Pooja Hegde :అవకాశాల కోసం అలా.. పూజాకెన్ని కష్టాలో..! | Pooja Hegde Shares Glamorous Pics For Movie Chance | Sakshi
Sakshi News home page

Pooja Hegde :అవకాశాల కోసం అలా.. పూజాకెన్ని కష్టాలో..!

Published Sun, Sep 17 2023 9:44 AM | Last Updated on Sun, Sep 17 2023 10:53 AM

Pooja Hegde Shares Glamorous Pics For Movie Chance - Sakshi

తమిళ సినిమా: నటి పూజా హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. బహుశా ఆమె కూడా ఊహించకూడదు. 33 ఏళ్ల బ్యూటీ ముగమూడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరచడంతో ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. అలాంటి సమయంలో టాలీవుడ్‌ పూజాకు చేయూతనిచ్చింది. అక్కడ మొదట్లో ఒకటి రెండు చిత్రాలు పర్వాలేదు అనిపించినా, వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా పూజాహెగ్డే స్టార్‌గా ఎదిగింది.

ఇక అలా వైకుంఠపురం చిత్రం అనుహ్య విజయంతో ప్రముఖ స్టార్స్‌ దృష్టి పూజా హెగ్డేపై పడింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా ఆమె ప్రభాస్‌ సరసన నటించిన రాధేశ్యామ్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌తో కలిసి నటించిన ఆచార్య, తమిళంలో విజయ్‌తో జత కట్టిన బీస్ట్‌, అదేవిధంగా హిందీలో సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన చిత్రం వరసగా విడుదలై ఫ్లాప్‌ కావడంతో పూజ హెగ్డేకు కష్టాలు మొదలయ్యాయి.

అవి తాను మహేష్‌బాబు సరసన నటించడానికి అందగీకరించిన గుంటూరు కారం చిత్రం వరకు వదలలేదు. ఆ అవకాశాన్ని ఈమె చేజేతులారా వదులుకుంది. అలా పూజా హెగ్డే చిత్రాల ఖాతా ఖాళీ అయిపోయింది. దీంతో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టింది. దానికి ఆమె తన అందాలను ఎరవేసే దిశగా పయనం సాగిస్తోంది. రకరకాల ఫొటో సెషన్లు చేయించుకుంటూ ఆ వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. అలాంటి వాటికి యూత్‌ నుంచి స్పందన వస్తున్నా చిత్ర వర్గాల నుంచి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. మరి ఇప్పుడు ఎవరు ఈ బుట్టబొమ్మకు చేయందిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement