
పులిలాంటి చారలతో కుక్క
పలిమెల: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగ్గూడెంలో ఓ కుక్క పులి వేషం వేసింది! అదిప్పుడు వైరల్‌గా మారింది. గ్రామానికి చెందిన ఓ రైతు పంట చేనులో కోతుల బెడదను తప్పించుకోవడానికి మార్గం ఆలోచించాడు. శునకం శరీరంపై నలుపు రంగుతో పులి చారలు గీసి చేనులో కాపలా పెట్టాడు. పంట చేను వద్ద పులిని తలపిస్తున్న శునకాన్ని చూసి భయపడిన కోతులు పంట చేనులోకి రావడం లేదని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.