
అల.. విజయాల దారిలో అన్నట్లుగా ఉంది పూజా హెగ్డే కెరీర్. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురములో.. ఇలా వరుస విజయాలతో ఆనందంగా ఉన్నారు పూజా. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారామె. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేకు లెక్కపరంగా చూస్తే తెలుగుకన్నా హిందీ సినిమాల సంఖ్య తక్కువ. మొహంజోదారో, హౌస్‌ఫుల్ 4.. ఇప్పటివరకూ హిందీలో పూజా చేసిన సినిమాలు ఇవే. ఇప్పుడు మూడో సినిమాకి అవకాశం వచ్చిందట. అక్షయ్‌కుమార్ హీరోగా నటించనున్న ‘బచ్చన్ పాండే’లో ఓ కథానాయికగా నటించే చాన్స్ అది. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’కి రీమేక్ అని సమాచారం. ‘వీరమ్’ తమిళంలో పెద్ద హిట్. తెలుగులో పెద్ద హిట్లు చూసిన పూజా హెగ్డేకి ఈ రీమేక్‌లో అవకాశం వచి్చన మాట నిజమే అయితే.. హిందీలోనూ విజయాల దారిలో పడతారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment