పులి చారలతో ఉన్న శునకం
ఆదిలాబాద్: మండలంలోని సావర్గాంలో ఆదివా రం పులిని పోలిన శునకం దర్శనమిచ్చింది. ఇది పులి పిల్లనా? లేక శునకమా? అని సందిగ్ధంలో పడ్డారు. గ్రామానికి చెందిన రంగన్న అనే మేకల కాపరి తన మేకలకు కాపలాగా శునకాన్ని పెంచుతున్నాడు. ఈ మధ్య తాంసి, భీంపూర్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన పెంపుడు కుక్కకి పులిని పోలిన రంగులను అద్దాడు. విచిత్రంగా ఉన్న శునకం గ్రామంలోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. శునకాన్ని పెంచుతున్న మేకల కాపరిని గ్రామస్తులు టైగర్ రంగన్న అని పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment