అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు! | they knows don't loves me! | Sakshi
Sakshi News home page

అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు!

Published Fri, Apr 11 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

అది తెలిసినవాళ్లెవరూ   నన్ను ప్రేమించరు!

అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు!

 ‘‘భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె అలా అనడానికి కారణం ఉంది. విదేశాల్లో పుట్టి, ఏ హాలీవుడ్ సినిమాలోనో చేస్తే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చేదని, భారతదేశంలో పుట్టడం వల్ల పలు భాషల్లో నటించడానికి కుదురు తోందని అంటున్నారు శ్రుతి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.
 
 ఇంకా అంగీకరించాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ మల్టీస్టారర్ ఒకటి. ఇందులో తనను నాయికగా అడిగారని శ్రుతి పేర్కొన్నారు. కానీ, ఇంకా డేట్స్ కేటాయించలేదని, ఇలాంటి ఓ భారీ అవకాశానికి అడగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి డైరీ తిరగేస్తున్నారట. అది సరే.. సినిమాల్లో హీరోలతో ప్రేమలో పడుతుంటారు కదా.. మరి, నిజజీవితం సంగతేంటి? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నేను సింగిల్‌గానే ఉన్నా.
 
 సినిమాల పరంగా నా బిజీ షెడ్యూల్ గురించి తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు. ప్రస్తుతం సినిమాల మీదే పూర్తి దృష్టి సారించాను. కష్టపడి పని చేయాలన్నదే నా ధ్యేయం. ప్రతి శుక్రవారం ఏదో ఓ సినిమా వస్తుంది.. పోతుంది. కానీ, చేసిన కృషి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement