ranganna
-
'వామ్మో.. పులి' కాదు ‘గ్రామ సింహం..' అసలు విషయం తెలిస్తే షాక్..
ఆదిలాబాద్: మండలంలోని సావర్గాంలో ఆదివా రం పులిని పోలిన శునకం దర్శనమిచ్చింది. ఇది పులి పిల్లనా? లేక శునకమా? అని సందిగ్ధంలో పడ్డారు. గ్రామానికి చెందిన రంగన్న అనే మేకల కాపరి తన మేకలకు కాపలాగా శునకాన్ని పెంచుతున్నాడు. ఈ మధ్య తాంసి, భీంపూర్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన పెంపుడు కుక్కకి పులిని పోలిన రంగులను అద్దాడు. విచిత్రంగా ఉన్న శునకం గ్రామంలోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. శునకాన్ని పెంచుతున్న మేకల కాపరిని గ్రామస్తులు టైగర్ రంగన్న అని పిలుస్తున్నారు. -
వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 స్టేట్మెంట్లో కూడా వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి హత్యచేశారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, వయసు రీత్యా పలు అనారోగ్య కారణాల వల్ల వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. దీంతో రంగన్న ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ పోలీసులు, కుటుంబసభ్యులు మంగళవారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో రంగన్నను అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. సీబీఐ విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వివేకా పీఏ కృష్ణారెడ్డిని మంగళవారం ప్రశి్నంచారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణారెడ్డి దాచిపెట్టిన విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా ప్రశి్నంచారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లేఖను ఎందుకు దాయాల్సి వచి్చంది? ఎవరు ఆదేశాలిచ్చారు?. లేఖను ఎవరు తొలుత గుర్తించారు? తర్వాత దాన్ని ఎక్కడ దాచిపెట్టారు? లేఖ విషయం తొలుత ఎవరెవరితో పంచుకున్నారు? లేఖను ఎన్ని గంటలకు పోలీసులకు అప్పగించారు? అప్పటి వరకు లేఖను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా?.. ఇలా అనేక అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అధికారుల ప్రశ్నలకు కృష్ణారెడ్డి ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఇటీవల పులివెందులలోని కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వివేకా కేసులో సునీత భర్తను విచారించిన సీబీఐ -
రంగడు... మహా మాయగాడు!
జిల్లాలో జోరుగా కల్తీ మద్యం కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా స్పిరిట్, నకిలీ మూతల సరఫరా డీటీఎఫ్ దాడులతో గుట్టురట్టు పట్టుబడిన పాత నేరస్తుడు రంగన్న ఇది వరలో పలుమార్లు జైలుకు.. భారీ లాభాల నేపథ్యంలో తిరిగి ఇదే వ్యాపారం రంగన్న. నకిలీ మద్యం వ్యాపారంలో ఆరితేరిన మాయగాడు. జైలుకు వెళ్లి రావడమంటే.. అత్తగారింటికి వెళ్లొచ్చినట్లే. కాస్త కష్టపడితే.. లాభాలు మూటకట్టుకోవచ్చనే భావన పోలీసులకు పట్టుబడినా తిరిగి అదే వ్యాపారం వైపు నడిపిస్తోంది. పీడీ యాక్ట్ కూడా ఇతన్ని నిలువరించలేకపోవడం చూస్తే.. ఇతనొక్కడే ఈ వ్యాపారంలో లేడనే విషయం ఇట్టే అర్థమవుతోంది. మరి కనిపించని ఆ మద్యం మాఫియాను ఎక్సైజ్ శాఖ ఎందుకు పట్టుకోలేకపోతోంది? కర్నూలు: జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. నకిలీ మూతలను కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకొని బ్రాండ్ మిక్సింగ్ చేసి వ్యాపారాలు సాగిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ విచారణలో వెలుగు చూసింది. జిల్లాలోని మద్యం మాఫియా ఒకవైపు అధిక ధరలకు విక్రయాలు జరుపుతూనే సరికొత్త రూటును ఎంచుకొని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై ట్యాపింగ్ చేసి బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. మద్యం డైల్యూషన్ అమ్మకాలను అధికార పార్టీ నేతల అండదండలతో జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని పత్తికొండ, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆలూరు, ప్రాంతాల్లో మద్యం మాఫియా బెల్టు దుకాణాల ద్వారా ఈ తర హా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ దాడులతో గుట్టురట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా టాస్క్ఫోర్సు అధికారుల దాడులతో నకిలీ మద్యం గుట్టు రట్టయింది. డీటీఎఫ్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ కిషోర్‌కుమార్ నేతృత్వంలో సోమవారం రాత్రి గోనెగండ్ల మండలం పుట్టపాశంలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో స్పిరిట్, నకిలీ మూతలు.. ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పుట్టపాశం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు బోయ రంగన్న, ఆయన కుమారుడు బోయ గోవిందును అదుపులోకి తీసుకొని నకిలీ మద్యం రాకెట్ వెనుక ఎవరున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అతని వద్ద నుంచి 10 లీటర్ల స్పిరిట్, 270 నకిలీ మూతలు, 236 ఒరిజినల్ చాయిస్ ఖాళీ సీసాలు, 60 ఎక్సైజ్ అడేసివ్ లేబుళ్ల(ఈఏఎల్)ను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర నెలల క్రితం కూడా రంగన్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ ఇదే తరహా వ్యాపారం సాగిస్తున్నట్లు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములుకు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు డీటీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రం మద్య నిషేధం అమలులో ఉన్నప్పుడు కూడా రంగన్న జిల్లాలో మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఈ తరహా వ్యాపారంలో భారీగా లాభాలు ఉండటంతో ఈ వ్యాపారాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. గతంలో ఈయనపై పీడీయాక్ట్ కూడా అమలు చేసి సుమారు 6 మాసాల పాటు జైలుకు పంపారు. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం నకిలీ మూతలు, నకిలీ మద్యం తయారీ కోసం స్పిరిట్, ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారనే విషయంపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. రాయచూరు కేంద్రంగా నకిలీ మద్యం సరఫరా కర్ణాటక రాష్ట్రం రాయచూరు కేంద్రంగా జిల్లాలోకి నకిలీ మద్యంతో పాటు బాటిళ్లు, స్పిరిట్, నకిలీ మూతలు, ఖాళీ సీసాలు సరఫరా అవుతున్నాయి. రాయచూరుకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతాలకు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. క్యాన్లలో స్పిరిట్‌ను సరఫరా చేసి రహస్య ప్రాంతాల్లో ఉంచి నకిలీ మద్యాన్ని తయారు చేసి బె ల్టు దుకాణాల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రాండ్ మిక్సింగ్ అంటే.. బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యూట్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు. రాయల్‌స్టాగ్, ఎంసీ విస్కీ వంటి ముఖ్యమైన ప్రీమియం బ్రాండ్లలో చీప్ లిక్కర్‌ను కలిపి మద్యం మాఫియా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రయోగశాల ఉన్నప్పటికీ అది అలంకార ప్రాయంగా మారడంతో మద్యం వ్యాపారులకు వరంగా మారింది. మూలాలు ఎక్కడ? పుట్టపాశం ఘటన సమాచారాన్ని రాష్ట్ర ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు డీటీఎఫ్ అధికారులు చేరవేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. వారం రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఇదే తరహాలో భారీ ఎత్తున బ్రాండ్మిక్సింగ్ మూతలు బయటపడటంతో కర్నూలు జిల్లాలో కూడా అదే తరహా వ్యాపారం సాగుతున్నట్లు రాష్ట్రస్థాయి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎంతకాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్ మూతలు సరఫరా అవుతున్నాయి? ఏఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు? అందులో రంగన్నతో పాటు జిల్లాలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను నిర్ధారించే పనిలో జిల్లాటాస్క్ఫోర్సు నిమగ్నమైంది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతో పట్టుబడిన రంగన్నను కోర్టులో హాజరు పరిచి ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. గతంలో డోన్ సమీపంలోని కొత్తపల్లె వద్ద భారీ మొత్తంలో నకిలీ మద్యం బయటపడిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు కావడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం జిల్లాలో బయటపడుతున్న నకిలీ మద్యం కేసులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరికొందరు అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం లేకపోలేదు. -
వేటు..లే టు!
ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ ధిక్కరించిన ఎనిమిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల దెబ్బకు భయపడి వేటుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: ఆయన పేరు రంగన్న. యర్రగుంట్ల మున్సిపల్ ఛెర్మైన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి. చట్టాన్ని అమలు చేయాల్సిన ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విప్ ధిక్కరించిన 8 మంది కౌన్సిలర్లపై వేటు వేసే విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. యర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను స్థానిక ‘దేశం’ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. దాంతో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఆ మేరకు ఛెర్మైన్, వైస్ ఛెర్మైన్ ఎన్నికలకు లాటరీ అనివార్యమైంది. కాగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించడంతో ఆ పార్టీ నేతలు రిటర్నింగ్ అధికారి రంగన్నకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నోటీసులు సైతం జారీ చేశారు. అయితే చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్ని అమలు పర్చేందుకు సైతం వెనుకంజ వేస్తున్నారు. కేవలం ఇద్దరు నేతలను సంతృప్తిపర్చేందుకేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారపార్టీ మెప్పుకోసమే.. అలాంటి పరిస్థితే రాయచోటి మున్సిపాలిటీలోనూ తలెత్తింది. 18 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వారిలో ముగ్గురు ఆ పార్టీ విప్ ధిక్కరించారు. ఆ కారణంగా అక్కడ కూడా లాటరీనే అనివార్యమైంది. విప్ ధిక్కరించిన వారిపై అక్కడి ఆర్ఓ అనర్హతవేటు వేశారు. రాజంపేట ఎంపీపీ సుహర్లతపై విప్ ధిక్కారం కారణంగా అనర్హత వేటు పడింది. తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించారని వీరపునాయునిపల్లె ఎంపీపీ పద్మలతపై అన ర్హత వేటు వేశారు. జిల్లా వ్యాప్తంగా విప్ ధిక్కరించిన వారిపై చర్యలున్నా యర్రగుంట్లలో 8 మంది కౌన్సిలర్లపై మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు కారణం రిటర్నింగ్ అధికారి రంగన్నే అని ఉన్నతాధికారులు సైతం వివరిస్తున్నారు. అధికార పార్టీ నేతలనుంచి ఉన్న ఒత్తిడి ఫలితంగానే చర్యలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కక్కుర్తితోనే పదవులకు ఎసరు.. జిల్లాలో 11 మంది కౌన్సిలర్లు కాసులకు కక్కుర్తి పడ్డారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొంది టీడీపీ నేతల ప్రలోభాలకు లొంగారు. ఇప్పడు వారందరి పదవులకు ఎసరు వచ్చింది. రాయచోటిలో ముగ్గురు కౌన్సిలర్లపై వేటు పడింది. అలాగే రాజంపేట ఎంపీపీ సుహర్లత అనర్హతకు గురయ్యారు. యర్రగుంట్లలో 8 మంది కౌన్సిలర్లపై తర్వలో అనర్హత వేటు పడనుంది. ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికార పార్టీ ప్రభావంతో కొంత ఆలస్యం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అధికార పార్టీ వారిచ్చే కాసులకు ఆశపడి పదవులు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆర్వో రంగన్న ఏమన్నారంటే.... యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో 8మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ విప్ ధిక్కరించారు. వారిపై అందిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేశాం. ఆమేరకు ఆ కౌన్సిలర్ల నుంచి వివరణ కూడా తీసుకుని ఎన్నికల కమిషన్‌కు వివరించాం. అక్కడి నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. ఆదేశాలు అందగానే వేటు వేస్తాం. -
నేనూ నీ వెంటే...
వివాహమైనప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా మెలిగారు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ముదిమి వయసులో ఒకరికొకరు తోడునీడగా బతికారు. అనారోగ్యంతో భర్త మృతి చెందడాన్ని ఆమె తట్టుకోలేక పోరుుంది. ఎక్కిళ్లు పెట్టేలా విలపించడంతో గుండాగి కన్నుమూసింది. కుటుంబ సభ్యులను దు:ఖ సాగరంలో ముంచిన ఈ సంఘటన మదనపల్లె పట్టణం అప్పారావుతోటలో మంగళవారం చోటు చేసుకుంది. మదనపల్లెక్రైం,న్యూస్‌లైన్: పట్టణంలోని అప్పారావుతోటకు చెందిన రంగన్న(80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెం దాడు. ఈయనకు భార్య నాగరత్నమ్మ(68), కుమారుడు హరిప్రసాద్, కుమార్తె పద్మావతి ఉన్నారు. ఇంటిలోనే హోటల్ నడుపుతూ పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. కొంతకాలంగా ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. రంగన్న బీపీ, షుగర్, కీళ్లనొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాడు. నాగరత్నమ్మ పిల్లల్ని ఆశించకుండా భర్తను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. పలు వైద్యశాలల్లో చికిత్సలు చేయించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. మంగళవారం ఉదయం రంగన్న మృతి చెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేక ‘అయ్యా వెళ్లిపోయావా..’ అంటూ నాగరత్నమ్మ బోరున విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరో అరగంటకే నాగరత్నమ్మ కుప్పకూలి పడిపోరుుంది. ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారు. గుండె ఆగి చనిపోయిందని వైద్యుడు నిర్ధారించారు. కుటుంబ పెద్దలిద్దరూ ఒకేసారి కన్నుమూయడంతో ఇంట్లో పెను విషదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం దంపతులిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.