ఈ వారం you tube హిట్స్ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం you tube హిట్స్

Published Sun, Aug 23 2015 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

ఈ వారం you tube హిట్స్

ఈ వారం you tube హిట్స్

పులి : ట్రైలర్
నిడివి : 1 ని. 53 సె.
హిట్స్ : 35,17,901

దీనిని బాహుపులి అనాలి. చిత్రం పేరు ‘పులి’ అయినప్పటికీ బాహుబలి అంత భారీగా తీస్తున్నారు మరి. విజయ్ హీరో. సుదీప్, శ్రతీహాసన్, శ్రీదేవీ కనిపిస్తారు. శ్రీదేవి మరికాస్త డిఫరెంట్ లుక్‌తో దర్శనమిస్తారు. మధ్య యుగాల నాటి భారతీయ కథాంశంతో తయారౌతున్న ‘పులి’లో అన్నీ ‘లార్జర్ దేన్ లైఫ్’ సెట్సే. కాస్ట్యూమ్స్ కూడా అత్యంత ఆడంబరమైనవి, ఖరీదైనవీ. ఫాంటసీని, రియాలిటీని కలిసి చింబు దేవెన్ డెరైక్ట్ చేస్తున్న ఈ తమిళ సినిమాకు మ్యూజిక్ డెరైక్టర్ ఎవరో తెలుసా? దేవిశ్రీ ప్రసాద్. పులి ట్రైలర్‌కు ఇప్పుడు బాహుబలి రేంజ్‌లో హిట్లు పెరుగుతున్నాయి.
 
కిస్ కిస్కో ప్యార్ కరూ : ట్రైలర్
నిడివి : 3 ని. 07 సె.
హిట్స్ : 34,00,461

 కలర్స్ టీవీలో ప్రతిరాత్రీ ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ ప్రోగ్రామ్‌తో కడుపుబ్బ నవ్వించే కపిల్ శర్మ తొలిసారిగా బాలీవుడ్ వెండితెరపై నవ్వులు పండించబోతున్నారు. అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహిస్తున్న ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివ్, రామ్, కిషన్ అనే మూడు మారుపేర్లతో కపిల్ శర్మ తన ముగ్గురు భార్యలను మెయింటైన్ చెయ్యడం కథాంశం. అదీ ఒకే అపార్ట్‌మెంటులో! ఆయన పడిన తంటాలను చూస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాలంటే సెప్టెంబర్ 25 వరకు ఆగాలి. ఆలోపు ఈ ట్రైలర్‌ను చూసి ఆనందించవచ్చు.
 
 సింగ్ ఈజ్ బ్లింగ్ : ట్రైలర్
నిడివి 3 ని. 04 సె.
హిట్స్ : 24,69,990

 పంజాబ్ అంటే గోల్డెన్ టెంపుల్, భాంగ్రా, తండూరీ చికెన్. ఇప్పుడు లేటెస్టుగా పంజాబ్ అంటే రఫ్తార్ సింగ్ కూడా. సింహాన్ని వెంటబెట్టుని కొండలు గుట్టలు ఎక్కి విలేజ్‌లోకి వచ్చే ఆ సింగే.. అక్షయ్ కుమార్. ఈ సీన్‌లో మీరు ఈయన్ని చూసి తీరాల్సిందే. పదిమందిని ఏకధాటిగా మట్టి కరిపించగల రఫ్తార్ సింగ్... ఐ.క్యూ.లో రెండేళ్ల పిల్లవాడి కంటే తక్కువంటే మీరు నమ్మగలరా? నమ్ముతారో, నవ్వుతారో అదంతా... అక్టోబర్ 2 నుంచి. ఇప్పటికైతే ఈ ట్రైలర్‌లో నవ్వులే నవ్వులు. ప్రభుదేవా డెరైక్ట్ చేస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ బాలీ వుడ్‌లో మరో సూపర్ హిట్ కాబోతోందని వినికిడి.
 
రిపోర్టర్ మేక్స్ లిటిల్ బాయ్ క్రయ్
నిడివి : 19 సె.
హిట్స్ : 19,99,756

 ఈ చిన్నారి పేరు ఆండ్రూ మేషియస్. కిండర్‌గార్టెన్ స్కూల్‌లో చేర్పించారు. ఫస్ట్ డే. టీవీ రిపోర్టర్ కోర్ట్‌నీ ఫ్రియల్ వీడిని ఇంటర్య్యూ చేయడానికి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ఎలా సాగిందో చూడండి. ‘ఆండ్రూ నీకెలా అనిపిస్తోంది? ఇక్కడ బాగుందా?’ ‘ఎస్’ అని ఆండ్రూ సమాధానం. ఆ సమాధానంతో పాటు ఓ నవ్వు కూడా. రిపోర్టర్ రెండో ప్రశ్న అడిగింది. ‘ఆండ్రూ... మీ మమ్మీని మిస్ అవుతున్నట్లు అనిపిస్తోందా?’’. ‘నో’ అన్నాడు ఆండ్రూ. కానీ ఆ వెంటనే వాడి ఫీలింగ్ మారిపోవడం మొదలైంది. చిరునవ్వు మాయమైంది. ఏడుపు మొదలు పెట్టేశాడు. తప్పక చూడాల్సిన వీడియో ఇది.
 
 జై హింద్ :షార్ట్ ఫిల్మ్
నిడివి : 6 ని. 18 సె.
హిట్స్ : 15,67,561

 సుజయ్ ఘోష్ సూపర్ హిట్ షార్ట్ ఫిల్మ్ ‘అహల్య’ తర్వాత, మరో షార్ట్ ఫిల్మ్ ‘జై హింద్’ ఇప్పుడు ఆదరణ పొందుతోంది. ‘అక్స్’, ‘శూల్’ చిత్రాల జంట మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్ ఇందులో నటించారు. స్వాతంత్య్రం ఉండడానికీ, లేకపోవడానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించడం కోసం ‘ఓయో రూమ్స్’ కంపెనీ (గొలుసు హోటళ్ల భారతీయ సంస్థ) చిన్న కథతో ఈ చిత్రాన్ని నడిపించింది. రవీనా, మనోజ్ భార్యభర్తలు. బైక్ మీద వెళుతుంటారు. ఒక ఇంగ్లిష్ యువకుడు కారులో వెళుతూ వారి బైక్‌ను డీ కొడతాడు. తర్వాతేం జరుగుతుందన్నదే ఈ ‘జై హింద్’.
 
వన్ డెరైక్షన్ :
డ్రాగ్ మీ డౌన్
నిడివి : 3 ని. 11 సె.
హిట్స్ : 15,05,241

 లండన్‌లోని ఇంగ్లిష్-ఐరిష్ పాప్ బాయ్ బ్యాండ్ విడుదల చేసి ‘డ్రాగ్ మీ డౌన్’ వీడియో ట్రాక్‌కు హిట్‌ల మీద హిట్‌లు పడుతున్నాయి. బృంద సభ్యులలో ఒకరైన జేన్‌మాలిక్... బ్యాండ్ నుండి గత మార్చిలో విడిపోయాక తయారైన ఈ వీడియోలో మిగతా నలుగురు బాయ్స్ కనిపిస్తారు. వీళ్లు  హ్యూస్టన్‌లోని నాసా సెంటర్‌కు వెళ్లి ప్రత్యేక అనుమతితో డ్రాగ్ మీ డౌన్‌ను చిత్రీకరించారు. ఆరెంజ్ కలర్ స్పేష్ సూట్‌లో వ్యోమగాములుగా తయారై, ఒక్కొక్కొరు ఒక్కొక్క విభాగంలో శిక్షణ పొందుతూ పాటపాడుతూ ఉంటారు. యూత్‌ని ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement