puli
-
దళితులంటే బాబుకు చులకన
-
'వామ్మో.. పులి' కాదు ‘గ్రామ సింహం..' అసలు విషయం తెలిస్తే షాక్..
ఆదిలాబాద్: మండలంలోని సావర్గాంలో ఆదివా రం పులిని పోలిన శునకం దర్శనమిచ్చింది. ఇది పులి పిల్లనా? లేక శునకమా? అని సందిగ్ధంలో పడ్డారు. గ్రామానికి చెందిన రంగన్న అనే మేకల కాపరి తన మేకలకు కాపలాగా శునకాన్ని పెంచుతున్నాడు. ఈ మధ్య తాంసి, భీంపూర్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన పెంపుడు కుక్కకి పులిని పోలిన రంగులను అద్దాడు. విచిత్రంగా ఉన్న శునకం గ్రామంలోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. శునకాన్ని పెంచుతున్న మేకల కాపరిని గ్రామస్తులు టైగర్ రంగన్న అని పిలుస్తున్నారు. -
పులి గాండ్రింపులు ఏవీ?!
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా అటవీ ప్రాంతం ఉన్నా పులులు కన్పించకుండా పోయాయి. జాతీయ జంతువైన పులుల నివాసానికి జిల్లా అడవులు అనువైనవే అయినా... మనుగడ సాగడం లేదు. రెండేళ్లక్రితం ఓసారి జిల్లా అటవీ ప్రాంతంలో పులుల అడుగుజాడలు కనిపించాయి. కానీ ఆతర్వాత మళ్లీ జాడ లేదు. జిల్లా అటవీ విస్తీర్ణం 4,33,446 హెక్టార్లు కాగా, ఇందులో కిన్నెరసాని అభయారణ్యం విస్తీర్ణం 634.4 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అటవీప్రాంతంలో గుత్తికోయలు నివాసం ఏర్పాటుచేసుకోవడం, పోడు సాగుకు అడవులు నరికివేయడంతో పాటు రహదారుల నిర్మాణంతో పులుల మనుగడ కష్టమవుతోందనే భావన వ్యక్తమవుతోంది. శనివారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పులుల మనుగడ, రాకపోకలు, నివాసం ఏ ర్పాటుచేసుకోకపోవడానికి గల కారణాలపై కథనం. గతంలో పులుల కదలికలు 2001 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు పులుల అడుగు జాడలను అధికారులు గుర్తించారు. ఇక 2005లో మూడు, 2008లో నాలు గు, 2011, 2012లో మూడేసి పులులు, 2013లో రెండు, 2014, 2015లో ఒక్కో పులి కనిపించినా ఆతర్వాతజాడలేదు. 2018లో చేపట్టిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్కడా పులిని గుర్తించలేకపోయారు. వలన వచ్చినట్లే వచ్చి... జిల్లా అడవుల్లోకి పులుల వలస వస్తున్నాయి. జిల్లా అటవీ ప్రాంతాని ఆనుకుని ఏపీలోనిపాపికొండలు, అటు ఛత్తీస్‌గఢ్, ఇటు ఏటురూనాగారం అటవీ ప్రాంతాలు ఉండటంతో పెద్దపులులు అతిథులుగా వచ్చివెళ్తున్నాయే తప్ప స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. 2020 నవంబర్, 2021 డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద పులులు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించాయి. ఇక్కడ కిన్నెరసాని అభయారణ్యం పెద్దపులులకు సంరక్షణగా అనువుగా ఉన్నా పులులు మాత్రం ఉండడం లేదు. అనేక కారణాలు పొరుగు రాష్ట్రాల నుంచి గోదావరి నది దాటి జిల్లా అటవీప్రాంతానికి పెద్దపులులు అప్పుడప్పుడు వస్తున్నా స్థిర స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. అటవీప్రాంతం ఉన్నా పులులకు కావాల్సిన శాఖాహా ర జంతువులైన జింకలు, దుప్పులు, సాంబార్ వంటి జంతువుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గుత్తికోయ గుంపులు విస్తరించడం, అడవుల్లోనూ రహదారుల నిర్మాణం కూడా ఇంకో కారణం కావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పులి ఉండాలంటే.. జిల్లా అటవీ ప్రాంతంలో పులులు మనగడ కొనసాగించాలంటే వాటికి ఆహారమైన దుప్పులు, కణుజులు, సాంబారులు అధికంగా ఉండాలి. అవి అధికంగా ఉన్నచోట పెద్దపులి నివాసం ఉండే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా అటవీ ప్రాంతంలో జింకలు ఉన్నా ఎక్కువ లేవు, ఉన్నవాటిని అటవీ ప్రాంతంలోగుత్తికోయ గిరిజనులు మాయం చేస్తున్నారని ఫారెస్టు అధికారులు అంటున్నారు. -
నాలో జాన్వీని చూశారు
‘ఇంగ్లిష్–వింగ్లిష్’తో కమ్‌బ్యాక్ తర్వాత శ్రీదేవి ‘పులి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి కూతురుగా నటించిన హన్సిక నిజంగా కూడా తనని ఓ కూతురిలానే చూశారని చెప్పారు. శ్రీదేవి గురించి మాట్లాడుతూ... ► నేనొక్కదాన్నే కాదు శ్రీదేవి మేడమ్‌ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. తనొక లెజెండ్. ఇండియన్ సినిమాకి ఇదొక డార్క్ డే అనుకోవచ్చు. ఒక గొప్ప టాలెంటెడ్ యాక్టర్‌ను కోల్పోయింది. శ్రీదేవిగారితో యాక్ట్ చేసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా గర్వంగా ఉంది. శ్రీదేవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ► తను చాలా కైండ్, పొలైట్, ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తనతో నేను మాట్లాడినప్పుడు ‘జాన్వీ, నేను ఇలానే మాట్లాడుకునేవాళ్లం, జాన్వీని నేను చాలా మిస్ అవుతున్నాను’ అనేవారు. మా ఇద్దరి స్టార్ సైన్స్ (రాశులు) ఒక్కటే. మేం బాగా కలిసిపోయాం. అంత త్వరగా దేవుడు శ్రీదేవిగారిని తీసుకువెళ్లిపోవటం అన్యాయం. శ్రీదేవిగారు ఎక్కడున్నా ఆవిడ ఆత్మ శాంతిస్తుందనే అనుకుంటున్నాను. ఇండియన్ సినిమా డెఫినెట్‌గా ఒక లెజెండ్‌ను మిస్ అవుతుంది’’ అన్నారు. -
ఏడేళ్లలో అందనిది ‘7 నాట్కలిల్’తో అందుతుంది
ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన భారత సుందరి నికీషాపటేల్‌కు దక్షిణ సినిమాపై మక్కువ ఎక్కువే. దీంతో పలు ప్రయత్నాలనంతరం ‘పులి’ చిత్రంలో హీరోయిన్గా టాలీవుడ్లోకి ప్రవేశించిన అమ్మడు అక్కడ నరసిమ్మా, ఓం 3డీ వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత కన్నడ సినిమాపై కన్నేసి కొన్ని చిత్రాల్లో నటించింది. అనంతరం ‘ఎన్నమో ఏదో’ తమిళ చిత్రంతో కోలీవుడ్‌లో కాలుమోపింది. ఆ తర్వాత తలైవన్, కరైయోరం, నారదన్ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. 2010లో సినిమాలకు పరిచయమైన నికిషా గత ఏడేళ్ల కాలంలో 13 చిత్రాల్లో మాత్రమే నటించింది. అయితే వీటిలో కూడా ఏ ఒక్కటీ ఆమెకు గుర్తింపు తెచ్చేంతటి విజయాన్ని అందించలేకపోయాయి. అయినప్పటికీ పట్టువీడక ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది నికీషా. ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో పి.వాసు కుమారుడు శక్తి వాసు సరసన ‘7 నాట్కల్’ (ఏడు రోజులు) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎంఎస్ బాబు స్క్రీన్‌ప్లే చేస్తున్నారు. మిలియన్ డాలర్స్ సినీ నిర్మాణ సంస్థ తరఫున కె.కార్తిక్, కె.కార్తికేయన్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. వి.ఆర్.గౌతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికీషాది చాలా ముఖ్యమైన పాత్ర అట అని కోలీవుడ్ టాక్ ఏడేళ్ల కాలంలో అందని విజయం ‘7 నాట్కలిల్’ చిత్రం ద్వారా లభిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది నికీషాపటేల్. -
'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు
చాలా కాలం తరువాత పులి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ సినిమాలో శ్రీదేవి పాత్ర, ఆమె గెటప్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి. అయితే శ్రీదేవి వెండితెర మీద కనిపించిన ఆనందం అభిమానులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పులి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. దీంతో భారీగా ఉంటుందనుకున్న శ్రీదేవి రీ ఎంట్రీ అతిలోక సుందరి అభిమానులను నిరాశపరిచింది. సినిమా షూటింగ్ సమయంలో పులి యూనిట్ తో శ్రీదేవి కి వివాదాలున్నట్టుగా చాలా వార్తలు వినిపించినా వాటిని కొట్టి పారేశారు. తాజాగా సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తరువాత మరోసారి ఈ వివాదాలు తెర మీదకు వచ్చాయి. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వలేదంటూ పులి నిర్మాతలపై శ్రీదేవి ముంబై ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ చేసింది. త్వరలోనే ఈ కంప్లయింట్ ను చెన్నై చాంబర్ కు పంపేందుకు సిద్దమవుతున్నారు ముంబై వర్గాలు. -
విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్
పులి సినిమాతో అభిమానులను నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, వీలైనంత త్వరగా తన అభిమానులకు సక్సెస్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడు. తన తదుపరి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కోసం శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పులి డిజాస్టర్‌తో నిరాశలో ఉన్న ఇలయ దళపతి అభిమానులకు దీపావళికి భారీ కానుక ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు విజయ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన నెక్ట్స్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు విజయ్ 59గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ మహేంద్రన్‌తో పాటు, సత్యారాజ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి 2016 సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
'పులి'ని ఆకాశానికి ఎత్తేశాడు..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'పులి' సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. త్వరలో కపాలి సినిమా షూటింగ్ కోసం మలేషియా వెళ్లనున్న రజనీ.. విజయ్ హీరోగా నటించిన పులి సినిమా స్పెషల్ షో చూశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ కు తన అభినందనలు తెలియజేశాడు. పులి సినిమా అద్భుతంగా ఉందన్న రజనీ, భారీ సెట్స్ తో పాటు హాలీవుడ్ స్ధాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన పులి పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుందన్నారు. ఇలాంటి కామెడీ ఫాంటసీలో నటించి సాహసం చేసిన విజయ్ ని ప్రత్యేకంగా అభినందించారు. విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పులి, గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నెగెటివ్ టాక్‌తో స్టార్ట్ అయినా కలెక్షన్ల పరంగా మాత్రం సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది ఈ సినిమా. ఇప్పటికే 62 కోట్లకు పైగా వసూళు చేసిన పులి సౌత్ ఇండియాలో సెకండ్ హైయస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ సృష్టించింది. -
తారల ఇంట పట్టుబడిన సొమ్ము రూ.100 కోట్లా?
చెన్నై : సినీ తారల ఇళ్లలో సాగిన ఐటీ దాడుల్లో రూ. వంద కోట్ల మేరకు లెక్కలోకి రాని నగదు, నగలు, ఆస్తులు చిక్కినట్టు సమాచారం. ఇందులో రూ. 2 కోట్లు విలువగల నగలు, మరో 2 కోట్లు నగదు సైతం ఉన్నట్టుగా ఆదాయపన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇళయదళపతి విజయ్, సంచనల నటి నయన తార, చెన్నై చిన్నది సమంతలతో పాటు నిర్మాతలు సెల్వకుమార్, సిబుతామీన్స్, కలైపులి థాను, మదురై అన్బు, దర్శకులు శింబు దేవన్, అన్బుసెలియన్, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, పులి చిత్రంతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న వారి ఇళ్లు కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ వర్గాలు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. బుధ, గురు వారాల్లో 400 మంది అధికారులు 35 చోట్ల తనిఖీలు చేశారు. చెన్నై, హైదరాబాద్, మదురై, కోయంబత్తూరు, కొచ్చిన్, తిరువనంతపురం తదితర 35 చోట్ల సాగిన ఈ తనిఖీల్లో వంద కోట్ల మేరకు నగదు, నగలు , ఆస్తులు లెక్కలోకి రానివి పట్టుబడ్డట్టు సమాచారం. పది మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌసుల్లో రెండు రోజుల పాటుగా సాగిన తనిఖీల్లో వంద కోట్ల మేరకు లెక్కలోకి రాని నగలు, నగదు, ఆస్తుల రికార్డులు, పత్రాలు బయట పడ్డట్టుగా సమాచారం. అయితే, ఈ లెక్కలోకి రాని నగదు, నగలు, ఆస్తుల వివరాలు ఎవరి ఇళ్లల్లో, ఎక్కడ లభించిందోనన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచే పనిలో ఆదాయపన్ను శాఖ వర్గాలు ఉన్నట్టు సమాచారం. రూ. 30 కోట్ల మేరకు పన్ను ఎగవేత దిశగా వ్యవహరించి ఉన్న పది మందికి జరిమానా విధించేందుకు కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది. -
పులి రచ్చ
తమిళసినిమా: విజయ్ నటించిన తాజా చిత్రం పులి.ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. అయితే అనుకున్న సమయానికి థియేటర్లలో బొమ్మ పడకపోవడంతో అభిమానుల ఆందోళనతో పులి వ్యవహారం రచ్చరచ్చగా మారింది.పులి చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలవుతుందని ప్రకటించడంతో విజయ్ అభిమానులు ఆనందోత్సాహాలకు గురయ్యారు.రాష్ట్రలోని ఇళయదళపతి అభిమానులందరూ గురువారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రదర్శనలు చూడటానికి టిక్కెట్లు కొనుక్కుని అంతకు ముందే థియేటర్ల ముందు ఆత్రుతగా చేరిపోయారు.త మ అభిమాన నటుడి చిత్రాన్ని తొలి రోజు తొలి షోను చూడబోతున్నామన్న ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషంపై పోలీసులు నీళ్ళు చల్లారు.పులి చిత్రానికి ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకట్ట వేయడంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. తమిళనాడులోని పలు థియేటర్ల వద్ద అభిమానులుఆందోళనలకు దిగారు.పోలీసులు అడ్డకోవడంతో పరిస్థితి ఉద్రిక్తకకు దారి తీసింది.కొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యం టికెట్ల ధరను తిరిగి చెల్లించడానికి సిద్ధపడ్డా అదనంగా డబ్బు చెల్లించాలంటూ అభిమానులు గొడవకు దిగారు. పులి చిత్రం గురువారం విడుదల కావలసి వుండగా ఫైనాన్సియర్ సమస్యతో విడుదల ఆలస్యమైంది. ఇద్దరు అభిమానులు బలి : కాగా పులి చిత్ర ప్రచారంలో పాల్గొన్న విజయ్ అభిమానులు ఇద్దరు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాంబరం సమీపంలోని మణిమంగళం కు చెందిన సౌందర్‌రాజన్ (22), ఉదయకుమార్ (23)లు విజయ్ వీరాభిమానులు. పులి చిత్రం విడుదల కానుండటంతో బుదవారం అర్ధరాత్రి మోటార్‌బైక్‌లో మణమంగళం,కరసంగాల్ పరిసర ప్రాంతాలలో పులి చిత్ర పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేశారు.అలా వండలూర్,వాలాజా రోడ్డులో బైక్ మీద వెళుతుండగా వెనకగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో ఆ అభిమానులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.లారీ డ్రైవర్ పరారయ్యారు.మణిమంగళం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని మృతుల శవాలను పోస్టుమార్టం కోసం శ్రీ పెరంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డంకులు తొలగి.. 'పులి' విడుదల
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన పులి ఆర్థిక పరమైన సమస్యల కారణంగా కాస్త ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. గురువారం ఉదయం 4 గంటల షోతోనే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా క్యూబ్ సంస్థకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించని కారణంగా ఆలస్యం అయినట్టు చెపుతున్నారు. బుధవారం పులి యూనిట్ సభ్యుల ఇళ్ల పై జరిగి ఆదాయ పన్ను దాడులే ఈ ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు. నిర్మాతలతో పాటు హీరో విజయ్, ఇతర యూనిట్ సభ్యులు చొరవ తీసుకోవటంతో బెనిఫిట్ షోస్ మిస్ అయినా మార్నింగ్ షో టైంకు కొన్ని ప్రాంతాలలో సినిమా విడుదలైంది. అయితే అన్ని ప్రాంతాల్లో విడుదలకు మాత్రం మరి కాస్త సమయం పట్టనుంది. ప్రస్తుతానికి మదురై, సేలం లాంటి ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన మొదలైనట్టు హీరోయిన్ హన్సిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కోలీవుడ్‌లో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు. ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆలస్యం అయినట్టుగా తెలుస్తుంది. బ్యాంకులు తెరిచిన తర్వాత చెల్లింపులు జరిగి, ఆ తర్వాతే సినిమా విడుదలైందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తుండగా, శ్రీదేవి, సుధీప్, ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. All issues sorted ... It's time to Roar . It's time for #puli ☺️☺️ it's #showtime -
’పులి’విడుదలలో జాప్యంపై చెన్నైలో ఉద్రిక్తత
-
బాహుబలి కంటే గొప్పగా గ్రాఫిక్స్
బాహుబలి చిత్రం కంటే గొప్పగా పులి చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆ చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పులి చిత్రం పైనే ఇండస్ట్రీ దృష్టి అంతా. ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం పులి. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ విలన్‌గా నటించిన పులి చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. పీటీ.సెల్వకుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది.ఇది సోషియో ఫాంటసీ కథా చిత్రం. కాగా ఇందులో గ్రాఫిక్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయట. ఇటీవల తెరపైకి వచ్చిన సంచలన చిత్రం బాహుబలి చిత్రం గ్రాఫిక్స్‌కు చిరునామాగా పేరు తెచ్చుకుంది. అయితే దాన్ని మించిన గ్రాఫిక్స్ పులి చిత్రంలో చోటు చేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. అంతకు ముందు వచ్చిన నాన్ఈ చిత్రంలో 1200 గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండగా బాహుబలిలో 1400 గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పులి చిత్రంలో 2400 గ్రాఫిక్స్ సన్నివేశాలు విస్మయపరచనున్నాయని అంటున్నారు. ఈ గ్రాఫిక్ సన్నివేశాలను ప్రపంచంలోని తొమ్మిది దేశాల్లో రూపొందించారట. వీటికి 1500 మంది సాంకేతిక నిపుణులు పని చేశారట. చైనాలో కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు విజయ్‌కు సంతృప్తి కలిగించకపోవడంతో మళ్లీ తిరిగి పంపించేయించామని అంటున్నారు చిత్ర వర్గాలు. అలాంటి పులి ఏపాటి గాండ్రిస్తుందో తెలియాలంటే మరొక్కరోజే ఆగాల్సిందే. అక్టోబర్ 1న పులి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
బాహుబలి రికార్డ్స్‌పై గురిపెట్టిన పులి ?
-
పిల్లల కోసం 'పులి'
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా 'పులి' విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. భారీ బడ్జెట్ తో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ను తొలుత తాను ఒప్పుకోలేదని, అయితే తన పిల్లలు పట్టుబట్టడంతో ఓకే చేయక తప్పలేదన్నాడు విజయ్. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి పులి ప్రివ్యూ చూసిన విజయ్ ఈ కామెంట్స్ చేశాడు. ఇంత భారీ బడ్జెట్ తో విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఓ కామెడీ సినిమా చేయటం రిస్క్ అని తెలిసినా కథ మీద నమ్మకంతో ఈ సినిమా అంగీకరించాడు విజయ్. తను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందన్న ఇళయదళపతి 'పులి' విజయం మీద ధీమాగా ఉన్నాడు. అక్టోబర్ 1న తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్‌తో పాటు శ్రీదేవి, సుదీప్, శృతిహాసన్, హన్సిక, ప్రభు లాంటి టాప్ స్టార్స్ నటించారు. వందకోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. -
'పులి' న్యూ స్టిల్స్
-
మహారాణిలాగే చూసుకున్నారు
కొద్ది రోజులుగా 'పులి' టీం పై శ్రీదేవి గుర్రుగా ఉందంటూ వస్తున్న వార్తలకు ఆమె ముగింపు పలికింది. దాదాపు 30 ఏళ్ల తరువాత పులి సినిమాతో కోలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి, ఆ యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించింది. 1986లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'నాన్ ఇదిమయ్ ఇలయ్' సినిమాలో చివరి సారిగా నటించిన శ్రీదేవి, ఇన్నేళ్ల తరువాత పులి సినిమాలో ఓ కీలక పాత్రలోనటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను పులి టీం.. రాణీ లాగే చూసుకున్నారని తెలిపింది. పులి సినిమా కోసం చెన్నై స్టూడియోలలో షూటింగ్ చేయటంతో తన కెరీర్ తొలినాళ్లలోని చాలా విషయాలు మళ్లీ గుర్తు చేసుకోగలిగే అవకాశం వచ్చిందని తెలిపింది. ఈ సినిమాలో తనది ప్రస్తుతం వార్తల్లో వస్తున్న తరహా పాత్ర కాదన్న ఆమె...తన పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పాలేనంది. అలాగే ఈ సినిమాలో తాను చేసిన పాత్ర కోసం కూడా చాలా కేర్ తీసుకుంది శ్రీదేవి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ తో పులి సినిమాలో చాలా గ్రాండ్‌గా కనిపించింది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించగా, ప్రభు, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లోనటించారు. వందకోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో సౌత్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
శ్రీదేవికి కోపమొచ్చింది...
అతిలోక సుందరి శ్రీదేవికి కోపమొచ్చింది. 'పులి' చిత్రంలో తన పాత్ర నిడివిని తగ్గించటంపై ఆమె ఆగ్రహంగా ఉందట. వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా 'పులి'. బాహుబలి తరువాత అదే స్థాయి బడ్జెట్ తో పాటు అదే స్ధాయి సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ హీరో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. పులి సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విజయ్ సరసన శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పులి సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అతిలోక సుందరి శ్రీదేవి. చాలా సంవత్సరాల తరువాత ఈ బ్యూటీ ఓ సౌత్ సినిమాలో నటిస్తుండటం సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా హెల్ప్ అయ్యింది. అయితే శ్రీదేవి పేరును ఇంత భారీగా వాడుకున్న చిత్ర యూనిట్ ...సినిమాలో మాత్రం ఆమె పాత్రను కొద్ది నిమిషాలకే పరిమితం చేశారట. దీంతో చిత్రయూనిట్‌పై శ్రీదేవి ఫైర్ అయినట్లు సమాచారం. చాలా రోజులుపాటు శ్రీదేవి కాల్షీట్లు తీసుకున్న దర్శకుడు చింబుదేవన్ ఆమెపై చాలా సీన్లను షూట్ చేశాడు. సినిమా నిడివి పరంగా కొన్నిసీన్స్ కట్ చేయాల్సి రావడంతో శ్రీదేవి నటించిన చాలా సన్నివేశాలపై కోత పడింది. డబ్బింగ్ సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన శ్రీదేవి పులి యూనిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు వెర్షన్ కోసం డబ్బింగ్ చెప్పేందుకు ఆమె ఏకంగా కోటి రూపాయిలు డిమాండ్ చేసిందట. -
విజయ్ వెనకడుగు జీవీ ముందడుగు
ఇళయదళపతి విజయ్ వెనుకడుగేయడంతో యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ముందుకు దూసుకొస్తున్నారు. ఏమిటీ కాస్త తికమకగా ఉందా? అయితే వివరాల్లోకెళదాం. విజయ్ నటిస్తున్న భారీ సోషల్ ఫాంటసీ కథా చిత్రం పులి. నటి శ్రీదేవి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నడ నటుడు సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శింబుదేవన్ దర్శకత్వంలో పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న పులి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. దీంతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చాలా చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు. అలా మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న చిత్రాల్లో త్రిష ఇల్లన్న నయనతార ఒకటి. కాగా పులి చిత్రం వీఎఫ్ఎక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో చిత్ర విడుదలను అక్టోబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో భలే చాన్స్‌లే లక్కీచాన్స్లే అన్నంత ఆనందంతో త్రిష ఇల్లన్న నయనతార చిత్రం సెప్టెంబర్ 17 విడుదలకు ముస్తాబవుతోందన్నది తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషాయాదవ్,ఆనంది నాయికలుగా నటించారు. నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించిన ఇందులో ఆర్య,ప్రియా ఆనంద్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్యామియో ఫిలింస్ సంస్థ నిర్మించింది. విశేషం ఏమిటంటే అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ చిత్రం విడుదల తేదీ అనూహ్యంగా కొంచెం వెనక్కి వెళ్లడంతో జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన డార్లింగ్ చిత్రం అనూహ్యంగా విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ చిత్రం పులి వెనక్కు వెళ్లడంతో త్రిష ఇల్లన్న నయనతార ముందుగా తెరపైకి రానుంది. మరో విశేషం డార్లింగ్ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియోగ్రీన్ సంస్థనే ఈ త్రిష ఇల్లన్న నయనతార చిత్రాన్ని విడుదల చేయనుంది.మరి డార్లింగ్ మ్యాజిక్ ఈ సారి వర్కౌట్ అవుతుందా?అన్నది వేసి చూడాల్సిందే. -
ఈ వారం you tube హిట్స్
పులి : ట్రైలర్ నిడివి : 1 ని. 53 సె. హిట్స్ : 35,17,901 దీనిని బాహుపులి అనాలి. చిత్రం పేరు ‘పులి’ అయినప్పటికీ బాహుబలి అంత భారీగా తీస్తున్నారు మరి. విజయ్ హీరో. సుదీప్, శ్రతీహాసన్, శ్రీదేవీ కనిపిస్తారు. శ్రీదేవి మరికాస్త డిఫరెంట్ లుక్‌తో దర్శనమిస్తారు. మధ్య యుగాల నాటి భారతీయ కథాంశంతో తయారౌతున్న ‘పులి’లో అన్నీ ‘లార్జర్ దేన్ లైఫ్’ సెట్సే. కాస్ట్యూమ్స్ కూడా అత్యంత ఆడంబరమైనవి, ఖరీదైనవీ. ఫాంటసీని, రియాలిటీని కలిసి చింబు దేవెన్ డెరైక్ట్ చేస్తున్న ఈ తమిళ సినిమాకు మ్యూజిక్ డెరైక్టర్ ఎవరో తెలుసా? దేవిశ్రీ ప్రసాద్. పులి ట్రైలర్‌కు ఇప్పుడు బాహుబలి రేంజ్లో హిట్లు పెరుగుతున్నాయి. కిస్ కిస్కో ప్యార్ కరూ : ట్రైలర్ నిడివి : 3 ని. 07 సె. హిట్స్ : 34,00,461 కలర్స్ టీవీలో ప్రతిరాత్రీ ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ ప్రోగ్రామ్‌తో కడుపుబ్బ నవ్వించే కపిల్ శర్మ తొలిసారిగా బాలీవుడ్ వెండితెరపై నవ్వులు పండించబోతున్నారు. అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహిస్తున్న ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివ్, రామ్, కిషన్ అనే మూడు మారుపేర్లతో కపిల్ శర్మ తన ముగ్గురు భార్యలను మెయింటైన్ చెయ్యడం కథాంశం. అదీ ఒకే అపార్ట్మెంటులో! ఆయన పడిన తంటాలను చూస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాలంటే సెప్టెంబర్ 25 వరకు ఆగాలి. ఆలోపు ఈ ట్రైలర్‌ను చూసి ఆనందించవచ్చు. సింగ్ ఈజ్ బ్లింగ్ : ట్రైలర్ నిడివి 3 ని. 04 సె. హిట్స్ : 24,69,990 పంజాబ్ అంటే గోల్డెన్ టెంపుల్, భాంగ్రా, తండూరీ చికెన్. ఇప్పుడు లేటెస్టుగా పంజాబ్ అంటే రఫ్తార్ సింగ్ కూడా. సింహాన్ని వెంటబెట్టుని కొండలు గుట్టలు ఎక్కి విలేజ్‌లోకి వచ్చే ఆ సింగే.. అక్షయ్ కుమార్. ఈ సీన్లో మీరు ఈయన్ని చూసి తీరాల్సిందే. పదిమందిని ఏకధాటిగా మట్టి కరిపించగల రఫ్తార్ సింగ్... ఐ.క్యూ.లో రెండేళ్ల పిల్లవాడి కంటే తక్కువంటే మీరు నమ్మగలరా? నమ్ముతారో, నవ్వుతారో అదంతా... అక్టోబర్ 2 నుంచి. ఇప్పటికైతే ఈ ట్రైలర్లో నవ్వులే నవ్వులు. ప్రభుదేవా డెరైక్ట్ చేస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ బాలీ వుడ్లో మరో సూపర్ హిట్ కాబోతోందని వినికిడి. రిపోర్టర్ మేక్స్ లిటిల్ బాయ్ క్రయ్ నిడివి : 19 సె. హిట్స్ : 19,99,756 ఈ చిన్నారి పేరు ఆండ్రూ మేషియస్. కిండర్‌గార్టెన్ స్కూల్లో చేర్పించారు. ఫస్ట్ డే. టీవీ రిపోర్టర్ కోర్ట్నీ ఫ్రియల్ వీడిని ఇంటర్య్యూ చేయడానికి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ఎలా సాగిందో చూడండి. ‘ఆండ్రూ నీకెలా అనిపిస్తోంది? ఇక్కడ బాగుందా?’ ‘ఎస్’ అని ఆండ్రూ సమాధానం. ఆ సమాధానంతో పాటు ఓ నవ్వు కూడా. రిపోర్టర్ రెండో ప్రశ్న అడిగింది. ‘ఆండ్రూ... మీ మమ్మీని మిస్ అవుతున్నట్లు అనిపిస్తోందా?’’. ‘నో’ అన్నాడు ఆండ్రూ. కానీ ఆ వెంటనే వాడి ఫీలింగ్ మారిపోవడం మొదలైంది. చిరునవ్వు మాయమైంది. ఏడుపు మొదలు పెట్టేశాడు. తప్పక చూడాల్సిన వీడియో ఇది. జై హింద్ :షార్ట్ ఫిల్మ్ నిడివి : 6 ని. 18 సె. హిట్స్ : 15,67,561 సుజయ్ ఘోష్ సూపర్ హిట్ షార్ట్ ఫిల్మ్ ‘అహల్య’ తర్వాత, మరో షార్ట్ ఫిల్మ్ ‘జై హింద్’ ఇప్పుడు ఆదరణ పొందుతోంది. ‘అక్స్’, ‘శూల్’ చిత్రాల జంట మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్ ఇందులో నటించారు. స్వాతంత్య్రం ఉండడానికీ, లేకపోవడానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించడం కోసం ‘ఓయో రూమ్స్’ కంపెనీ (గొలుసు హోటళ్ల భారతీయ సంస్థ) చిన్న కథతో ఈ చిత్రాన్ని నడిపించింది. రవీనా, మనోజ్ భార్యభర్తలు. బైక్ మీద వెళుతుంటారు. ఒక ఇంగ్లిష్ యువకుడు కారులో వెళుతూ వారి బైక్‌ను డీ కొడతాడు. తర్వాతేం జరుగుతుందన్నదే ఈ ‘జై హింద్’. వన్ డెరైక్షన్ : డ్రాగ్ మీ డౌన్ నిడివి : 3 ని. 11 సె. హిట్స్ : 15,05,241 లండన్‌లోని ఇంగ్లిష్-ఐరిష్ పాప్ బాయ్ బ్యాండ్ విడుదల చేసి ‘డ్రాగ్ మీ డౌన్’ వీడియో ట్రాక్‌కు హిట్ల మీద హిట్లు పడుతున్నాయి. బృంద సభ్యులలో ఒకరైన జేన్మాలిక్... బ్యాండ్ నుండి గత మార్చిలో విడిపోయాక తయారైన ఈ వీడియోలో మిగతా నలుగురు బాయ్స్ కనిపిస్తారు. వీళ్లు హ్యూస్టన్‌లోని నాసా సెంటర్‌కు వెళ్లి ప్రత్యేక అనుమతితో డ్రాగ్ మీ డౌన్‌ను చిత్రీకరించారు. ఆరెంజ్ కలర్ స్పేష్ సూట్లో వ్యోమగాములుగా తయారై, ఒక్కొక్కొరు ఒక్కొక్క విభాగంలో శిక్షణ పొందుతూ పాటపాడుతూ ఉంటారు. యూత్‌ని ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. -
'పులి' కొత్త స్టిల్స్
-
'పులి' ట్రైలర్ వచ్చేసింది...
చెన్నై: అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పులి' చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా ఆడియోకి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తుంది. టీజర్, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయ్ హీరోగా ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన పులి చిత్రంలోని 114 సెకండ్ల నిడివి గల ట్రైలర్‌ను యూట్యూబ్‌లో చిత్రబృందం ఉంచింది. హాలీవుడ్ చిత్రం మెల్ఫిసెంట్లో నటించిన ఏంజెలినా జూలీ పాత్ర తరహాలో పులిలో అతిలోక సుందరి శ్రీదేవి కనిపించింది. ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రాలన్నింటి కంటే పులి కొత్తగా ఉంటుందని ఆ చిత్ర నిర్మాత పి.టి.సెల్వకుమార్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. ఎస్.కె.స్టూడియో పతాకంపై ఆయన నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం పులి. విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి రాణిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శింబుదేవన్ నిర్వహిస్తున్నారు. పులికి సంగీత బాణీలను దేవిశ్రీ ప్రసాద్ అందించారు. -
మా జీవితాలను నాశనం చేయొద్దు: విజయ్
నూతన చిత్రాలను ఇంటర్నెట్లో ప్రచారం చేస్తూ సినిమానే నమ్ముకుని బతుకుతున్న వారి జీవితాలను నాశనం చేయవద్దని ప్రముఖ తమిళ నటుడు విజయ్ విజ్ఞప్తి చేశారు. ఆయన నటించిన 'పులి' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. అలనాటి అందాల తార శ్రీదేవి మహారాణిగా ప్రధాన పాత్రలో నటించడగా, కన్నడ నటుడు సుధీప్ విలన్‌గా నటించారు. పీటీ సెల్వకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియోను విజయ్ సతీమణి సంగీత ఆవిష్కరించగా, ఆయన తల్లి శోభా చంద్రశేఖరన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ చారిత్రక కథా చిత్రంలో నటించాలన్న కోరిక ఈ పులి చిత్రంతో తీరిందన్నారు. నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు పెట్టి చిత్రాలు నిర్మిస్తుంటే కొందరు వాటిని అక్రమంగా ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారని.. దీంతో సినిమావాళ్ల శ్రమ మట్టిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక బిడ్డ సుఖ ప్రసవం అయ్యే ముందే గర్భాన్ని కోసి చంపే చర్యగా ఉందన్నారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నా: చిత్ర పరిశ్రమలో తాను చాలా విమర్శలను, అవమానాలను చవి చూశానన్నారు. బిల్‌గేట్స్‌ను కూడా చిన్నతనంలో స్నేహితులు అమర్యాదగా చూశారని, అలాంటి ఆయన్ని ఇప్పుడు ప్రపంచం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్నారు. తాను, తన అభిమానులు ఇతరులకు జీవితాన్ని ఇవ్వాలనే నిరంతరం భావిస్తామన్నారు. -
కొత్తగా ఇళయదళపతి పులి చిత్రం
ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రాలన్నింటి కంటే పులి కొత్తగా ఉంటుందని ఆ చిత్ర నిర్మాత పి.టి.సెల్వకుమార్ అన్నారు. ఎస్.కె.స్టూడియో పతాకంపై ఈయన నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం పులి. విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్యపాత్ర రాణిగా నటిస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శింబుదేవన్ నిర్వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పులికి సంగీత బాణీలను దేవిశ్రీ ప్రసాద్ అందించారు. చిత్ర ఆడి యో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెల రెం డవ తారీఖున మహాబలిపురంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు బుధవారం చెన్నైలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూ నిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మా త, పి.టి.సెల్వకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రహ్మాండం అని చెప్పుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రంతో తమ పులి చిత్రాన్ని పోల్చంగాని విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నింటికంటే కొత్తగా, భారీగా పులి చిత్రం ఉంటుందన్నారు. విజయ్, శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక, సుదీప్ అంటూ భారీ తారాగణం, ప్రఖ్యాత సాంకేతిక వర్గం పని చేస్తున్న చిత్రం పులి అన్నారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా సంగీత బాణీలు అందించారన్నారు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయని తెలిపారు. ఫాంటసీ అడ్వెంచర్: ఇంతకుముందు చెప్పినట్లుగా పులి ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ ఎంట ర్‌టైనర్ అని దర్శకుడు శింబుదేవన్ తెలిపారు. ఇది రాజారాణిల ఇతివృత్తంతో సాగే కుటుంబ సమేతంగా చూసే జనరంజక కథా చిత్రం అని చెప్పారు. కథ విన్నప్పుడే ఇన్స్పైర్ అయ్యా: దర్శకుడు శింబుదేవన్ కథ చెప్పినప్పుడే ఇన్స్పైర్ అ య్యానని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అ న్నారు. చిత్రంలో చోటు చేసుకున్న ఏండీ ఏండీ లాంటి టీజింగ్ సాంగ్ చేయాలని చాలాకాలం గా ఆశించానన్నారు. అది పులి చిత్రంతో నెరవేరిందన్నారు. తెలుగులో మహేశ్‌బాబు నటిం చిన శ్రీమంతుడు, తమిళంలో విజయ్ చిత్రం పులి ఒకేసారి చేయడం సంతోషంగా ఉందని దేవిశ్రీప్రసాద్ అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
పులి కోసం పాట
శ్రుతీహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు పాడతారు, కవితలు రాస్తారు. అన్నింటికీ మించి ఆమె అద్భుతమైన నటి. సంగీతం మీద ఉన్న మక్కువతో తాను నటిస్తున్న సినిమాల్లోని పాటలు పాడుతుంటారు శ్రుతి. ఆ మధ్య ‘ఆగడు’లో ‘జంక్షన్లో.. జంక్షన్లో..’ పాట పాడారు. అలాగే, హిందీ చిత్రం ‘తేవర్’ కోసం రెండు పాటలు పాడారు. తాజాగా, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ‘పులి’ చిత్రం కోసం శ్రుతి ఓ పాట పాడారు. ఆమెతో కలిసి విజయ్ కూడా ఈ పాట పాడటం విశేషం. రెండేళ్ల క్రితం ‘తుపాకీ’ కోసం ఓ పాట పాడిన విజయ్, మళ్లీ పాడటం ఇప్పుడే. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తాజా పాట రికార్డ్ అయ్యింది. -
ఆ సినిమా సీన్లు లీకయ్యాయని ఫిర్యాదు
చెన్నై: తమిళనాడులో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం 'పులి' సన్నివేశాలు లీకయ్యాయంటూ ఆ చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము వాటిని తొలగించినా ఇంకా ఆన్లైన్లో కనిపిస్తున్నాయని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులకు తెలిపారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయ్ పుట్టిన రోజు సందర్భంగా దానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ఈ టీజర్ విడుదలకు రెండు మూడు రోజుల ముందే ఆన్లైన్లో విడుదలై హల్ చల్ చేసింది. దీంతో తాము ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకొని విడుదల చేయాలనుకున్న సీన్లు ఇలా తమకంటే ముందే ఎవరు ఎలా విడుదల చేశారో అర్థం కాలేదని చెప్పారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలను ముందే లీక్ చేస్తే చిత్ర నిర్మాతలే కాకుండా ఇండస్ట్రీ కూడా కుదేలవుతుందని చిత్ర దర్శకుడు చింబుదేవెన్ అన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. -
ఆయనతో నటించడం తీయని అనుభవం
ఊహించలేనివి జరిగితే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. నటి నందిత పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. అట్టకత్తి చిత్రంతో హీరోయిన్గా తెరపైకి వచ్చిన ఈ ఆరణాల తమిళమ్మాయి తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అయినా ఇప్పటి వరకు యువ హీరోలతోనే జత కడు తూ వచ్చింది. అలాంటి నందితకు అనూహ్యంగా పులి చిత్ర యూనిట్ నుంచి పిలుపొచ్చింది. అది ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశం. కలా! నిజమా! కొంచెం సందిగ్ధం. కొన్ని క్షణాల తరువాత నిజం అన్న విషయాన్ని గ్రహించి పట్టరాని ఆనందంతో మునిగిపోయానంటున్న నందిత చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఆ విషయం కంటే ముందు విజయ్‌తో కలిసి పులి చిత్రంలో నటించిన అనుభవాల్నే చెప్పుకుంటోంది బ్యూటీ. ఎదుర్‌నీచ్చల్ చిత్రంలో నా నటన చూసి విజయ్ మెచ్చుకున్నారు. అలాంటి ఆయనతో కలసి నటిస్తానని కలలోకూడా ఊహించలేదు. పులి చిత్రంలో విజయ్‌తో నటించడానికి కాస్త తడబడ్డాను.ఆయన ఎంతో సౌమ్యంగా, సన్నిహితంగా మెలిగి నా భయాన్ని పోగొట్టారు. విజయ్‌తో కలసి నటించడం తీయని అనుభవం. పులి చిత్రంలో చిన్న పాత్ర అయినా నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అంటున్న నందిత నటిస్తున్న నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు హారర్ చిత్రాలను అంగీకరించారు. -
విజయ్’పులి’రీషూట్ జరుగుతుందా..?
-
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
రైలర్ : పులి నిడివి : 55 సె. హిట్స్ : 33,29,623 తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘పులి’ సినిమాకు నాటి, నేటి సౌందర్య దివ్యతార శ్రీదేవి ప్రధాన ఆకర్షణగా మారారు. ఈ సినిమాలో ఆమె మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మేకప్ కోసం ఆమె ప్రతి రోజు కనీసం అయిదుగంటల సమయాన్ని వెచ్చించారట. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల విడుదలైన ‘పులి’ ట్రైలర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ చిత్రమిది. టాక్ షో: మ్యాజిక్ మైక్-ఎక్స్ఎక్స్ఎల్ నిడివి: 8 ని. 19 సె. హిట్స్: 12,45,352 అమెరికన్ టెలివిజన్ ‘ఎన్బిసి’లో ప్రసారమవుతున్న లేట్-నైట్ టాక్ షో ‘ది టునైట్ షో స్టారింగ్ జిమ్మి ఫాలన్’కు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉంది. ఈవారం లేట్-నైట్ టాక్ షోలో జూలై 1న విడుదల కానున్న ‘మ్యాజిక్ మైక్’ సినిమాపై అతిథి వ్యాఖ్యాతలు మాట్లాడారు. దీనిపై తాజాగా విడుదలైన టాక్-షో వీడియో అదుర్స్ అనిపించింది. ఈ అమెరికన్ కామెడీ-డ్రామాపై పిల్లలు రాసిన స్క్రిప్ట్‌ను అతిథులు చదివి వినిపించారు. వీడియో గేమ్: ది రష్ నిడివి: 4 ని. 1 సె. హిట్స్: 10,26,590 అమెరికాకు చెందిన అటారి గేమ్స్ కంపెనీ వారి ‘రష్’ వీడియో గేమ్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సీరిస్‌లో కొత్తదనం చేర్చడం వల్ల వాటి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. వింత ఆకార ‘జెర్గిలింగ్’ దాడి ఎలా ఉంటుందో, ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఎలా భయపెడుతుందో తాజా వీడియో చూస్తే తెలుస్తుంది. వీడియో గేమ్స్ ఇష్టపడే చిన్నారులైతే ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ట్రైలర్: బజ్రంగి బైజాన్ నిడివి: 1 ని. 33 సె. హిట్స్: 8,63,143 కరీనా అభిమానులు మాత్రమే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం ‘బజ్రంగి బైజాన్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ట్రైలర్. కొందరైతే ట్రైలర్ చూసి కథ ఊహించుకుంటున్నారు. హనుమాన్ వీర భక్తుడు పవన్ పాత్రలో సల్మాన్ నట విన్యాసాలకు ట్రైలర్ అద్దం పట్టేలా ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ రోజు బెబో(కరీనా కపూర్) అందం, అభినయం గురించి ఖాన్ తెగ పొగిడాడు. టీజర్: సుల్తాన్ నిడివి: 33 సె. హిట్స్: 5,75,643 బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా వచ్చే సంవత్సరం విడుదల అవుతోంది. అంతమాత్రాన ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన కబుర్లకేం లోటు లేదు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హర్యానాకు చెందిన మల్లయోధుడిగా సల్మాన్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. షార్ట్ ఫిల్మ్: కన్యాదాన్ నిడివి: 2 ని. 45 సె. హిట్స్: 5,16,455 గ్లామర్ ఒలకబోసే పాత్రల్లో ఎక్కువగా కనిపించే అదితిరావు హైదరి ఈసారి మాత్రం సామాజిక స్పృహ ఉన్న లఘు చిత్రంలో నటించారు. ‘కన్యాదాన్’ అనే ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల అనుబంధం పైనే కాకుండా గృహహింసపై కూడా దృష్టి పెడుతుంది. ‘కన్యాదాన్’లో కూతురుగా ఆదితిరావు, తండ్రిగా దలిప్ తహిల్ నటించారు. ‘ఫాదర్స్ డే’ రోజు విడుదలైన ఈ లఘుచిత్రానికి యూట్యూబ్‌లో హిట్ల మీద హిట్లు పడుతున్నాయి. -
రాజసం చూపిస్తున్న సౌమ్యాదేవి,శివగామి
-
విజయ్ ’పులి’ టీజర్ రిలీజ్
-
పులి తమిళ్ గ్లాడియేటరా?
పులి చిత్రం తమిళ గ్లాడియేటరా? ప్రస్తు తం కోలీవుడ్‌లో సాగుతున్న హాట్ టాఫిక్ ఇదే. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పులి. హన్సిక, శ్రుతిహాసన్ కథానాయికలుగా న టిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి మహారాణి పాత్రను పోషిస్తున్నారు. ఈమె దాదాపు రెండు దశాబ్దాల తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇదే. కా గా కన్నడ చిత్రపరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న సుదీప్ ఈ చిత్రంలో ముఖ్య భూమికను పోషించడం విశేషం. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిటీ సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. షూటింట్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్ట్ర్లు ఇటీవల విడుదలయ్యాయి. కాగా చిత్ర టీజర్‌ను విజయ్ పు ట్టిన రోజు సందర్భంగా విడదల చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు భావించారు. ముందుగానే టీజర్ లీక్ అయ్యి కలకలం పుట్టించింది. వర్జినల్ టీజర్‌ను కూడా విడుదల చేయక తప్పలేదు. ఏదేమయినా పు లి టీజర్‌కు ఇటు చిత్రపరిశ్రమ నుం చి అటు విజయ్ అభిమానుల నుంచి అనూహ్య స్పం దన వస్తోంది. ఇదిలా ఉంటే పులి చిత్ర టీజర్లో విజయ్ కత్తి చేతపట్టి వీర విహారంచేసే దృశ్యాలు, శ్రీదేవి పట్టపురాణి గెటప్‌లో హుందాగా నడిచొచ్చే సన్నివేశం, మధ్య మధ్యలో శ్రుతిహాసన్, హన్సిక అందమైన నగుమోముల దృశ్యాలు చిత్రంపై ఆసక్తిని, అంచనాలను పెంచేలా ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని నిర్మాతలు హాలీవుడ్ చిత్రం గ్లాడియేటర్‌తో పోల్చడం విశేషం. 2000 సంవత్సర ంలో తెరపైకొచ్చిన గ్లాడియేటర్ చిత్రం ఎప్పటికీ సంచలనమే. పులి చిత్రంలోనూ విజయ్ పోరాట దృశ్యాలు ఆ తరహాలో ఉంటాయంటున్నారు చిత్ర నిర్మాతలు. -
లుక్... ఇలా ఉంటుంది!
తమిళ పరిశ్రమలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అని అక్కడివారు చెబుతుంటారు. విజయాల శాతం ఎక్కువ అపజయాల శాతం తక్కువ అన్నట్లుగా ఉంటుంది విజయ్ కెరీర్. ప్రస్తుతం విజయ్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘పులి’. ఎస్.కె.టి. స్టూడియో పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో పీటీ సెల్వకుమార్, శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ శ్రీదేవి ఈ చిత్రానికే పచ్చజెండా ఊపారు. ఈ చిత్రకథ, పాత్ర ఆమెకు అంతగా నచ్చాయి. ఇందులో శ్రుతీహాసన్, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది యాక్షన్ అడ్వంచర్ ఫ్యాంటసీ మూవీ. ఈ చిత్రంలో విజయ్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆయన అభిమానులు ఉవ్విళ్లూరారు. ‘నా లుక్ ఇలా ఉంటుంది’ అంటూ ట్విట్టర్లో ఫస్ట్ లుక్‌ని పోస్ట్ చేశారు విజయ్. సోమవారం విజయ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ని, టీజర్‌ను విడుదల చేశారు. -
ఈసారి అభిమానుల మధ్య లేనట్లే!
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈసారి అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి సరదాగా లండన్‌లో గడుపుతున్నారు. ఈ నెల 26 తర్వాత గాని వచ్చే అవకాశం లేదు. కానీ, ఈ నెల 22నే ఆయన పుట్టిన రోజు. ప్రతి ఏటా అభిమానుల మధ్య పుట్టిన రోజు జరుపుకుంటాడు. ఆ సందర్భంగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అయితే, ఎప్పటిలాగే తమ అభిమాన నటుడు ఉంటాడని భావించిన ఫ్యాన్స్ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కసారిగా ఆయన ఈసారి వేడుకల్లో పాల్గొనడం లేదని, రావడం లేదని తెలియడంతో వారి ఆనందం ఆవిరైంది. తాము నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలన్నింటిని నిలిపివేశారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన పులి చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానుంది. -
ఇక్కడ చాలా హాట్ గురూ!
వేసవికాలంలో ఏదైనా చల్లని ప్రాంతానికి వెళితే చాలా హాయిగా ఉంటుంది. అందుకు భిన్నంగా హాట్ హాట్‌గా ఉండే ప్రదేశాలకు వెళితే, పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. ప్రస్తుతం శ్రుతీహాసన్ పరిస్థితి అదే. హాట్‌గా ఉన్న హైదరాబాద్, చెన్నై నుంచి ఆమె క్రాబీ వెళ్లారు. ఈ ఊరి పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారు? ఇది మన దేశానికి చెందిన ఊరు కాదు. థాయ్‌ల్యాండ్‌లో ఉంది. తమిళ చిత్రం ‘పులి’ షూటింగ్ కోసం శ్రుతీహాసన్ అక్కడికెళ్లారు. ఇక్కడ చాలా హాట్‌గా ఉందని ట్విట్టర్లో పెట్టారామె. ఎంత వేడిగా ఉన్నా ఏమీ అనిపించడంలేదనీ, ఎందుకంటే లొకేషన్ చాలా అందంగా ఉందనీ ఆమె పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యాన్ని దేనితోనూ వెలకట్టలేమని ఈ సందర్భంగా శ్రుతీహాసన్ అన్నారు. -
అభిమానుల సంతోషాన్నే కోరుకుంటా
అందం చూడవయా ఆనందించవయా అన్నారో కవి. అందానికి అంత ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పాలంటే స్త్రీలకు అందం ఒక ఆయుధం అనవచ్చు. సినీ రంగంలో అలాంటి అందాలతో చాలామంది నెగ్గుకొస్తున్నారు. అలాంటి వారిలో నటి హన్సిక ఒకరు. అయితే ఆమెలో అందం, అభినయం పోటీపడతాయిలెండి. అయినా హన్సిక అందానికి ప్రాముఖ్యతనిస్తానంటున్నారు. ఆమె నుంచి అభిమానులు ఎక్కువ కోరుకునేది అదేనట. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ తెలుపుతూ అందానికి మెరుగు పరచుకోవడం ఒక కళ అన్నారు. అలాంటి కళ తనలో ఉండడం గర్వంగా భావిస్తానన్నారు. మరో విషయం ఏమిటంటే తన ఏడుపు నటన తన అభిమానులకు నచ్చదన్నారు. తన అందమైన జాలీ నటననే వారు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే తన అందాన్ని మెరుగుపరచుకుంటున్నానని చెప్పారు. తన అందాన్ని అభిమానులు పొగుడుతుంటే మనసు సంతోషంతో పరవశం చెందుతుందన్నారు. తాను తన అభిమానులు సంతోషాన్నే కోరుకుంటానని చెప్పారు. చిన్నతనం నుంచే కుటుంబ సభ్యులు తనను మహారాణిగా చూసుకున్నారని షూటింగ్‌లకు వెళ్లినా అలాంటి గౌరవమే లభించడం తన అదృష్టం అన్నారు. హన్సిక ప్రస్తుతం పులి చిత్రంలో యువరాణిగా నటిస్తున్నారన్నది గమనార్హం. -
రజనీ సినిమా టైటిల్‌తో మరోసారి విశాల్
తమిళసినిమా: నటుడు విశాల్ మరోసారి రజనీకాంత్ టైటిల్‌తో తెరపైకి రానున్నారు. పాండియనాడు, శివప్పు మనిదన్, పూజై చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ సాధించిన విశాల్ తాజాగా సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన పాండియనాడు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత నటించిన చిత్రం నాన్ శివపుప మనిదన్ చిత్రంలో నటించారు. ఇదే టైటిల్‌తో ఇంతకుముందు రజనీకాంత్ నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా నటిస్తున్న చిత్రానికి 1983లో రజనీకాంత్ నటించిన 'పులి' టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. ఈ వేందర్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను ఏప్రిల్ మూడు నుంచి నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేల్‌రాజా ఛాయాగ్రహణను, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
శ్రీదేవి లిప్‌లాక్
పులి చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి లిప్‌లాక్ సన్నివేశాలు చూడవచ్చనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పులి. పలు ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ చిత్రం గురించి ఇంతవరకు అధికారికంగా ఒక్క విషయం గురించి కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే అనధికారికంగా మాత్రం రోజుకో అంశం వార్తల్లో ఉంది. పులి సోషియా ఫాంటసీ కథా చిత్రం అని, ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అతిలోకసుందరి శ్రీదేవి రాణిగా ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూతురు యువరాణిగా హన్సిక, మరో నాయకి శృతిహాసన్ నటిస్తున్నారు. వీరిద్దరూ నాయికల కంటే శ్రీదేవి అధిక పారితోషికం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు జంటగా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ రాజుగా నటిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వీరిద్దరి మధ్య లిప్టు లిప్ చుంభనాల దృశ్యాలు కూడా యూత్‌ను కేక పుట్టిస్తాయనేది తాజాగా సమాచారం. సీనియర్ నటుడు ప్రభు పులి చిత్రంలో కీలక భూమికను పోషిస్తున్నారని తెలిసింది. ఇందులో ఆయన విజయ్‌కు గురువుగా నటిస్తున్నారట. ప్రస్తుతం చిత్రం కేరళలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. -
తమిళ పులిలో 'శ్రీదేవి'
ముంబై : పులి సినిమా షూటింగ్‌ని మంచి ఎంజాయి చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీదేవి తెలిపారు. చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక బృందంతో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీదేవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ శ్రీదేవి తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. అలాగే శృతీ హాసన్, సుదీప్ కూడా నటిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల వయస్సులో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఇంగ్లీషు వింగ్లీషు చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
జీ... ఇక ఉర్దూ మేడ్ ఈజీ..!
ప్రయత్నం మనిషికీ మనిషికీ మధ్య ఏకైక వారధి భాష. ప్రతి భాషకీ ఓ ప్రత్యేకత ఉంటుంది. చరిత్ర ఉంటుంది. ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో వెలుగులీనుతున్న ఉర్దూకున్న చరిత్ర గురించి, సుసంపన్నమైన ఉర్దూ సాహిత్యం గురించి చాలామందికి తెలుసు. అయితే పాలకుల నిర్లక్ష్యం, కరవైన ప్రోత్సాహం వల్ల ఆ భాష వచ్చినవారి సంఖ్య ఒకప్పటితో పోలిస్తే తగ్గుతోంది. ఆసక్తి ఉన్నా నేర్చుకునే అవకాశాలూ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఉర్దూభాషా ప్రేమికులకోసం ప్రత్యేకంగా ఉర్దూ భాషను నేర్పిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు ప్రొఫెసర్ ఖాలిద్ సయీద్. కొద్దిరోజుల్లోనే చాలా సరళంగా, సులభంగా ఆయన ఉర్దూ నేర్పే పద్ధతి, ఆయన దగ్గర భాష నేర్చుకుంటున్న విద్యార్థుల వివరాలు చూస్తే ఆసక్తిగా అనిపిస్తాయి. ‘‘ఉర్దూ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే... ముందు ఆ భాష నేర్చుకోవాలి కదా! తెలుగు మొదటి భాషగా నేర్చుకున్నాను, హిందీ రెండో భాషగా నేర్చుకున్నాను, ఇంగ్లీషుని ప్రపంచభాషగా నేర్చుకున్నాను. మరి ఉర్దూ ఎలా నేర్చుకోవాలి? దానికోసం ఉర్దూ యూనివర్శిటీలో చేరలేం కదా! ఖాలిద్గారి ఉర్దూ పాఠాల గురించి తెలియగానే వెంటనే వచ్చి చేరాను. నా చిరకాల కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉర్దూ గజల్స్‌లోని సాహిత్యం తెలుసుకోవాలన్నది నా ఆశ’’. అరవై ఐదేళ్ల మహ్మద్ షాకీర్ హుస్సేన్ చెప్పిన మాటలివి. పీజీ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈ పెద్దాయన ఆరునెలల క్రితం ఉర్దూ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బస్టాప్‌కి ఎదురుగా ఉన్న హజ్‌హౌస్‌లోని ఏడవ అంతస్థులో ఆయనలాంటి ఉర్దూ ప్రేమికులు చాలామంది కనిపిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ వారికి ఉర్దూ భాషను నేర్పిస్తున్నారు ఖాలిద్ సయీద్. ‘‘ఉర్దూ భాష నేర్చుకోవాలనే కోరిక చాలామందిలో ఉంది. ఉర్దూ అనగానే అది ఒక వర్గానికి చెందిన భాషగా అపోహ ఉంది. నిజానికి ఇది హిందుస్థానీ భాష. పదమూడు, పద్నాలుగవ శతాబ్దాల్లో రాసిన ఉర్దూ గజల్స్‌ని చదవాలని, అందులోని సాహిత్యాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారంతా నా దగ్గర ఉర్దూ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వివిధ రంగాల్లో ఉన్న చాలామంది నాతో ఉర్దూపై తమకున్న ప్రేమను చాలా సందర్భాల్లో చెప్పేవారు. అలాంటివారికి ఎలాగైనా ఉర్దూని నేర్పాలనుకుని ఇది మొదలుపెట్టాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ ఖాలిద్. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 58 ఏళ్ల ఖాలిద్ ఉర్దూభాషా ప్రేమికుల మనసెరిగి ఐదేళ్ల నుంచి తన విశ్రాంతి సమయాన్ని ఉర్దూ భాషా బోధనకు కేటాయిస్తున్నారు. ఆరు నెలలలో... ఆయన అనుసరిస్తున్న విధానంలో ఉర్దూ చదవడం, రాయడం రావడానికి కేవలం ఆరునెలల సమయం చాలు. వారానికి ఒకరోజు చొప్పున పాతిక రోజుల్లో కోర్సు మొత్తం పూర్తవుతుంది. ‘లెర్న్ ఉర్దూ’ పేరుతో ఆయన ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ఇందులో 12 యూనిట్లు, 24 పాఠాలు ఉంటాయి. ఉర్దూ గజల్స్ అర్థం చేసుకోవాలంటే వాటికి ప్రత్యేక తరగతులుంటాయి. ఇప్పటివరకూ నాలుగు బ్యాచ్‌లకు భాష నేర్పిన ఖాలిద్ తన విద్యార్థులంతా వయసులో తనకన్నా పెద్దవాళ్లే అవడం తనకెంతో గర్వంగా ఉందంటున్నారు. నిజమే... సగంమందికిపైగా పదవీ విరమణ పొందినవారే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హెడ్ మాస్టార్లు, లెక్చరర్లు, కంపెనీ డెరైక్టర్లు... వంటి పెద్దవాళ్లు ఇక్కడ ఉర్దూ నేర్చుకుంటున్నారు. త్వరలోనే సాహిత్యబోధన ప్రొఫెసర్ ఖాలిద్ దగ్గర ఉర్దూ భాష నేర్చుకుంటున్నవారిలో ఎనభై శాతంమంది ముస్లిమేతరులే. కస్తూర్బా కాలేజిలో సంస్కృతం లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన డాక్టర్ శశిరేఖ 77 ఏళ్ల వయసులో ఇక్కడ ఉర్దూ నేర్చుకుంటున్నారు. ‘‘నాకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, హిందీ, గుజరాతీ భాషలు వచ్చు. ఉర్దూ నేర్చుకోవడం కుదరలేదు. ఉర్దూ సంప్రదాయ భాష మాత్రమే కాదు సంపన్న భాష కూడా. ఆయన తయారుచేసిన పాఠ్యపుస్తకాలు చాలా సులువుగా ఉన్నాయి. అక్షరాలను రాయడం నుంచి పలకడం వరకూ ఆయన చెప్పే విధానం కూడా ఆసక్తి ఉంది’’ అని చెప్పారామె. ఉర్దూ భాషా ప్రేమికులకు ప్రొఫెసర్ ఖాలిద్ చేస్తున్న సేవ చాలా గొప్పది మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయేది కూడా. అలాగంటే... ఖాలిద్ ఒప్పుకోరు. ‘భాషను నేర్చుకోవడమే గొప్ప సేవ!’ అంటారు. నెలకు వంద రూపాయల రుసుము మాత్రమే తీసుకుంటున్న ఖాలిద్ భవిష్యత్తులో ఉర్దూ సాహిత్యాన్ని కూడా నలుగురికీ బోధించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆయన తయారుచేసిన పాఠ్యపుస్తకంలో రాసిన కవితలు, కథలు అక్కడి విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఈ ప్రొఫెసర్‌గారి ఆశయం నెరవేరాలని, ఉర్దూ భాష ప్రేమికుల సంఖ్య మరింత పెరగాలని కోరుకుందాం. - భువనేశ్వరి ఫొటోలు: మోహన్ పదమూడు, పద్నాలుగవ శతాబ్దాల్లో రాసిన ఉర్దూ గజల్స్‌ని చదవాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారంతా నా దగ్గర సరళమైన పద్ధతిలో ఉర్దూ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. - ఖాలిద్ సయీద్