Sruthi hasan
-
ఆద్య ఆన్ సెట్
‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల సక్సెస్ జోష్‌తో రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇటీవలే ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన ఈ బ్యూటీ తాజాగా ‘సలార్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ‘‘నాకు ఎంతో ఇష్టమైన ‘సలార్’ సెట్స్‌లో ఉన్నాను. మంచి యూనిట్‌తో, మంచి మనుషులతో వర్క్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆద్య పాత్రలో కనిపిస్తారు శ్రుతి. ప్రస్తుతం ప్రభాస్, శ్రుతీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. కాగా ‘సలార్’ రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. -
‘నేను ఎక్కడైనా డాన్స్ చేయగలను’
నటిగా, గాయనిగా దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతీహాసన్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ శృతీ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల శృతీ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్స్ (కోటీ నలభై లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారు. తాజాగా శృతీ అండర్ వాటర్ ఫొటో షూట్‌కు సంబంధించిన త్రోబ్యాక్(పాత) ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నేను ఎక్కడైనా డాన్స్ చేయగలను. నేను కలగన్న ప్రదేశానికి వెళ్లగలను’ అని ఆమె ఫొటోలకు కామెంట్ జతచేశారు. ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో శృతీహాసన్ ఎరుపు రంగు దుస్తుల్లో చేతికి బ్రాస్లెట్ ధరించి కనిపిస్తున్నారు. ఇక నీటి లోపల తాను డాన్స్ చేస్తూ పలు పోజులతో ఫొటో షూట్‌ను ఎంజాయ్ చేసినట్లు పేర్కొంది. (కొత్త పుస్తకం చదువుతున్న మహేశ్!) View this post on Instagram Reaching for tomorrow 🖤 A post shared by @ shrutzhaasan on Jun 26, 2020 at 11:24pm PDT ఇక సినిమా విషయాలకు వస్తే.. రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇక లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. (సినిమాలపై దావూద్ ప్రభావం) View this post on Instagram I can dance anywhere 🖤 A post shared by @ shrutzhaasan on Jun 26, 2020 at 11:24pm PDT -
ఆ హైదరాబాద్ వంటకం ఎంతో ఇష్టం
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కొంతమంది వంట చేయటం నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నారు. మరికొంత మంది రకరకాల వెరైటీ వంటలు ట్రై చేస్తూ కుటుంబ సభ్యులను సంతోషపెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్ శృతి హాసన్ ముందు వరసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ తెలుగు వంటకం ‘మామిడికాయ పప్పు’ను చేశారు. (తారక్‌కు బిగ్‌బాస్ హౌస్మేట్స్ స్పెషల్ విషెస్..) View this post on Instagram The EASIEST mango pappu!! I love this so much I had it for the first time when I visited Hyderabad as a kid and feel in love ❤️ it’s super easy to make hits make sure the raw mango turns translucent so you know it’s done ! Add spice according to your Taste but I keep it mild so I can proper taste the mango :) yummy 😋 A post shared by @ shrutzhaasan on May 19, 2020 at 2:28am PDT అదేవిధంగా తాను స్వయంగా చేసిన ‘మామిడికాయ పప్పు’ వీడియాను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు శృతి హాసన్. ‘చాలా సులభంగా చేసే మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనంలో హైదరాబాద్‌కి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ పప్పును తిన్నాను. ఇక ఈ వంట చేయటం చాలా సులభం. మీ రుచికి తగినట్లు మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా తక్కువగా మసాలాను వేస్తాను. ఎందుకంటే సహజమైన మామిడికాయ రుచిని ఆస్వాదించాలి’ అంటూ కామెంట్ జత చేశారు శృతి హాసన్. ఇక తాను లాక్డౌన్ సమయంలో సెల్ఫ్ క్వారంటైన్లో భాగంగా ఇంటికే పరిమితయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
బాధ్యతగా ఉండండి
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం అందరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొందరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూసి ఆవేదన వ్యక్తం చేశారు శ్రుతీహాసన్. ఈ విషయం గురించి శ్రుతి మాట్లాడుతూ – ‘‘సామాజిక దూరం పాటించాల్సిన విషయం గురించి చెబుతున్న ఓ వ్యక్తి వీడియోను నేను సోషల్ మీడియాలో చూశాను. అతని చుట్టూ మరో ఐదుగురు ఉన్నారు. సామాజిక దూరాన్ని పాటించడం అంటే ఇదేనా? అనిపించింది. ఇలా చేయడం సరికాదు. అలాగే నాతో మాట్లాడిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని మళ్లీ కలుసుకోవాలని ఉందని చెప్పాడు. ప్రభుత్వం సామాజిక దూరం గురించి పదే పదే చెబుతున్నప్పడు మన స్నేహితులను మళ్లీ కలుసుకోవాలనే ఆలోచనలు సరైనవి కావు. అందరూ బాధ్యతగా ఉండాల్సిన తరుణం ఇది. ప్రస్తుతం ఇంట్లో నేను, క్లారా (శ్రుతీ పెంచుకుంటున్న పిల్లి పిల్ల) మాత్రమే ఉన్నాం. మా ఫ్యామిలీ సభ్యులు కూడా స్వీయగృహనిర్భందంలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. తెలుగులో రవితేజ ‘క్రాక్’, తమిళంలో విజయ్‌సేతుపతి ‘లాభం’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు శ్రుతీహాసన్. -
జాతరలో క్రాక్
రికార్డింగ్ డ్యాన్స్‌లు, పాటలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. ఓ గుడికి సంబంధించిన జాతరతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంది. అప్పుడు అక్కడికి పోలీస్ డ్రెస్‌లో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. నెక్ట్స్ సీన్‌ను వెండితెరపై చూడాల్సిందే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్న చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రధారి. ఇందులో పోలీసాఫీర్‌గా నటిస్తున్నారు రవితేజ. ఈ నెల 21న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రస్తుతం జాతరకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రవితేజ, వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి సహ – నిర్మాత. ‘క్రాక్’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రవితేజ క్రాక్
‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి హైదరాబాద్‌లో గురువారం కొబ్బరికాయ కొట్టారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘బలుపు’ చిత్రం తర్వాత రవితేజ సరసన మరోసారి ‘క్రాక్’లో హీరోయిన్గా నటిస్తున్నారు శృతీహాసన్. ముహూర్తపు సన్నివేశాకి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘క్రాక్’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, ఎన్.వి.ప్రసాద్, సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, బీవీఎస్ఎన్ ప్రసాద్, రామ్ తాళ్లూరి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దాము తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: జి.కె.విష్ణు, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
‘కారుణ్య’ చిన్నారి శృతిహాసన్ మృతి
చిత్తూరు, కురబలకోట: న్యూరో పైబ్రోమా అనే వ్యాధితో బాధపడుతూ ఇన్నాళ్లు మృత్యువుతో పోరాడిన చిన్నారి శృతి హాసన్ ఓడిపోయింది. బిడ్డను రక్షించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తూ ప్రాణాలు విడిచింది. వివరాలు.. మండలంలోని తెట్టు గ్రామం పుల్లగూరవాండ్లపల్లెకు చెందిన సునీత, రెడ్డెప్పల కుమార్తె శృతిహాసన్ మూడేళ్ల వయసు నుంచి న్యూరోపైబ్రోమాతో బాధపడుతోంది. వ్యాధితో నరకయాతన పడుతు న్న చిన్నారికి తల్లిదండ్రులు తిరుపతి, బెంగళూరుల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. అయినా ఫలితం కానరాలేదు. ఈ నేపథ్యంలో బిడ్డ కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో అయినా ప్రభుత్వం ఆదుకుని చికిత్సలు చేయిస్తుందని వారు ఆశలు పెట్టుకున్నారు. అయినా స్పందన కానరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో ఉన్న చిన్నారి ఆదివారం ప్రాణాలు విడించింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. శృతిహాసన్ మృతదేహం -
రాజీ పడితే మంచిది!
ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. చటుక్కున తినేయాలి.. చిటుక్కున పనుల్లో పడిపోవాలి. అంతా వేగం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా కొంతమంది ఉంటున్నారు. త్వరగా స్నేహం చేయడం... త్వరగా విడిపోవడం, ఈజీగా లవ్‌లో పడటం... అంతే సులువుగా విడిపోవడం, ఇష్టపడి పెళ్లాడటం... చిన్ని చిన్ని మనస్పర్థలకే విడిపోవడం... మొత్తం మీద బంధాలకు విలువ లేకుండాపోతోంది. బంధాల గురించి ఇంత లెక్చరర్ దేనికీ అనుకుంటున్నారా? ‘రిలేషన్షిప్స్’ గురించి శ్రుతీహాసన్ ఓ మంచి మాట చెప్పారు. అందుకే అన్నమాట. శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అని అన్నారు. -
అమ్మడు లెక్చరర్ , బాబు స్టూడెంట్
చెన్నై : రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలు భారీ విజయంతో జోరుమీదున్న భామ శ్రుతి హాసన్. దీంతో మరో తెలుగు సినిమా పాత్ర కోసం అపుడే కసరత్తు మొదలుపెట్టిందిట. శ్రీమంతుడు సినిమా తరువాత తెలుగులో చేస్తున్న ఈ మలయాళ రీమేక్ లో శ్రుతి... లెక్చరర్ పాత్ర పర్ఫెక్షన్ కోసం తెగ తాపత్రయపడుతోందిట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసింది. 'మంజు' అనే టైటిల్ దాదాపు ఖరారైన ఈ చిత్రంలో శ్రుతి లెక్చరర్ పాత్రను పోషించబోతోంది. 'సాయి పల్లవి' అనే క్యారెక్టర్‌కు స్పెషల్ మేకోవర్ ప్లాన్ చేస్తోందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీమంతుడు తరువాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌కు జోడిగా అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నాగ చైతన్య స్టూడెంట్‌గా శ్రుతి లెక్చరర్‌గా కన్పించనున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అటు మలయాళ ' ప్రేమమ్'లో సెకండ్ హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా యాక్ట్ చేస్తోంది. -
పిల్లల కోసం 'పులి'
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా 'పులి' విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. భారీ బడ్జెట్ తో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ను తొలుత తాను ఒప్పుకోలేదని, అయితే తన పిల్లలు పట్టుబట్టడంతో ఓకే చేయక తప్పలేదన్నాడు విజయ్. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి పులి ప్రివ్యూ చూసిన విజయ్ ఈ కామెంట్స్ చేశాడు. ఇంత భారీ బడ్జెట్ తో విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఓ కామెడీ సినిమా చేయటం రిస్క్ అని తెలిసినా కథ మీద నమ్మకంతో ఈ సినిమా అంగీకరించాడు విజయ్. తను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందన్న ఇళయదళపతి 'పులి' విజయం మీద ధీమాగా ఉన్నాడు. అక్టోబర్ 1న తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్‌తో పాటు శ్రీదేవి, సుదీప్, శృతిహాసన్, హన్సిక, ప్రభు లాంటి టాప్ స్టార్స్ నటించారు. వందకోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. -
'పులి' న్యూ స్టిల్స్
-
'పులి' మరో ట్రైలర్ విడుదల
విడుదలకు సమయం ఆసన్నం అవుతుండటంతో పులి టీం ప్రమోషన్లో వేగం పెంచింది. ఇప్పటికే వరుస పోస్టర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పులి టీం, తాజాగా మరో థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. సినిమా గ్రాండియర్‌ను పరిచయం చేయటంతో పాటు సినిమాలోని పాత్రలను కూడా ఈ ట్రైలర్లో రివీల్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తున్నాయి. అందుకే రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే 5 లక్షల వ్యూస్‌తో సత్తా చాటాడు ఇలయదళపతి విజయ్. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న పులి సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రీదేవితో పాటు.. సుదీప్, శృతిహాసన్, హన్సిక ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికేట్‌తో అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
'పులి' మరో ట్రైలర్ లాంచ్
-
అజిత్ లుక్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా లుక్ సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఇటీవల వరుస బ్లాక్‌బస్టర్స్ తో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అజిత్ తన 56వ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు తలా 56గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'వేదలం' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వీరం ఫేం శివ దర్శకుడు. ఈ సినిమా కోసం అజిత్ తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. చిన్నగా కట్ చేసిన హెయిర్ స్టైల్, లైట్‌గా గడ్డం, చెవులకు రింగులు, మెడలో, చేతికి స్టీల్ చైన్లు ఇలా మాస్ ఆడియన్స్ కు దేవుడిలా దర్శనమిస్తున్నాడు అజిత్. తమిళనాట మాస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్.. ఈ రేంజ్ మాస్ లుక్‌లో కనిపించే సరికి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు 'వి'తో స్టార్ట్ అయిన అజిత్ సినిమాలన్ని బాక్స్‌ఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. 'వాలి', 'విలన్', 'వరలరు', 'వీరం' లాంటి సినిమాలు అజిత్ మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే బాటలో వేదలం కూడా అజిత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
మహారాణిలాగే చూసుకున్నారు
కొద్ది రోజులుగా 'పులి' టీం పై శ్రీదేవి గుర్రుగా ఉందంటూ వస్తున్న వార్తలకు ఆమె ముగింపు పలికింది. దాదాపు 30 ఏళ్ల తరువాత పులి సినిమాతో కోలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి, ఆ యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించింది. 1986లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'నాన్ ఇదిమయ్ ఇలయ్' సినిమాలో చివరి సారిగా నటించిన శ్రీదేవి, ఇన్నేళ్ల తరువాత పులి సినిమాలో ఓ కీలక పాత్రలోనటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను పులి టీం.. రాణీ లాగే చూసుకున్నారని తెలిపింది. పులి సినిమా కోసం చెన్నై స్టూడియోలలో షూటింగ్ చేయటంతో తన కెరీర్ తొలినాళ్లలోని చాలా విషయాలు మళ్లీ గుర్తు చేసుకోగలిగే అవకాశం వచ్చిందని తెలిపింది. ఈ సినిమాలో తనది ప్రస్తుతం వార్తల్లో వస్తున్న తరహా పాత్ర కాదన్న ఆమె...తన పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పాలేనంది. అలాగే ఈ సినిమాలో తాను చేసిన పాత్ర కోసం కూడా చాలా కేర్ తీసుకుంది శ్రీదేవి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ తో పులి సినిమాలో చాలా గ్రాండ్‌గా కనిపించింది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించగా, ప్రభు, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లోనటించారు. వందకోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో సౌత్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
తొలిసారిగా ఆ పని చేస్తోన్నకమల్హాసన్
60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో లోకనాయకుడు కమల్‌హాసన్ ఇంత వరకు ఏ ఒక్క బ్రాండ్‌కు కూడా ప్రచారకర్తగా వ్యవహరించలేదు. ఇమేజ్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కమల్, చేయాలని అనుకుంటే ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకునేవి. సినిమాల మీదే ఎక్కువగా సమయం కేటాయిస్తూ వస్తున్న కమల్‌హాసన్ అంబాసిడర్‌గా తన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకోలేదు. నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కమల్‌హాసన్ ఇప్పుడు తొలిసారిగా ఓ వస్త్రదుకాణానికి ప్రమోటర్‌గా వ్యవహరించడానికి అంగీకరించాడు. కమల్‌తో ఓ యాడ్ షూట్ చేయడానికి అంగీకారం కుదుర్చుకుంది ప్రముఖ టెక్స్టైల్ సంస్థ పొతీస్. నటుడు, ఫొటోగ్రాఫర్ కృష్ణ ఈ యాడ్‌ను రూపొందిస్తున్నాడు. కొంతకాలంగా కమల్ కూతురు శృతిహాసన్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఆ బాధ్యతను కమల్‌హాసన్ తీసుకున్నాడు. కమల్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'చీకటిరాజ్యం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బైలింగ్యువల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో పాటు 'విశ్వరూపం 2'కు సంబందించిన పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నాడు యూనివర్సల్ స్టార్. -
బాలీవుడ్ 'శ్రీమంతుడు'
సినీ తారలు ఏదో ఒక రూపంలో తమ పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నారు. టాలీవుడ్లో శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేష్ బాబు, శృతిహాసన్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి వారు గ్రామాలను దత్తత తీసుకోగా, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ రైతులకు తనవంతు సాయం అందించగా, తాజాగా యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా లిస్ట్‌లో చేరిపోయాడు. మరాఠావాడ రీజియన్‌లో కరువు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 180 రైతు కుటుంబాలను ఆదుకుంనేందుకు ముందుకు వచ్చాడు అక్షయ్. వీరి కోసం ఇప్పటికే 90 లక్షల రూపాయాలను డోనేట్ చేసిన ఈ రియల్ హీరో, ఈ విషయం పై స్పందిచడానికి మాత్రం నిరాకరించాడు. ఈ విషయంలో తనకు ప్రచారం అవసరం లేదన్న అక్షయ్ కుమార్, మీడియా వార్తల ద్వారా మరింత మంది ఇలా స్పందిచేలా ప్రయత్నించాలని కోరాడు. నానా పటేకర్, అక్షయ్ కుమార్‌లు చూపించిన ఇదే బాటలో నడిచేందుకు మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు రెడీ అవుతున్నారు. -
మహేష్ బాటలో శృతి
హీరోయిన్ శృతి హాసన్..ప్రిన్స్ మహేశ్ బాబు బాటలో నడుస్తోంది. సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా వరుస సక్సెస్ లతో టాప్ ప్లేస్ కి చేరిన శృతి హాసన్ త్వరలో ఓ ఊరిని దత్తత తీసుకోవటానికి ప్లాన్ చేసుకుంటోంది. ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాలో హీరోగా నటించిన మహేష్ ఇప్పటికే రెండు గ్రామాలు దత్తత తీసుకోగా, హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలే నిర్మాతగా మారి, షార్ట్ ఫిలింస్ ను ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ బ్యూటి... ఔత్సాహిక కళాకారులకు చేయూతనందిస్తానంటోంది. మంచి కథ, కథనాలు, మ్యూజిక్ తో వస్తే, తన బ్యానర్ పై సినిమాలు తెరకెక్కించడానికి కూడా సిద్దమని ప్రకటించింది. అయితే ఊరిని దత్తత తీసుకోవాలన్న ఆలోచన తనకు శ్రీమంతుడు సినిమాతో మాత్రం రాలేదట.. తన తండ్రి కమల్ హాసన్ స్ఫూర్తితోనే ఈ ఆలోచన చేస్తున్నట్టుగా చెపుతోంది శృతి. -
'పులి' కొత్త స్టిల్స్
-
కొత్త విషయం నేర్చుకోవాలి!
‘‘జీవితంలో మనకు చాలామంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అందరి దగ్గరి నుంచీ అన్నీ నేర్చుకోలేం. అయితే, మనం ఎలా ఉంటే బాగుంటుంది, మనలోని కొత్తదనాన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే విషయాలను మాత్రం కొందరి మాట తీరు, నడక నుంచి నేర్చుకోవచ్చు. జీవితంలో ఇలా ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. అలా మనకు తెలియకుండానే మనలోని కొత్త వ్యక్తిని ఆవిష్కరించుకోవచ్చు. అందులోనే పరిపూర్ణమైన ఆనందం ఉంటుందని నా అభిప్రాయం. ’’ - శ్రుతీహాసన్ -
మేకప్ లేకున్నా.. నేను అందగత్తెనే..!
-
శృతీ.. నిన్ను ప్రేమించాలనుంది!!
-
భయపెడతానంటున్న శృతి!!
-
బికినీకి సై అన్న శృతిహాసన్!
-
మోస్ట్ డిజైర్బుల్ ఉమెన్‌గా శృతి
-
అన్వేషణ ముగిసింది..కల ఫలించింది...
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. రెండూ క్లిష్టమైనవే. పెళ్లి గురించి పక్కన పెట్టి, ఇల్లు గురించి చెప్పాలంటే.. కట్టించుకోకుండా రెడీమేడ్‌గా కొనేసుకుందామన్నా, మనసుకు నచ్చిన ఏరియాలో, అభిరుచికి తగ్గది దొరకాలి. దొరికేవరకూ అన్వేషణ తప్పదు. కొన్ని నెలలుగా శ్రుతీ హసన్ సాగించిన ఇంటి అన్వేషణకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. నిన్న మొన్నటి వరకూ ముంబయ్‌లోని బాంద్రాలో అద్దె ఇంట్లో ఉండేవారు శ్రుతి. ఆ ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడటానికి ప్రయత్నించడం, అప్రమత్తంగా ఉండడంతో శ్రుతి ఎలాంటి ప్రమాదం ఎదుర్కోకుండా బయటపడడం తెలిసిందే. బహుశా అప్పటి నుంచే ఆ ఇల్లు ఖాళీ చేసి, సొంతింటికి మారిపోవాలనుకుని ఉంటారేమో. ముంబయ్‌లో ప్రముఖులు ఉండే ఏరియాల్లో ఒకటైన అంధేరీలో ఆమె ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. రెండు పడక గదులున్న ఈ ఫ్లాట్ శ్రుతి అభిరుచికి తగ్గట్టుగా ఉందట. ఓ శుభముహూర్తాన గృహప్రవేశం కూడా చేశారు శ్రుతి. అదే ఏరియాలో దర్శకుడు ఇంతియాజ్ అలీ, ప్రాచీ దేశాయ్ తదితరులు నివసిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకెళుతున్న శ్రుతికి భారీ అవకాశాలు చాలానే వస్తున్నాయి. త్వరలో మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో శ్రుతిని కథానాయికగా అడగడం, ఆమె పచ్చజెండా ఊపడం జరిగింది. మహేశ్ సరసన నటించనున్నందుకు శ్రుతీ హాసన్ చాలా ఎగ్జయిట్ అవుతున్నారట. -
శ్రుతిపై టాలీవుడ్ గుర్రు?
నటి శ్రుతిహాసన్‌పై టాలీవుడ్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. గబ్బర్‌సింగ్, ఎవడు, రేసుగుర్రం వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రుతిహాసన్ హిందీ, తమిళ చిత్రాల్లోను నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. అందాలారబోతలోనూ ముందున్న ఈ ముద్దుగుమ్మ ఈ తరహా ఫోటోలతో కలకలం పుట్టిస్తున్నారు. డిడే అనే హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో ఒలకపోసిన శృంగారం విమర్శకుల చేతికి పెద్ద పనే చెప్పింది. ఆ తరువాత ఎవడు అనే తెలుగు చిత్రంలో దుస్తుల విషయంలో చాలా పొదుపు పాటించి సంచలనం రేపారు. అయితే ఆ చిత్రంలోని ఆమె శృంగారభరిత చిత్రాలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఈ సంఘటన శృతిహాసన్‌కు కాస్త ఎక్కువ ఆగ్రహాన్నే కలిగించింది. తన అనుమతి లేకుండా ఈ ఫొటోలను నెట్లో పొందుపరచారంటూ ఆ చిత్ర నిర్మాతపై ఫైర్ అయ్యారు. ఆ నిర్మాత ఆ ఫొటోలతో తనకెలాంటి సంబందం లేదంటూ వివరణ ఇచ్చారు. అయి నా శ్రుతి కోపం చల్లారలేదు. తన ఇమేజ్ను డామేజ్ చేయడానికి ప్రయత్నించిన వారిని ఊరికే వదలి పెట్టకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని టాలీవుడ్‌లోని పదిమంది ఫొటోగ్రాఫర్లను విచారిస్తున్నారు. శ్రుతిహాసన్ సెక్సీగా నటించడం కొత్తేమీ కాదు. ఆమె తొలి చిత్రం లక్ (హిందీ) లోనే ఈత దుస్తులు ధరించి అందాలారబోతకు శ్రీకారం చుట్టారు. అలాంటిది పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ టాలీవుడ్లో ఆమెపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కొందరు తెలుగు నిర్మాత మండలి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
ఆంటీనయ్యాను
నేనిప్పుడు ఆంటీని అయ్యాను అంటూ తెగ సంబరపడిపోతున్నారు నటి ప్రియమణి. సాధారణంగా హీరోయిన్లు ఏ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడినా తమ వయసు గురించి మాత్రం నోరు మెదపరు అన్నది ఒకప్పటి మాట. శ్రుతిహాసన్, శ్రీయ వంటి వారు తమ వయసును దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. అదే విధంగా ప్రియమణి కూడా ఏ విషయాన్ని అయినా నిర్భయంగా చెబుతారు. చక్కని అభినయ తార అయిన ఈమె ఎందుకనో రెండు మూడేళ్లుగా తమిళ తెరకు దూరం అయ్యారు. అయితే కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం కన్నడంలో అంబరీష్ అనే చిత్రంలో నటిస్తున్న ప్రియమణి తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను ఆంటీని అయ్యానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రియమణి సోదరుడు విశాక్ దేవ్, ప్రార్థన దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిందట. దీంతో షూటింగ్‌కు కూడా విరామం ఇచ్చి ప్రియమణి తన సోదరుడి కూతురిని లాలిస్తూ గడిపేస్తున్నారట. దీంతో ఆమె తల్లి తన కూతురికి పెళ్లి ఆశ కలిగిందంటున్నారట. దీనిపై ప్రియమణి మాట్లాడుతూ, వయసు పెరుగుతుందన్నది నిజమేనని, దాని కోసం వివాహం చేసుకోవాలని లేదుగా అన్నారు. నిజం చెప్పాలంటే వివాహం చేసుకోవాలనే ఆలోచన తనకింత వరకు రాలేదన్నారు. అలాంటి ఆశ కలిగినప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తానని అంటున్నారు. -
అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు!
‘‘భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె అలా అనడానికి కారణం ఉంది. విదేశాల్లో పుట్టి, ఏ హాలీవుడ్ సినిమాలోనో చేస్తే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చేదని, భారతదేశంలో పుట్టడం వల్ల పలు భాషల్లో నటించడానికి కుదురు తోందని అంటున్నారు శ్రుతి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇంకా అంగీకరించాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ మల్టీస్టారర్ ఒకటి. ఇందులో తనను నాయికగా అడిగారని శ్రుతి పేర్కొన్నారు. కానీ, ఇంకా డేట్స్ కేటాయించలేదని, ఇలాంటి ఓ భారీ అవకాశానికి అడగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి డైరీ తిరగేస్తున్నారట. అది సరే.. సినిమాల్లో హీరోలతో ప్రేమలో పడుతుంటారు కదా.. మరి, నిజజీవితం సంగతేంటి? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నేను సింగిల్‌గానే ఉన్నా. సినిమాల పరంగా నా బిజీ షెడ్యూల్ గురించి తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు. ప్రస్తుతం సినిమాల మీదే పూర్తి దృష్టి సారించాను. కష్టపడి పని చేయాలన్నదే నా ధ్యేయం. ప్రతి శుక్రవారం ఏదో ఓ సినిమా వస్తుంది.. పోతుంది. కానీ, చేసిన కృషి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. -
పట్టిందల్లా బంగారమే!
మంచి రోజులు మొదలైతే... అవి కొన్నాళ్ల పాటు అలానే కొనసాగుతుంటాయి. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే. ప్రస్తుతం శ్రుతీహాసన్‌కి అదే జరుగుతోంది. రెండేళ్ల క్రితం ‘గబ్బర్‌సింగ్'తో మొదలైంది ఆమె హవా. గత ఏడాది ‘బలుపు', ‘డి-డే’, ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఈ పాలబుగ్గల వయ్యారి చేతినిండా సినిమాలే. ఈ నెల 11న ‘రేసుగుర్రం'తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారామె. సాధారణంగా హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో దేనినో ఒకదాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంటారు హీరోయిన్లు. శ్రుతి మాత్రం అందుకు భిన్నం. సాధ్యమైనంతవరకూ అన్ని భాషల్నీ కవర్ చేస్తుంటారామె. బహుశా తండ్రి కమల్‌హాసన్ నుంచి అబ్బిన లక్షణం కావచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘వెల్కమ్ బ్యాక్’. జాన్ అబ్రహాం హీరో. ఇక రెండో సినిమా మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘గబ్బర్'. మురుగదాస్ ‘రమణ' చిత్రం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ కథానాయకుడు. ఇందులో శ్రుతి పాత్ర పేరు ‘దేవిక'. నటనకి ఆస్కారమున్న పాత్ర చేస్తున్నారామె. తప్పకుండా బాలీవుడ్లో తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నారామె. అలాగే తమిళంలో కూడా ఈ మధ్య ఓ సినిమాకు పచ్చ జెండా ఊపారు. అదే... విశాల్ ‘పూజై'. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన హరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రుతీది మాస్ అప్పీల్ ఉన్న పాత్ర అని సమాచారం. ఇక ‘రేసుగుర్రం' తర్వాత శ్రుతీహాసన్ నటించే తెలుగు సినిమా ఏంటి? అనే విషయాన్ని ఆరాతీస్తే... ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మహేశ్, ‘మిర్చి' కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కదా. ఆ సినిమాలో కథానాయికగా శ్రుతీహాసన్ ఎంపికయ్యారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. అలాగే... మణిరత్నం తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో కూడా శ్రుతీహాసనే కథానాయికట. ఈ జాబితాను బట్టి ఆమె ఇప్పుడు పట్టిందల్లా బంగారమేనని అర్థం చేసుకోవచ్చు. -
రేసుగుర్రం మూవీ పోస్టర్స్
-
రేసుగుర్రం మూవీ స్టిల్స్
-
శృతీహాసన్ చుట్టూ తిరుగుతోన్న బాలీవుడ్ డైరెక్టర్స్