వివాహమైనప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా మెలిగారు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ముదిమి వయసులో ఒకరికొకరు తోడునీడగా బతికారు. అనారోగ్యంతో భర్త మృతి చెందడాన్ని ఆమె తట్టుకోలేక పోరుుంది. ఎక్కిళ్లు పెట్టేలా విలపించడంతో గుండాగి కన్నుమూసింది. కుటుంబ సభ్యులను దు:ఖ సాగరంలో ముంచిన ఈ సంఘటన మదనపల్లె పట్టణం అప్పారావుతోటలో మంగళవారం చోటు చేసుకుంది.
మదనపల్లెక్రైం,న్యూస్‌లైన్:
పట్టణంలోని అప్పారావుతోటకు చెందిన రంగన్న(80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెం దాడు. ఈయనకు భార్య నాగరత్నమ్మ(68), కుమారుడు హరిప్రసాద్, కుమార్తె పద్మావతి ఉన్నారు. ఇంటిలోనే హోటల్ నడుపుతూ పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. కొంతకాలంగా ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. రంగన్న బీపీ, షుగర్, కీళ్లనొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాడు. నాగరత్నమ్మ పిల్లల్ని ఆశించకుండా భర్తను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. పలు వైద్యశాలల్లో చికిత్సలు చేయించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. మంగళవారం ఉదయం రంగన్న మృతి చెందాడు.
భర్త మృతిని జీర్ణించుకోలేక ‘అయ్యా వెళ్లిపోయావా..’ అంటూ నాగరత్నమ్మ బోరున విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరో అరగంటకే నాగరత్నమ్మ కుప్పకూలి పడిపోరుుంది. ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారు. గుండె ఆగి చనిపోయిందని వైద్యుడు నిర్ధారించారు. కుటుంబ పెద్దలిద్దరూ ఒకేసారి కన్నుమూయడంతో ఇంట్లో పెను విషదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం దంపతులిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.
నేనూ నీ వెంటే...
Published Wed, Jan 8 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement