ఆయనతో నటించడం తీయని అనుభవం | Sweet experience of acting with Vijay ilayathalapathy | Sakshi
Sakshi News home page

ఆయనతో నటించడం తీయని అనుభవం

Published Fri, Jul 3 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

ఆయనతో నటించడం తీయని అనుభవం

ఆయనతో నటించడం తీయని అనుభవం

ఊహించలేనివి జరిగితే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. నటి నందిత పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. అట్టకత్తి చిత్రంతో హీరోయిన్‌గా తెరపైకి వచ్చిన ఈ ఆరణాల తమిళమ్మాయి తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అయినా ఇప్పటి వరకు యువ హీరోలతోనే జత కడు తూ వచ్చింది. అలాంటి నందితకు అనూహ్యంగా పులి చిత్ర యూనిట్ నుంచి పిలుపొచ్చింది. అది ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశం. కలా! నిజమా! కొంచెం సందిగ్ధం. కొన్ని క్షణాల తరువాత నిజం అన్న విషయాన్ని గ్రహించి పట్టరాని ఆనందంతో మునిగిపోయానంటున్న నందిత చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఆ విషయం కంటే ముందు విజయ్‌తో కలిసి పులి చిత్రంలో నటించిన అనుభవాల్నే చెప్పుకుంటోంది బ్యూటీ.

 ఎదుర్‌నీచ్చల్ చిత్రంలో నా నటన చూసి విజయ్ మెచ్చుకున్నారు. అలాంటి ఆయనతో కలసి నటిస్తానని కలలోకూడా ఊహించలేదు. పులి చిత్రంలో విజయ్‌తో నటించడానికి కాస్త తడబడ్డాను.ఆయన ఎంతో సౌమ్యంగా, సన్నిహితంగా మెలిగి నా భయాన్ని పోగొట్టారు. విజయ్‌తో కలసి నటించడం తీయని అనుభవం. పులి చిత్రంలో చిన్న పాత్ర అయినా నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అంటున్న నందిత నటిస్తున్న నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు హారర్ చిత్రాలను అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement