బాలింతను పరీక్షిస్తున్న వైద్య బృందం
పలిమెల: వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించి.. రోడ్డు తెగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేని ఒక గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన గర్భిణి తోలెం నాగేశ్వరికి సోమవారం తెల్లవారుజామున నొప్పులు మొదలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చాలంటే మండల కేంద్రం నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం, మహాముత్తారం మీదుగా భూపాలపల్లి, మహాదేవ్‌పూర్ తీసుకెళ్లాలి. కానీ వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా తెగిపోయింది.
దీంతో ఎక్కడికి వెళ్లలేక ఆమె నరకయాతన అనుభవిస్తూ కారు చీకట్లో ఇంట్లోనే ప్రసవించింది. కాగా.. సోమవారం ఉదయం బాలింతను ఆస్పత్రికి తరలించేందుకు పెద్దంపేట వాగు వద్దకు తీసుకుపోయారు. అక్కడి నుంచి బాలింత వాగు దాటలేకపోవడంతో అంబటిపల్లి పీహెచ్‌సీ వైద్యులకు సమాచారం అందించారు. వాగు వద్దకు వైద్య బృందం చేరుకుని ఆమెకు పరీక్షలు నిర్వహించి.. పంకెనలోని సబ్‌సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment