పిల్లల కోసం 'పులి' | vijay does puli for kids | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం 'పులి'

Published Tue, Sep 29 2015 12:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

పిల్లల కోసం 'పులి'

పిల్లల కోసం 'పులి'

తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా 'పులి' విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. భారీ బడ్జెట్ తో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ను తొలుత తాను ఒప్పుకోలేదని, అయితే తన పిల్లలు పట్టుబట్టడంతో ఓకే చేయక తప్పలేదన్నాడు విజయ్. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి పులి ప్రివ్యూ చూసిన విజయ్ ఈ కామెంట్స్ చేశాడు.

ఇంత భారీ బడ్జెట్ తో విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఓ కామెడీ సినిమా చేయటం రిస్క్ అని తెలిసినా కథ మీద నమ్మకంతో ఈ సినిమా అంగీకరించాడు విజయ్. తను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందన్న  ఇళయదళపతి 'పులి' విజయం మీద ధీమాగా ఉన్నాడు.

అక్టోబర్ 1న తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్తో పాటు శ్రీదేవి, సుదీప్, శృతిహాసన్, హన్సిక, ప్రభు లాంటి టాప్ స్టార్స్ నటించారు. వందకోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement