జాతరలో క్రాక్‌ | Ravi Teja Crack shooting at hyderabad | Sakshi
Sakshi News home page

జాతరలో క్రాక్‌

Published Fri, Nov 29 2019 6:17 AM | Last Updated on Fri, Nov 29 2019 6:17 AM

Ravi Teja Crack shooting at hyderabad - Sakshi

రవితేజ

రికార్డింగ్‌ డ్యాన్స్‌లు, పాటలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. ఓ గుడికి సంబంధించిన జాతరతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంది. అప్పుడు అక్కడికి పోలీస్‌ డ్రెస్‌లో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. నెక్ట్స్‌ సీన్‌ను వెండితెరపై చూడాల్సిందే. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రధారి. ఇందులో పోలీసాఫీర్‌గా నటిస్తున్నారు రవితేజ. ఈ నెల 21న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రస్తుతం జాతరకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రవితేజ, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి సహ – నిర్మాత. ‘క్రాక్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement