నిలిపిన ప్రదేశంలో వేటగాళ్లు గడ్డివాములోకి విసిరేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి తప్పించుకునేందుకు ప్రయత్నిం చారు. అయితే అటవీ అధికారులు వారిని చాకచక్యంగా పట్టుకొని కారును, జంతువు లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వేటగాళ్లపై కేసు జింకలను వేటాడిన ఉదంతంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ రమేశ్ తెలిపారు. రెండు జింకల కళేబరాలతోపాటు స్వాధీనం చేసు కున్న సామగ్రిని మంథని కోర్టులో డిపాజిట్ చేశామన్నారు. కారులో లభిం చిన ఆధార్‌కార్డ్, ఫొటోల ఆధారంగా హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన అఫ్జల్ అహ్మద్ఖాన్తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు.