Ala Vaikunthapurramuloo ReUnion Event: Stylish Star Allu Arjun Praises Pooja Hegde - Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ నా లక్కీ చామ్‌: అల్లు అర్జున్‌

Published Tue, Jan 12 2021 4:10 PM | Last Updated on Tue, Jan 12 2021 6:50 PM

Allu Arjun Says Pooja Hegde is His Good Luck Charm In Ala Vaikuntapuramlo - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు హీరోహీరోయిన్‌లుగా న‌టించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లక్‌బస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బన్నీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విడుదలై నిన్నటికి(జవవరి 11) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మూవీ యానివర్సరీని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పూజా హెగ్డేతో కలిసి ఉన్న ఫొటోకు ‘నా గుడ్‌ లక్‌ చామ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు‌’ అంటూ షేర్‌ చేశాడు. అంతేగాక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కూడా బన్నీ ఈ సందర్భంగా షేర్‌ చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్‌, సహానటుడు సుశాంత్‌, అల్లు శీరిష్‌లతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్నాడు. (చదవండి: వైరల్‌ అవుతున్న అల్లు అర్జున్‌ జర్నీ సాంగ్‌)

అంతేగాక ఈ కార్యమంలో చిత్ర యూనిట్‌ మొత్తం కలిసి ఉన్న ఫొటోకు ‘వన్‌ ఈయర్‌ రీయూనియన్‌.. నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. మీకేల్లప్పుడు కృతజ్ఞతుడిని’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం బన్నీ క్రియోటివ్‌ డైరెక్టర్‌ సూకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘పుష్పా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా యూనిట్‌లో పనిచేసే ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో ‘పుష్పా’ షూటింగ్‌ నిలిచిపోయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. (చదవండి: ఇకపై నేనేంటో చూపిస్తా.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement