Hindi Movies
-
కెనడా హిందీ సినిమా హాళ్లలో కలకలం
టొరంటో: కెనడాలోని గ్రేటర్ టొరంటో ప్రాంతంలో హిందీ సినిమాలను ప్రదర్శించే మూడు వేర్వేరు సినిమా హాళ్లలో కలకలం రేగింది. మాస్క్ ధరించిన వ్యక్తులు గుర్తు తెలియని రసాయనాన్ని స్ప్రే చేయడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారు. యార్క్‌లోని వౌఘన్ సినిమా కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సమయంలో థియేటర్లో 200 మంది ఉన్నారు. స్ప్రే కారణంగా ప్రేక్షకుల్లో కొందరు దగ్గడం ప్రారంభించారు. శ్వాసలో ఇబ్బందికి గురయ్యారు. పోలీసులొచ్చేసరికే అనుమానితులు పరారయ్యారు. కొందరు బాధితులకు పోలీసులు చికిత్స చేయించారు. ఈ వారంలోనే ఇలాంటి ఘటనలే జరిగినట్లు పీల్, టొరంటోల్లోనూ జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. స్కార్బరో టౌన్ సెంటర్లోని థియేటర్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దుర్వాసన వెదజల్లే బాంబును అమర్చినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. విద్వేషపూరిత నేరం సహా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. -
మూవీ మ్యాటర్స్ 20 March 2022
-
స్క్రీన్ ప్లే @ 12 February 2022
-
పాతికేళ్ల తర్వాత వెంకీ.. 20 ఏళ్ల తర్వాత నాగార్జున!
బాలీవుడ్ తెరపై ఎన్నేళ్లయింది నాగ్ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది వెంకీ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది రాశీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లయింది నిధీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లకెన్నేళ్లకు అంటోంది బాలీవుడ్. మరి.. హిందీలో వెంకటేశ్ కనిపించి పాతికేళ్లయింది. నాగార్జున దాదాపు 20 ఏళ్లు. రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్ చిన్న బ్రేక్ తర్వాత హిందీ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో ఈ నలుగురూ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. కెరీర్లో దాదాపు 75 సినిమాలు చేశారు వెంకటేశ్. వాటిలో దాదాపు పాతిక రీమేక్సే ఉంటాయి. అసలు బాలీవుడ్లో వెంకటేశ్ వేసిన తొలి అడుగు కూడా రీమేక్‌తోనే పడింది. 1991లో వచ్చిన తమిళ చిత్రం ‘చిన్న తంబి’ (ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘చంటి’గా రీమేక్ చేశారు) హిందీ రీమేక్ ‘అనాడీ’తో వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1993లో ఈ చిత్రం బీ టౌన్లో మంచి హిట్ సాధించింది. వెంకీకి హిందీలోనూ పాపులారిటీ పెరిగింది. ఇక హిందీలో వెంకీ చేసిన రెండో సినిమా కూడా రీమేకే కావడం విశేషం. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా పరిచయమైన ‘యమలీల’ చిత్రం అప్పట్లో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ ‘తక్దీర్వాలా’లో వెంకటేశ్ హీరోగా చేశారు. ఆ తర్వాత బాలీవుడ్లో మరో మూవీ చేయడానికి వెంకీ ఆసక్తి చూపించలేదు. కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ హీరోలుగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ ఫిల్మ్ రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే తెలుగులో హిట్ సాధించిన ‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో వెంకటేశ్, అర్జున్ కపూర్ నటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మరోవైపు ‘శివ, ద్రోహి, క్రిమినల్, అగ్ని వర్ష్’... ఇలా హిందీలో దాదాపు పది సినిమాలు చేశారు నాగార్జున. 2003లో వచ్చిన హిందీ చిత్రం ‘ఎల్ఓసీ: కార్గిల్’లో ఓ లీడ్ రోల్ చేసిన నాగార్జున ఆ తర్వాత హిందీ సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మూడు భాగాలుగా విడుదల కానున్న హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రయాలజీ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లు కాగా, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా ఇతర ప్రధాన తారాగణంగా కనిపిస్తారు.‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఇక అందాల తార రాశీ ఖన్నా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ బీ టౌన్ వైపు వెళ్లారు. 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తో నటిగా రాశీ ఖన్నా కెరీర్ ఆరంభమైంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత రాశీకి హిందీలో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో మాత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో హీరోయిన్గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కసారిగా రాశీకి అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఎనిమిది సంత్సరాల వరకు రాశీ డైరీ సౌత్ సినిమాలతో ఖాళీ లేకుండా పోయింది. అయితే తాజాగా తన డైరీలో ‘యోధ’ అనే హిందీ సినిమాకు రాశీ ఖన్నా చోటు కల్పించారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాగర్ అమ్రే, పుష్కర్ ఓజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్. యాక్షన్ మూవీ ‘యోధ’ ఈ ఏడాది నవంబరు 11న విడుదల కానుంది. అయితే రాశీ కేవలం హిందీలో సినిమా మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లూ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌ను ఆమె ఆల్రెడీ పూర్తి చేసేశారు. ఈ ఏడాదే ఈ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. సేమ్ టు సేమ్ రాశీ ఖన్నాలానే నిధి ముందు హిందీ సినిమా ద్వారానే కథానాయిక అయ్యారు. ‘మున్నా మైఖేల్’ (2017) అనే సినిమాతో హిందీ తెరపై తొలిసారి కనిపించారు. తాజాగా హిందీలో ఓ పెద్ద సినిమా అంగీకరించి నట్లుగా నిధీ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.ఈ నలుగురే కాదు.. మరికొందరు తారలు ‘బ్యాక్ టు బాలీవుడ్’ అంటూ హిందీ ప్రాజెక్ట్స్ అంగీకరించే పనిలో ఉన్నారు -
బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలై పుష్ప రాజ్ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా రాబట్టాడు. ఇది బన్నీ సినిమా చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా చెప్పుకోవచ్చు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివిధ భాషల్లో రిలీజ్ అయి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ పుష్ప సినిమా కలెక్షన్లు ఉదహరిస్తూ తెలుగు సినిమాల ప్రారంభ వసూళ్లను హిందీ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయని తెలిపాడు. 'ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో అందులో నటించిన నటులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. దీన్ని ఎవరూ ఆపలేరు. అందుకే హిందీలో రిలీజైన పుష్ప సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీ సినిమాలు సైతం అతంగా వసూళ్లు సాధించలేకపోయాయి.' అని పేర్కొన్నాడు కరణ్ జోహార్. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలు సినిమాపై, బన్నీ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ కూడా అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తాడు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకు అత్యధిక వసూళ్లు వచ్చాయని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పుష్ప మేకింగ్ వీడియో.. అలరిస్తున్న తెర వెనుక సన్నివేశాలు -
అభిమానులను నిరాశ పరిచిన ఆ ఐదు చిత్రాలు
2021 Bollywood Flop Movies: సినిమా సినిమా.. కొబ్బరికాయ కొట్టి మొదటి క్లాప్ ఇచ్చినప్పటినుంచి మూవీ విడుదలై, సక్సెస్ మీట్ వరకూ ఒక రకమైన పండుగల ఉంటుంది. హిట్ అయితే 'అబ్బా సాయిరామ్' అని అనిపించిన దర్శక నిర్మాతలకు సినిమా సరిగా ఆడకుంటే మాత్రం 'చాలా బాగోదు'. కానీ ఏం చేద్దాం. కొన్ని సినిమాలు బాగా టేకాఫ్ అయితే.. మరికొన్ని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో టేకాఫ్ కాకుండా కుప్పకూలిపోతాయి. ఇలా ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని ఐదు హిందీ చిత్రాలు మీకోసం. 1. రాధే (యువర్ మోస్ట్ వాంటేడ్ భాయ్) బాలీవుడ్ భాయిజాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ చిత్రం రాధే. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను ఎంతమాత్రం రీచ్ కాలేకపోయాడు రాధే. ఇందులో సల్మాన్.. రాజ్వీర్ షికావత్ అకా రాధే పాత్రను పోషించాడు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ చిత్రంలో దిశా పటానీ, జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా తదితరులు నటించారు. ఈ సినిమాకు ఐఎండీబీ 1.8 (IMDb) రేటింగ్‌ను ఇచ్చింది. 2. హంగామా 2 2003లో విడుదలైన హంగామా సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే హంగామా 2. మొదటి చిత్రం 7.6 ఐండీబీ రేటింగ్‌ను సాధించగా రెండో సినిమా మాత్రం 2.1 కి పరిమితమైంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ హాస్య నటులు పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్, జానీ లివర్ ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 3. లాహోర్ కాన్ఫిడెన్షియల్ జీ5 ఒరిజినల్ నిర్మించిన రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం వన్ లాహోర్ కాన్ఫిడెన్షియల్. ఈ సినిమాలో రిచా చద్దా, అరుదోదయ్ సింగ్, కరిష్మా తన్నా, ఖలీద్ సిద్ధిఖీ నటించారు. చిత్రంలో స్పై-థ్రిల్లర్ అంశాలు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కునాల్ కోహ్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు 2.8 రేటింగ్ ఇచ్చింది ఐఎండీబీ (IMDb). 4. రూహి బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన కామెడీ-హార్రర్ చిత్రం రూహి. ఇందులో జాన్వీ కపూర్, వరుణ్ శర్మ నటించారు. ఈ చిత్రానికి హార్దిక్ మెహతా దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను నిరాశపరిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 4.3. 5. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ నిర్మించిన చిత్రం ది గర్ల్ ఆన్ ది ట్రైన్. పౌలా హాకిన్స్ రాసిన నవల ఆధారంగా 2016లో హాలీవుడ్లో విజయం సాధించిన ఈ సినిమాకు ఇదే పేరుతో హిందీలో రీమెక్ చేశారు. ఈ చిత్రం ప్రోమోలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయినా పరిణీతి చోప్రా, అదితి రావు హైదరీ నటించిన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు అంతగా థ్రిల్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమాకు 4.4గా ఐఎండీబీ (IMDb) రేటింగ్ ఇచ్చింది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది అలరించనున్న సినిమాలు ఇవే.. -
బాలీవుడ్ ఆడియెన్స్ కు పండగ
-
ఆ విషయంలో బాలీవుడ్ ఇంకా వెనకబడే ఉంది
‘సినిమా అనేది ఎంతో శక్తి వంతమైన మాధ్యమం. ప్రజా జీవనాన్ని ప్రతిబింబించేలా అది ఉండాలి’ అన్నారు బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్. మంచి సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి పర్యావరణ ప్రేమికురాలు కూడా.ఇటీవల ఓ ఇంటర్వూలో బాలీవుడ్ సినిమా కథలపై భూమి స్పందించింది. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయడంలో హిందీ పరిశ్రమ వెనక బడి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల గురించి భూమి మాట్లాడుతూ..‘హిందీ సినిమాలో ప్రజల స్థిరమైన జీవన విధానాన్ని చూపించడానికి సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. దేశంలో బాలీవుడ్ చిత్రాలని ఎక్కువ మంది చూస్తారు. అందుకే సామాజిక స్పృహతో సినిమాలు తీయాలి. అయితే ఆ విషయంపై ఇండస్ట్రీ దృష్టి పెట్టట్లేదని’ని అభిప్రాయపడింది. సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యంత శక్తివంతమైన మాధ్యమం సినిమాలు, అందుకే వాణిజ్య పంథాలో ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకువచ్చే కథల్ని ఎంచుకోవాలని ఈ బ్యూటీ తెలిపింది. కాగా ‘పతి ఔర్ పత్ని’, ‘రక్షా బంధన్’ మూవీస్‌తో గుర్తింపు పొందిన భూమి ప్రస్తుతం ‘తఖ్త్’, ‘బధాయ్ దో’ సినిమాల్లో నటిస్తోంది. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా!
‘‘కళను, కళాకారులను ఒక భాషకి, ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అంటారు. నిజమే.. కళాకారులకు ఎల్లలు ఉండవు. ఆర్టిస్ట్‌గా నేను ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితం కావాలనుకోవడంలేదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉండటం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రేక్షకులు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు. చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నా. ఒకేసారి రకారకాల భాషల సినిమాల్లో, వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం మంచి అనుభవం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే. నేను ఏదో ఒక భాషకు చెందిన నటిగా కంటే ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అదే నాకిష్టం’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న తెలుగు సినిమాల షెడ్యూల్స్ గురించి చెబుతూ – ‘‘ఈ 25 వరకూ ‘రాధేశ్యామ్’ షూట్లో పాల్గొని, ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూట్లో జాయిన్ అవుతా. జనవరి నుంచి మళ్లీ ‘రాధే శ్యామ్’ సెట్లో ఉంటా’’ అన్నారు పూజా. సో.. పూజా ఆడా ఉంటా.. ఈడా.. ఉంటా అంటున్నారన్న మాట. మంచిదేగా! -
అల విజయాల దారిలో..
అల.. విజయాల దారిలో అన్నట్లుగా ఉంది పూజా హెగ్డే కెరీర్. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురములో.. ఇలా వరుస విజయాలతో ఆనందంగా ఉన్నారు పూజా. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారామె. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేకు లెక్కపరంగా చూస్తే తెలుగుకన్నా హిందీ సినిమాల సంఖ్య తక్కువ. మొహంజోదారో, హౌస్‌ఫుల్ 4.. ఇప్పటివరకూ హిందీలో పూజా చేసిన సినిమాలు ఇవే. ఇప్పుడు మూడో సినిమాకి అవకాశం వచ్చిందట. అక్షయ్‌కుమార్ హీరోగా నటించనున్న ‘బచ్చన్ పాండే’లో ఓ కథానాయికగా నటించే చాన్స్ అది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’కి రీమేక్ అని సమాచారం. ‘వీరమ్’ తమిళంలో పెద్ద హిట్. తెలుగులో పెద్ద హిట్లు చూసిన పూజా హెగ్డేకి ఈ రీమేక్‌లో అవకాశం వచి్చన మాట నిజమే అయితే.. హిందీలోనూ విజయాల దారిలో పడతారని ఊహించవచ్చు. -
మనమే సైన్యం
బాలీవుడ్ రక్తంలో త్రివర్ణాలు ఉన్నాయి.దేశభక్తి తిలకం దిద్దుకుంది హిందీ సినిమా.‘జైహింద్’ అని జయధ్వానం చేస్తూ థియేటర్లలో జోష్ నింపేది హిందీ సినియాయే. యుద్ధాలు బార్డర్ల మీదే కాదు... మన గుండె అంచుల్లో కూడా ఉంటాయని చాటి చెప్పిన వీర సైనికుడు, దేశం మొత్తానికి పెద్ద కొడుకు, దేశభక్తికి తార్కాణం హిందీ సినిమా. పుల్వామా ఘాతుకం తర్వాత గట్టిగా అరవాలనిపించింది. గుండెల్లోని బాధ ప్రతీకారాన్ని కోరుతోంది. మనసులోని కోపాన్ని చూపించాలని ఉంది. అందుకే బాలీవుడ్ చూపించిన దేశభక్తిని మీకు చూపిస్తున్నాం. ‘పుల్వామా’ రహదారి మన సైనికుల రక్తంతో ఎర్రబడింది. 40 మంది సైనికులు ఆ దారిన విధులకు వెళుతూ ద్రోహుల కిరాతకానికి అసువులు బాసారు. దేశం కళ్లల్లో అశ్రువులు నింపారు. వారి త్యాగం ఏ బదులుతో సమం చేయగలం? దేశం వారికి జోహార్లు అర్పిస్తోంది. జేజేలు పలుకుతోంది. గుండెల మీద క్యాండిళ్లు వెలిగించి బరువెక్కిన హృదయంతో మౌనం పాటిస్తోంది. ప్రజలతో పాటు బాలీవుడ్ కూడా సందర్భం వచ్చిన ప్రతిసారీ సైనికుడి పట్ల తన గౌరవాన్ని చాటింది. అతడి గొప్పతనాన్ని సినిమాలుగా తీస్తూ వచ్చింది. 1962 చైనా యుద్ధం గురించి ‘హకీకత్’ సినిమా 1971 పాకిస్తాన్ యుద్ధం గురించి ‘బోర్డర్’ సినిమా తీసింది. 1999లో కార్గిల్ యుద్ధం గురించి ‘లక్ష్య’ సినిమా ఎక్కుపెట్టింది. 2016లో పాకిస్తాన్‌పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి తాజాగా ‘ఉరి’ సినిమాతో శత్రువునే కాదు సక్సెస్‌ను కూడా హిట్ చేసింది. అయితే సైనికుడు ఉన్నవి మాత్రమే దేశభక్తి సినిమాలు అనుకోనక్కర్లేదు. దేశ భద్రత కోసం, సమగ్రత కోసం, స్ఫూర్తి కోసం ప్రాణాంతకమైన ఆపరేషన్స్ నిర్వహించిన సినిమాలు కూడా దేశభక్తి సినిమాలు అని భావించాలి. సైనికుడితో తోడు నిలిచి ‘జైహింద్’ అని నినదించిన సినిమాలు ఇవి. సర్ఫరోష్ (1999) దేశంలోకి ఆయుధాలు వస్తుంటాయి. ఎవరో ఆగంతకులో ఉగ్రవాదులో వాటిని ఉపయోగించి తీవ్రమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం చేస్తుంటారు. అసలు ఈ ఆయుధాలు ఎక్కణ్ణుంచి వస్తాయి... ఆ దారి ఏమిటి అనే అంశాన్ని తీసుకుని తీసిన సినిమా ‘సర్ఫరోష్’. దేశ సరిహద్దుల నుంచి రాజస్తాన్ ద్వారా లోపల ఉన్న కొందరు దేశద్రోహుల సహాయంతో ఆయుధాలు ఇక్కడకు వస్తున్నాయని ఒక పోలీస్ ఆఫీసర్ కనిపెట్టి ఆ రాకెట్నంతా ధ్వంసం చేయడమే ఈ సినిమా. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయం నమోదు చేసింది. ఇందులో పాకిస్తానీ సింగర్‌గా నటించిన నసీరుద్దీన్ షా దేశ విభజన సమయంలో నష్టపోయిన తన కుటుంబం గురించి ప్రతీకారంగా భారత్‌పై ద్వేషం పెంచుకుని ఉగ్రవాదానికి సాయం చేస్తుంటాడు. ఈ సినిమా సోనాలి బింద్రేకు కూడా చాలా పేరు తెచ్చింది. ‘జిందగీ మౌత్ నా బన్‌జాయే’... అనే పాట సోను నిగమ్ గొంతు ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇప్పటికీ ఆగస్టు 15న వినిపిస్తూనే ఉంటుంది. రంగ్ దే బసంతి (2006) సరిహద్దులో సైనికుడు ఉంటాడు సరే, సైనికుడికి మద్దతుగా ఉండాల్సిన పాలనా యంత్రాంగం ఎలా ఉంది? వారి కోసం ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన మంత్రులు, అధికారులు నిజాయితీగా ఉన్నారా? నాసిరకం మిగ్ విమానాలు కొనుగోలు చేయడం వల్ల చాలా మంది పైలట్లు ప్రాణాలు విడిచారన్న వాస్తవం మన చరిత్రలో ఉంది. సైనికుడి ప్రాణాలంటే మీకు అంత అలుసా? అని కోపగించుకున్న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు ఎలాంటి ఆగ్రహాన్ని ప్రకటించారన్నది ఈ సినిమా. ‘రంగ్ దే బసంతి’ సినిమా చాలా శక్తిమంతంగా లోపలి శత్రువును చూపించింది. సైనికులను అడ్డం పెట్టుకొని బాగుపడుతున్న పెద్ద మనుషులను తెర మీదకు తెచ్చింది. ఆమిర్‌ఖాన్, సిద్ధార్థ, మాధవన్, సోహా అలీ ఖాన్ తదితరులు నటించిన ఈ సినిమా ఎ.ఆర్. రహెమాన్ సంగీతం వల్ల కూడా హిట్ అయ్యింది. ప్రజలలో కూడా చాలా చైతన్యం తీసుకు వచ్చిన సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. బ్లాక్ ఫ్రైడే (2007) మత కలహాలు అంతర్గత రుగ్మత కావచ్చు. దేశ ప్రజలతో లోపలి శక్తులే ఆడే ఆట కావచ్చు. కాని ఆ వ్యవహారంలో మాఫియా ఎంటర్ అయితే? బయటి నుంచి శక్తులు లోపల మారణకాండ సృష్టిస్తే? 1993లో ముంబైని దద్దరిల్ల చేసి వందలాది మంది మృత్యువుకు కారణమైన సీరియల్ బ్లాసింగ్స్ వెనుక ఉన్న అసలు కారణాలను సవివరంగా చూపించిన సినిమా ‘బ్లాక్ ఫ్రైడే’. పాకిస్తాన్లో ఉన్న దావుద్ ఇబ్రహీం, ముంబైలోని టైగర్ మెమెన్ ఏ కారణం చేత ఈ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారో అందులో హిందు ముస్లిం తేడా లేకుండా ఎంత మంది అమాయకులు బలయ్యారో ఈ సినిమా పొల్లుపోకుండా చూపిస్తుంది. ఈ దేశానికి ప్రధాన శతృవు పొరుగు దేశం కాదని దేశంలోని అవిద్య, మూర్ఖత్వం కొందరు స్వార్థపరులకు ఎలా ఉపయోగపడుతుందో ఇందులో చూడవచ్చు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమా తీశాడు. గాఢమైన సినిమాలు చూడాలనుకునేవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఏ వెన్స్ డే (2008) ఉగ్రవాద చర్యలు అంటే ఏమిటి? సామాన్యులను బలిగొనడమే. నేతలు, పాలకులు ఎప్పుడూ గట్టి రక్షణలో ఉంటారు. ఉగ్రవాద చర్యలకు సులభంగా దొరికిపోయే జీవులు సామాన్యులు. కాని సామాన్యుడు దీనిని సరి చేయలేడా? సామాన్యుడు చోద్యం చూస్తూ ఉండాల్సిందేనా? ఏం కాదు. దేశం కోసం సామాన్యుడు తెగిస్తే ఉగ్రవాదం వంటి విష వలయాలు ఎలా తునాతునకలు అవుతాయో ‘ఏ వెన్స్డే’ సినిమాలో దర్శకుడు నీరజ్ పాండే చూపించాడు. ఇందులో సామాన్యుడైన నసీరుద్దీన్ షా ప్రభుత్వం విచారణలో ఉంచిన ముగ్గురు ఉగ్రవాదులను, వారు తప్పించుకుపోనున్నారని గ్రహించి, చాలా ప్లాన్డ్గా మట్టుపెడతాడు. అతడిని అరెస్టు చేయదగ్గ అవకాశం ఉన్నప్పటికీ పోలీస్ ఆఫీసర్ అనుపమ్ ఖేర్ విడిచిపెడతాడు. దేశం సురక్షితంగా ఉండాలంటే పోలీసు వ్యవస్థ మాత్రమే కాదు ప్రజలు కూడా స్పందించాల్సి ఉంటుంది అని క్రియేటివ్ మీడియమ్ ద్వారా చెప్పిన సినిమా ఇది. డి డే (2013) దేశం కోసం ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏమేం ఆపరేషన్స్ చేస్తుందో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. పాకిస్తాన్లో ఉన్న దావుద్ ఇబ్రహీమ్‌ను ప్రాణాలతో పట్టుకుని రావాలంటే రా ఏజెంట్స్ ఎన్ని కష్టాలు, ప్రయత్నాలు, సాహసాలు చేయవలసి వస్తుందో ఊహాత్మకంగా అయినా సరే చాలా రియలిస్టిక్‌గా చూపిన సినిమా డి డే. ఇందులో డి అంటే దావుద్. ఆ పాత్రను ప్రసిద్ధ నటుడు రిషి కపూర్ పోషించాడు. ఆశ్చర్యం ఏమంటే పాకిస్తాన్ వెళ్లి దావుద్‌ను అరెస్ట్ చేసినా అతను ధైర్యంగా ఉంటాడు. సిస్టమ్‌లోని లొసుగులను వాడుకుని బయటపడతానని అంటుంటాడు. అందుకే అధికారులు అతణ్ణి మట్టుపెడతారు. ఎందరో గొప్ప అధికారులు మనం సాయం సంధ్యవేళ ఆరామ్‌గా టీ తాగుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి పని చేస్తుంటారని ఈ సినిమా చూపుతుంది. బేబీ (2015) 2008లో జరిగిన ముంబై దాడులు దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. సముద్రం ద్వారా పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్‌తో సహా అనేక చోట్ల విచక్షణా రహితంగా మారణకాండ సృష్టించారు. దీని సూత్రధారులను వెతికి పట్టుకోవడానికి దేశ అంతర్గత వ్యవహారాల శాఖ రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ టాస్క్ వింగ్ పేరే ‘బేబీ’. ఈ వింగ్ ప్రధానాధికారిగా డానీ, ఏజెంట్లుగా అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, రానా దగ్గుబాటి తదితరులు నటించారు. దుబాయ్‌లో ఉన్న పాక్ సూత్రధారిని ప్రభుత్వాల ప్రమేయం లేకుండా, అత్యంత రహస్యంగా పట్టుకుని రావడం ఈ మిషన్ లక్ష్యం. రోమాంచితంగా సాగే ఈ సినిమా భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశం కోసం పని చేసే అధికారుల గొప్పతనాన్ని చూపిస్తుంది. వారు అనుభవించే టెన్షన్, ప్రాణాంతక క్షణాలకు ఖరీదు కట్టలేమనిపిస్తుంది. రెయిడ్ (2018) సైనికుల ప్రాణాలు తీయడం, విధ్వంసాలు సృష్టించడం ఎంత పెద్ద దేశద్రోహమో ట్యాక్స్ ఎగ్గొట్టి నల్లధనాన్ని దాచుకోవడం కూడా అంతే పెద్ద ద్రోహం. ఆ సంపద రక్షణ కోసం రాజకీయాల్లో దిగి పదవులు పొందడం, అధికారులను తమ దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవడం నేటికీ దేశవ్యాప్తంగా సాగుతున్నదే. ఇప్పుడన్నా మీడియా రక్షణ ఉంది. 1980లలో ఏం చేసినా అడిగే నాథుడు లేడు. అలాంటి రోజులలో కాన్పూర్‌లోని ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై దాడి చేసి ఆ రోజులలోనే 100 కోట్ల రూపాయల విలువైన డబ్బు, బంగారం, వెండిని సీజ్ చేసిన అధికారి కథను ‘రెయిడ్’లో చూడొచ్చు. అజయ్ దేవ్‌గణ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా నటించాడు. ప్రాణాలకు, ఉద్యోగానికి ప్రమాదం అని తెలిసినా దాడి నిర్వహించిన ఆ అధికారి కూడా నిజమైన దేశభక్తుడే కదా. రాజీ (2018) పురుషులే కాదు ఎందరో స్త్రీలు కూడా దేశం కోసం త్యాగాలు చేశారు. 1971 నాటి పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ దేశ రహస్యాలు కనుగొనేందుకు అక్కడ అధికారి భార్యగా వెళ్లిన ఒక భారతీయ ముస్లిం యువతి ఎటువంటి సవాళ్లను ఎదుర్కొందో చూపిన కథ ‘రాజీ’. భార్యగా ఒకవైపు, భారతీయురాలిగా ఒకవైపు, పాకిస్తాన్ కోడలిగా ఒకవైపు నలిగిపోతూ దేశం కోసం తన ధర్మాన్ని నిర్వర్తించిన యువతిగా ఆలియా భట్ నటించి హర్షధ్వానాలు అందుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా వచ్చిన ఒక నవలను ఈ సినిమా కోసం ఉపయోగించుకున్నారు. కరణ్ జొహర్ 35 కోట్లతో నిర్మిస్తే ప్రజలు 195 కోట్లు ఇచ్చారు. -
పంద్రాగస్టుకి బాక్సాఫీస్ పోటీ!
వచ్చే పంద్రాగస్టుకి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్ పోటీ పడనున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు కలెక్ట్ చేసిన హిందీ చిత్రాల జాబితాలో ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ‘బాహుబలి’ తన స్టామినా నిరూపించుకుంది. ఆ విధంగా ప్రభాస్ మార్కెట్ ఇతర భాషల్లోనూ పెద్దదైంది. అందుకే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. బీ టౌన్లో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మరో మూడు హిందీ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాల రిలీజ్‌ల గురించి బాలీవుడ్లో జోరుగా చర్చ మొదలైంది. అవి ‘మిషన్ మంగళ్’, ‘బాల్తా హౌస్’. ‘మేడ్ ఇన్ చైనా’. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. జగన్ శక్తి ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇస్రో (ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల కృషి ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ‘బాల్తా హౌస్’ గురించి చెప్పాలంటే.. దాదాపు పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆపరేషన్ బాల్తా హౌస్ ఇన్సిడెంట్ ఆధారంగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా మిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మేడ్ ఇన్ చైనా’. చైనా ప్రాడెక్ట్స్ గురించి ఈ సినిమా ఉంటుందని భోగట్టా. ఈ మూడు సినిమాలనూ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు వెల్లడించాయి. ఇప్పుడు ‘సాహో’ కూడా సీన్లోకొచ్చింది. ఒకేరోజు నాలుగు సినిమాలంటే బాక్సాఫీస్ కలెక్షన్స్ షేర్ అయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే గురువారం వచ్చింది. ఆ రోజు పబ్లిక్ హాలీడే. నెక్ట్స్ వీకెండ్ స్టారై్టపోయింది. గురు, శుక్ర, శని, ఆదివారం.. వరుసగా నాలుగు రోజులు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి, నాలుగు చిత్రాల నిర్మాతలూ తమ సినిమాని రిలీజ్ చేసే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేకపోవచ్చు. మరి.. వచ్చే పంద్రాగస్టుకి ఏ సినిమా నిర్మాత ఆలోచన అయినా మారుతుందా? వెయిట్ అండ్ సీ. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’, ఈ ఏడాది ఆయన నటించిన ‘గోల్డ్’ సినిమాలు ఆగస్టు 15న విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇదే సెంటిమెంట్‌తో అక్షయ్ కుమార్ ‘మిషన మంగళ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. సేమ్ జాన్ అబ్రహాం ఈ ఏడాది హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ ఆగస్టు 15న విడుదౖలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అందుకే ‘బాల్తా హౌస్’ చిత్రాన్ని కూడా సేమ్ రిలీజ్‌కు అబ్రహాం రెడీ చేశారని బాలీవుడ్ టాక్. ‘సత్యమేవ జయతే, బాల్తా హౌస్’ రెండు చిత్రాల్లో జాన్ అబ్రహాంది పోలీస్ క్యారెక్టర్‌నే కావడం విశేషం. ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్. వీళ్లందరీ కంటే వచ్చే ఏడాది పంద్రాగస్టు రిలీజ్ డేట్‌ను ఫస్ట్ ఫిక్స్ చేసుకుంది హీరో రణ్‌బీర్ కపూర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మాత. మూడు పార్ట్స్‌గా రానున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను ఆగస్టు 15కు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండటంతో వచ్చే ఏడాది తొలి పార్ట్‌ను క్రిస్మస్కు వాయిదా వేశారు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. ఈ సినిమాలో నాగార్జున, డింపుల్ కపాడియా కూడా కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం రాజ్‌కుమార్, మౌనీ ‘మిషన్ మంగళ్’ టీమ్ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ -
‘నో’ చెబితే ఫీలైపోతారు!
‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. కానీ, సినిమా రంగంలో ఈ పోటీ అధికం. సినిమాకో కథానాయిక పరిచయం అవుతుండటంతో, అప్పటికే ఉన్న తారలతో పాటు కొత్త తారల నుంచి పోటీ ఎక్కువ అవుతోంది’’ అని తాప్సీ అంటున్నారు. ప్రధానంగా హిందీ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వాఖ్యలు చేశారు. హిందీ రంగం గురించి తాప్సీ ఇంకా మాట్లాడుతూ -‘‘ఇక్కడ పోటీ ఎక్కువ. దాంతో పాటు విమర్శలూ ఎక్కువే. ఆ విమర్శల కారణంగా ఒక్కోసారి ఆత్మస్థయిర్యం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే విమర్శలను మనసు వరకూ తీసుకెళ్లకూడదని బలంగా నిర్ణయించుకున్నా’’ అన్నారు. బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తారలు హిందీలో ఎక్కువే అని చెబుతూ -‘‘నాలాంటి అప్ కమింగ్ తారలు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తే అదేదో వింతలా భావిస్తారు. ఏదైనా సినిమాకి ‘నో’ అంటే చాలు, ఫీలైపోతారు. కానీ, ఏ సినిమా పడితే అది చేస్తే కెరీర్ ఎలాగోలా అయిపోతుంది. అందుకే, ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకుని, నా కెరీర్‌కి ఉపయోగపడుతుందనిపించే చిత్రాలు మాత్రమే అంగీకరిస్తున్నా’’ అని తాప్సీ అన్నారు. -
జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’
* జాతీయ అవార్డుల ప్రకటన *షాహిద్ చిత్ర దర్శకుడు మెహతాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం * ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా భాగ్ మిల్కా భాగ్ తెలుగు చిత్రానికి మూడు అవార్డులు న్యూఢిల్లీ: 61వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2013 సంవత్సరానికిగానూ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో హిందీ సినిమాల హవా నడిచింది. ప్రధాన విభాగాలన్నిటిలోనూ బాలీవుడ్ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ‘షిప్ ఆఫ్ థీసీయస్’ (హిందీ-ఇంగ్లిష్) ఎంపికైంది. ఆనంద్ గాంధీకి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. గుర్తింపు, నమ్మకం, మరణం వంటి సంక్లిష్టమైన అంశాలను ‘షిప్ ఆఫ్ థీసీయస్’లో సమర్థవంతంగా తెరకెక్కించడంతో ఆనంద్ గాంధీ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ అజ్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘షాహిద్’ డెరైక్టర్ హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. షాహిద్ చిత్రంలోనే నటించిన రాజ్‌కుమార్ రావ్, మలయాళ చిత్రం పెరారియావతర్లో నటించిన సూరజ్ వెంజారమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా పురస్కారం దక్కించుకున్నారు. హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ 310 చిత్రాలను వడపోసి జాతీయ అవార్డులను ఎంపిక చేసింది. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి, సినీ గీత రచయిత, దర్శకుడు గుల్జార్‌కు అదే రోజు అవార్డు అందించనున్నారు. జాతీయ అవార్డు రావడంతో చాలా ఉద్వేగానికి గురయ్యా అని షిప్ ఆఫ్ థీసీయస్ దర్శకుడు ఆనంద్ గాంధీ చెప్పారు. ఈ అవార్డును షాహిద్ అజ్మీకి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. అవార్డులు ఎవరికి? ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లిష్) ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్-హిందీ) ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (షాహిద్-హిందీ), సూరజ్ వెంజారమూడు(పెరారియావతర్-మలయాళం) ఇద్దరికి సంయుక్తంగా ఉత్తమ నటి: గీతాంజలి థాపా (లయర్స్ డైస్-హిందీ) ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ) ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ఎల్బీ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం(నర్గీస్ దత్ అవార్డు): బాలు మహేంద్ర (తలైమురైగల్-తమిళం) ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ) ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్-బెంగాలీ) ఉత్తమ నేపథ్య గాయని: బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా-మరాఠీ) ఉత్తమ మాటల రచయిత: సుమిత్రా భావే(అస్తు-మరాఠీ) ఉత్తమ పాటల రచయిత: ఎన్ఏ ముత్తుకుమార్ (తంగా మింకాల్-తమిళం) ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేశ్ ఆచార్య(భాగ్ మిల్కా భాగ్-హిందీ) ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్-బెంగాలీ) ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్(హిందీ) తెలుగు వెలుగులు... ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: నా బంగారు తల్లి ఉత్తమ నేపథ్య సంగీతం: శంతనూ మొయిత్రా(నా బంగారు తల్లి) స్పెషల్ జ్యూరీ పురస్కారం: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి) ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు) -
అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు!
‘‘భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె అలా అనడానికి కారణం ఉంది. విదేశాల్లో పుట్టి, ఏ హాలీవుడ్ సినిమాలోనో చేస్తే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చేదని, భారతదేశంలో పుట్టడం వల్ల పలు భాషల్లో నటించడానికి కుదురు తోందని అంటున్నారు శ్రుతి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇంకా అంగీకరించాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ మల్టీస్టారర్ ఒకటి. ఇందులో తనను నాయికగా అడిగారని శ్రుతి పేర్కొన్నారు. కానీ, ఇంకా డేట్స్ కేటాయించలేదని, ఇలాంటి ఓ భారీ అవకాశానికి అడగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి డైరీ తిరగేస్తున్నారట. అది సరే.. సినిమాల్లో హీరోలతో ప్రేమలో పడుతుంటారు కదా.. మరి, నిజజీవితం సంగతేంటి? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నేను సింగిల్‌గానే ఉన్నా. సినిమాల పరంగా నా బిజీ షెడ్యూల్ గురించి తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు. ప్రస్తుతం సినిమాల మీదే పూర్తి దృష్టి సారించాను. కష్టపడి పని చేయాలన్నదే నా ధ్యేయం. ప్రతి శుక్రవారం ఏదో ఓ సినిమా వస్తుంది.. పోతుంది. కానీ, చేసిన కృషి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు.