పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్‌మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌లో కూడా వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి హత్యచేశారని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, వయసు రీత్యా పలు అనారోగ్య కారణాల వల్ల వాచ్‌మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. దీంతో రంగన్న ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ పోలీసులు, కుటుంబసభ్యులు మంగళవారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో రంగన్నను అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగా..
సీబీఐ విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వివేకా పీఏ కృష్ణారెడ్డిని మంగళవారం ప్రశి్నంచారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణారెడ్డి దాచిపెట్టిన విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా ప్రశి్నంచారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లేఖను ఎందుకు దాయాల్సి వచి్చంది? ఎవరు ఆదేశాలిచ్చారు?.
లేఖను ఎవరు తొలుత గుర్తించారు? తర్వాత దాన్ని ఎక్కడ దాచిపెట్టారు? లేఖ విషయం తొలుత ఎవరెవరితో పంచుకున్నారు? లేఖను ఎన్ని గంటలకు పోలీసులకు అప్పగించారు? అప్పటి వరకు లేఖను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా?.. ఇలా అనేక అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అధికారుల ప్రశ్నలకు కృష్ణారెడ్డి ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఇటీవల పులివెందులలోని కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: వివేకా కేసులో సునీత భర్తను విచారించిన సీబీఐ
Comments
Please login to add a commentAdd a comment